పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : సతీదేవి దక్షయజ్ఞమున కరుగుట

 •  
 •  
 •  

4-56-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

క్షతనయ సతీదేవి విలి యాత్మ
దనమున నుండి జనకుని వనమహిమ
గన చరులు నుతింప నా లకలంబు
విని కుతూహలిని యయి విన్వీథిఁ జూడ.

టీకా:

దక్ష = దక్షుని; తనయ = పుత్రిక; సతీదేవి = సతీదేవి; తవిలి = పూని; ఆత్మ = తన; సదనమున్ = భవనము; నుండి = నుంచి; జనకుని = తండ్రి; సవన = యాగము యొక్క; మహిమన్ = గొప్పదనమును; గగనచరులు = ఆకాశన తిరుగు దేవతలు; నుతింపన్ = స్తుతింపగా; ఆ = ఆ; కలకలంబున్ = శబ్దములను; విని = వినుటచే; కుతూహలిని = కుతూహలము కల ఆమె; అయి = అయ్యి; విన్వీథిన్ = ఆకాశమార్గమును; చూడన్ = చూడగా.

భావము:

దక్షుని కూతురైన సతీదేవి తన ఇంటిలో ఉన్నదై తండ్రి చేస్తున్న యజ్ఞవైభవాన్ని దేవతలు పొగడుతుండగా ఆ కలకలాన్ని విని ఆకాశంవైపు చూడగా...

4-57-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అయ్యవసరంబునఁ దదుత్సవ దర్శన కుతూహలులై సర్వదిక్కుల వారును జనుచుండి; రా సమయంబున.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు; తత్ = ఆ; ఉత్సవము = ఉత్సవమును; దర్శన = చూసెడి; కుతూహలులు = కుతూహలము కలవారు; ఐ = అయ్యి; సర్వ = అన్ని; దిక్కులన్ = దిక్కులందు; వారున్ = ఉండువారు; చనుచుండిరి = వెళ్ళుతూ ఉన్నారు; ఆ = ఆ; సమయంబునన్ = సమయములో.

భావము:

అప్పుడు ఆ యజ్ఞవైభవాన్ని చూడాలనే కుతూహలంతో అన్నిదిక్కులవారు వెళ్తున్నారు. ఆ సమయంలో...

4-58-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నరారు నవరత్న తాటంక రోచులు;
చెక్కుటద్దములతోఁ జెలిమి చేయఁ;
హనీయ తపనీయయ పదకద్యుతు;
లంసభాగంబుల నావరింప;
నంచిత చీనిచీనాంబర ప్రభలతో;
మేఖలాకాంతులు మేలమాడఁ;
జంచల సారంగ చారు విలోచన;
ప్రభలు నల్దిక్కులఁ బ్రబ్బికొనఁగ;

4-58.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మించు వేడుక భర్తృసమేత లగుచు
మానితంబుగ దివ్య విమానయాన
గుచు నాకాశపథమున రుగుచున్న
చర గంధర్వ కిన్నరాంనలఁ జూచి.

టీకా:

తనరారు = అతిశయించిన; నవరత్న = నవరత్నములు పొదిగిన; తాటంక = చెవిదిద్దుల; రోచులు = కాంతులు; చెక్కుడు = చెంపలను; అద్దముల్ = అద్దముల; తోన్ = తోటి; చెలిమి = స్నేహము; చేయన్ = చేస్తుండగ; మహనీయ = గొప్ప; తపనీయ = బంగారముతో; మయ = చేయబడిన; పదక = పతకముల; ద్యుతులు = కాంతులు; అంసభాగములన్ = భుజములపైన; ఆవరింపన్ = పరచుకొనగా; అంచిత = పూజనీయమైన; చీనిచీనాంబర = సన్నని పట్టువస్త్రముల {చీనిచీనాంబరము - చీనీ (చైనా దేశమునుండి వచ్చిన) చీనాంబరము (చైనాగుడ్డ, పట్టువస్త్రము)}; ప్రభల్ = ప్రకాశముల; తోన్ = తోటి; మేఖలా = వడ్డాణపు; కాంతులు = వెలుగులు; మేలము = పరిహాసములు; ఆడన్ = చేస్తుండగ; చంచల = చలిస్తున్న; సారంగ = లేడికన్నులవంటి; చారు = అందమైన; విలోచన = కన్నుల; ప్రభలు = ప్రకాశములు; నల్దిక్కులన్ = నాలుగు దిక్కులందును {నాలుగుదిక్కులు - 1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తర దిక్కులు}; ప్రబ్భికొనగ = పరచుకొనగ.
మించి = అతిశయిచిన; వేడుకన్ = కుతూహలముతో; భర్తృసమేతలు = భర్తతో కూడినవారు; అగుచున్ = అవుతూ; మానితంబు = స్తుతింపదగినవి; కాన్ = అగునట్లుగ; దివ్య = దివ్యమైన; విమాన = విమానములందు; యానలు = ప్రయాణించువారు; అగుచున్ = అవుతూ; ఆకాశ = ఆకాశ; పథంబునన్ = మార్గమున; అరుగుచున్ = వెళుతూ; ఉన్న = ఉన్నట్టి; = ఖచర = ఆకాశమున సంచరిస్తున్న; గంధర్వ = గంధర్వ; కిన్నర = కిన్నర; అంగనలన్ = స్త్రీలను {అంగనలు - అంగములు చక్కగ యున్నవారు, స్త్రీలు}; చూచి = చూసి.

భావము:

నవరత్నాలు తాపిన చెవికమ్మల కాంతులు అద్దాలవంటి చెక్కిళ్ళపై పడుతుండగా, మేలిమి బంగారు పతకాల కాంతులు భుజాలపై వ్యాపించగా, చీని చీనాంబరాల కాంతులు మొలనూళ్ళ కాంతులతో కలిసి మెరుస్తుండగా, లేడికన్నుల వెలుగులు నాలుగు దిక్కులా ప్రసరిస్తుండగా ఉరకలు వేసే ఉత్సాహంతో తమ తమ భర్తలతో కూడి దివ్యవిమానాలను అధిరోహించి దేవతాస్త్రీలు ఆకాశంలో వెళ్తుండగా సతీదేవి చూచి...

4-59-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తి దన పతి యగు నా పశు
తిఁ జూచి సముత్సుకతను భాషించె;"ప్రజా
తి మీ మామ మఖము సు
వ్రమతి నొనరించుచున్న వాఁడఁట వింటే;

టీకా:

సతి = సతీదేవి; తన = తన యొక్క; పతి = భర్త; అగు = అయిన; ఆ = ఆ; పశుపతిన్ = శివుని {పశుపతి - పాశములచే బంధించబడిన సకల జీవులను పాలించు అధిపతి, శివుడు}; చూచి = చూసి; సముత్సకతను = మంచి; ఉత్సుకతనున్ = ఉత్సాహముతో; భాషించెన్ = మాట్లాడెను; ప్రజాపతి = ప్రజాపతి; మీ = మీ యొక్క; మామ = మావగారు; మఖమున్ = యాగమును; సువ్రత = బాగుగా చేయు; మతిన్ = ఉద్దేశ్యముతో; ఒనరించుచున్ = చేస్తూ; ఉన్నవాడట = ఉన్నాడట; వింటే = విన్నావా.

భావము:

అప్పుడు సతీదేవి అతిశయించిన కుతూహలంతో తన ప్రాణేశ్వరుడైన పరమేశ్వరునితో ఇలా అంటోంది “విన్నారా! మీ మావగారు దక్షప్రజాపతి దీక్షాపరుడై యజ్ఞం చేస్తున్నా డట!

4-60-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కావున నయ్యజ్ఞమునకు
నీ విబుధగణంబు లర్థి నేగెద; రదిగో!
దే! మన మిప్పు డచటికిఁ
బోలె నను వేడ్క నాకుఁ బుట్టెడు నభవా!

టీకా:

కావునన్ = అందుచేత; ఆ = ఆ; యజ్ఞమున్ = యాగమున; కున్ = కు; ఈ = ఈ; విబుధ = దేవతల; గణంబుల్ = సమూహములు; అర్థిన్ = కోరి; ఏగెదరు = వెళుతున్నారు; అదిగో = అదిగో; దేవ = దేవుడ; మనము = మనము; ఇపుడున్ = ఇప్పుడు; అచటికిన్ = అక్కడకి; పోవలెను = వెళ్ళవలెను; అని = అని; వేడ్క = వేడుక; నాకున్ = నాకు; పుట్టెడున్ = పుడుతున్నది; అభవా = శివుడ {అభవ - పుట్టుక లేనివాడు, శివుడు}.

భావము:

కనుక ఆ యజ్ఞాన్ని చూదాలనే వేడుకతో అదుగో ఆ దెవతలంతా గుంపులుగా వెళ్తున్నారు. స్వామీ! మనం ఇప్పుడే అక్కడికి వెళ్ళాలనే కోరిక నాకు కలుగుతున్నది.

4-61-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

జ్ఞముఁ గనుగొనఁగా
నా నుజలు భక్తిఁ బ్రాణనాథుల తోడం
బాక వత్తురు; మనముం
బోయిన నే వారి నచటఁ బొడగనఁ గల్గున్.

టీకా:

ఆ = ఆ; యజ్ఞమున్ = యాగమును; కనుగొనగాన్ = చూడవలెనని; నా = నా యొక్క; అనుజలు = చెల్లెళ్ళు {వ్యు. అనుజ - అను (పశ్చాత్) - జాయతే, తన పిమ్మట పుట్టినది. చెల్లెలు}; భక్తిన్ = భక్తితో; ప్రాణనాథుల = భర్తల; తోడన్ = తోటి; పాయక = తప్పక; వత్తురు = వస్తారు; మనమున్ = మనముకూడ; పోయినన్ = వెళ్ళినచో; నేన్ = నేను; వారిన్ = వారిని; అచటన్ = అక్కడ; పొడగనగల్గున్ = చూడగలను.

భావము:

ఆ యజ్ఞాన్ని చూడడానికి నా చెల్లెళ్ళు అందరు, తమ తమ భర్తలతో తప్పకుండా వస్తారు. మనమూ వెళ్ళినట్లయితే అక్కడ వాళ్ళనందరినీ చూచే అవకాశం నాకు కలుగుతుంది.

4-62-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కుని మఖమున కర్థిం
ని నీతోఁ బారిబర్హ సంజ్ఞికతఁ గడుం
రిన భూషణములఁ గై
కొ వేడ్క జనించె నీశ! కుజనవినాశా!

టీకా:

జనకుని = తండ్రి; మఖమున్ = యాగమున; కున్ = కు; అర్థిన్ = కోరి; చని = వెళ్ళి; నీ = నీ; తోడన్ = తోటి; పారిబర్హ = పరిబర్హమని {పరిబర్హము – వ్యు. (వర్హ – బర్హ – పరిభాషణ హంసాచ్ఛాదనేషు, పరి బర్హ ఘఞ)}; సంజ్ఞికతన్ = పేరుతో; కడున్ = మిక్కిలి; తనరిన = అతిశయించిన; భూషణములన్ = ఆభరణములను; కైకొన్ = తీసుకొనవలెనని; వేడ్క = వేడుక, సరదా; జనించెన్ = పుట్టినది; ఈశా = శివా {ఈశుడు - ఈశత్వము కలవాడు, ప్రభువు, శివుడు}; కుజనవినాశ = శివా {కుజనవినాశుడు - కుజనులను (దుష్టులను) వినాశుడు (నాశనము చేయువాడు), శివుడు}.

భావము:

శంకరా! దుష్టజన నాశంకరా! నా తండ్రి చేసే యజ్ఞానికి నీతో వెళ్ళి అక్కడ పరిబర్హం అనబడే నగలను కానుకలుగా పొందాలనే కోరిక పుట్టింది.

4-63-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నాతోడను స్నేహము గల
మాను దత్సోదరీ సమాజము ఋషి సం
ఘాకృత మఖసమంచిత
కేతువుఁ గన వేడ్క గగనకేశ! జనించెన్.

టీకా:

నా = నా; తోడను = తోటి; స్నేహము = ప్రేమ; కల = ఉన్నట్టి; మాతను = తల్లిని; తత్ = ఆమె; సోదరీ = సోదరిల; సమాజమున్ = సమూహమును; ఋషి = ఋషుల; సంఘాత = సమూహము; కృత = చేసిన; మఖ = యాగయు యొక్క; సమ = చక్కగ; అంచిత = అలంకరింపబడిన; కేతువున్ = ధ్వజమును; కనన్ = చూడవలెనని; వేడ్కన్ = వేడుక; గగనకేశ = శివ {గగనకేశుడు - గగన (ఆకాశమే) కేశుడు (శిరోజములు కలవాడు), శివుడు}; జనించెన్ = పుట్టెను.

భావము:

వ్యోమకేశా! నాపై అనురాగం కల తల్లినీ, అక్కచెల్లెండ్రను, ఋషుల సమూహం నిర్వహించే ఆ మహాయజ్ఞానికి చెందిన ధ్వజాన్ని చూడాలని వేడుక పడుతున్నాను.

4-64-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అదియునుం గాక; దేవా! మహాశ్చర్యకరంబై గుణత్రయాత్మకంబగు ప్రపంచంబు భవదీయ మాయా వినిర్మితం బగుటం జేసి నీకు నాశ్చర్యకరంబు గాదు; ఐనను భవదీయ తత్త్వం బెఱుంగఁ జాలక కామినీ స్వభావంబు గలిగి కృపణురాలనై మదీయ జన్మభూమిఁ గనుంగొన నిచ్చగించితి" నని వెండియు నిట్లనియె.

టీకా:

అదియున్ = అంతే; కాక = కాకుండగ; దేవా = దేవుడా; మహా = గొప్ప; ఆశ్చర్యకరంబు = ఆశ్చర్యకరము; ఐ = అయ్యి; గుణత్రయ = త్రిగుణ {త్రిగుణములు - సత్త్వరజస్తమోగుణములు}; ఆత్మకంబు = కూడినది; అగు = అయిన; ప్రపంచంబు = జగము {ప్రపంచంబు - పంచ (5) పంచములు (1పంచభూతములు 2పంచకర్మేంద్రియములు 3పంచజ్ఞానేంద్రియములు 4పంచతన్మాత్రలు 5పంచవాయువులు)చేత ఏర్పడిన సృష్టి, జగము}; భవదీయ = నీ యొక్క; మాయా = మాయచేత; వినిర్మితంబు = విచిత్రముగ నిర్మింపబడినది; అగుటన్ = అగుట; చేసి = వలన; నీకున్ = నీకు; ఆశ్చర్యకరంబు = ఆశ్చర్యకరము; కాదు = కాదు; ఐనను = అయినను; భవదీయ = నీ యొక్క; తత్త్వంబున్ = తత్త్వమును; ఎఱుంగన్ = తెలిసికొన; చాలక = చాలక; కామినీ = స్త్రీ, కోరికలుకోరు; స్వభావంబు = స్వభావము; కలిగి = కలిగినట్టి; కృపణురాలను = దీనురాలను; ఐ = అయ్యి; మదీయ = నా యొక్క; జన్మభూమిన్ = పుట్టిల్లును; కనుగొనన్ = చూడవలెనని; ఇచ్చగించితిని = కోరుతుంటిని; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:

దేవా! అంతేకాక సత్త్వరజస్తమో గుణాత్మకమై మిక్కిలి ఆశ్చర్యకరమైన ఈ ప్రపంచం మీ మాయచేత సృజింపబడింది కనుక మీకు ఆశ్చర్యాన్ని కలిగించదు. అయినా మీ తత్త్వాన్ని తెలిసికొనలేక స్త్రీ స్వభావంతో, స్వార్థంతో నా పుట్టిల్లు చూడాలని ఇష్టపడుతున్నాను.” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నది.

4-65-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"ముమునఁ దన్మఖోద్భవ విభూతిఁ గనుంగొన నన్యకామినుల్
దువులు గట్టి భూషణవిభాసితలై నిజనాథయుక్తలై
కలహంస పాండురసమంచిత దివ్య విమానయానలై
దె చనుచున్నవారు గను భ్రపథంబున నీలకంధరా!

టీకా:

ముదమునన్ = సంతోషముతో; తత్ = ఆ; మఖ = యాగమున; ఉద్భవ = కలుగు; విభూతిన్ = వైభవములను; కనుంగొనన్ = చూచుటకు; అన్య = ఇతర; కామినులు = స్త్రీలు {కామిని - కోరదగినది, స్త్రీ}; పదువులుగట్టి = గుంపులుకట్టి; భూషణ = అలంకారములచే; విభాసితలు = మిక్కిలి ప్రకాశిస్తున్నవారు; ఐ = అయ్యి; నిజ = తమ; నాథ = భర్తలతో; యుక్తలు = కూడినవారు; ఐ = అయ్యి; మద = పరవశిస్తున్న; కలహంస = కలహంసల; పాండుర = తెల్లదనముతో; సమ = చక్కగ; అంచిత = అలంకరింపబడిన; దివ్య = దివ్యమైన; విమాన = విమానములలో; యానలు = ప్రయాణిస్తున్నవారు; ఐ = అయ్యి; అదె = అదిగో; చనుచున్నవారు = వెళ్తున్నారు; కనుము = చూడుము; అభ్ర = ఆకాశ; పథంబునన్ = మార్గములో; నీలకంథర = శివ {నీలకంథరుడు - నీల (నల్లని) కంథర (కంఠము) కలవాడు, శివుడు}.

భావము:

నీలకంఠా! మా తండ్రి మహావైభవోపేతంగా చేసే యజ్ఞాన్ని సందర్శించే నిమిత్తం సంతోషంతో దేవతాస్త్రీలు గుంపులు గుంపులుగా పలువిధాల ఆభరణాలను అలంకరించుకొని భర్తలతో కలిసి రాజహంసల వలె తెల్లని రెక్కలతో కూడిన దివ్య విమానాలు ఎక్కి అదిగో ఆకాశమార్గంలో వెళ్తున్నారు. చూడండి.

4-66-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఘా! విను లోకంబుల
కుని గేహమునఁ గలుగు కల సుఖంబుల్
యలు చని సంప్రీతిం
నుఁగొన కే రీతి నిలుచుఁ గాయము లభవా!

టీకా:

అనఘా = పుణ్యుడ; విను = వినుము; లోకంబులన్ = ప్రపంచములో; జనకుని = తండ్రి; గేహమునన్ = గృహమున; కలుగు = జరుగు; సకల = సమస్తమైన; సుఖంబుల్ = సుఖములు, శుభములు; తనయులు = పుత్రికలు; చని = వెళ్లి; సంప్రీతిన్ = మిక్కిలి యిష్టముతో; కనుగొనకన్ = చూడక; ఏరీతిన్ = ఎలా; నిలుచున్ = నిలబడును; కాయములు = శరీరములు; అభవా = శివ {అభవ - పుట్టుక లేనివాడు, శివుడు}.

భావము:

మహాత్మా! విను. లోకంలో తండ్రి యింట జరిగే శుభకార్యాలను చూడటానికి వెళ్ళకుండా ఏ కుమార్తెల ప్రాణాలు నిలుస్తాయి?

4-67-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

యముఁ బిలువక యుండం
ననుచిత మంటివేని నక గురు సుహృ
జ్జనాయక గేహములకుఁ
నుచుందురు పిలువకున్న జ్జను లభవా!"

టీకా:

అనయమున్ = అవశ్యము; పిలువక = పిలవకుండ; ఉండన్ = ఉండగ; జనన్ = వెళ్ళుట; అనుచితము = తగనిది; అంటివేని = అంటే; జనక = తండ్రి; గురు = గురువు; సుహృత్ = స్నేహితుడు; జననాయక = రాజు {జననాయక - ప్రజలకు నాయకుడు, రాజు}; గేహముల్ = గృహముల; కున్ = కు; చనుచుందురు = వెళ్తుంటారు; పిలవకున్నన్ = పిలవకపోయిన; సజ్జనులు = మంచివారు; అభవా = శివ.

భావము:

అభవా! పిలువకుండా వెళ్ళడం తగదని మీరు అనవచ్చు. తండ్రి, గురువు, మిత్రులు, రాజు మొదలైనవారి యిండ్లకు పిలువకపోయినా సజ్జనులైనవారు వెళ్తారు కదా!

4-68-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని మఱియు నిట్లనియె “దేవా! నా యందుఁ బ్రసన్నుండవై మదీయ మనోరథంబుం దీర్ప నర్హుండవు; సమధిక జ్ఞానంబు గల నీచేత నేను భవదీయదేహంబు నందర్ధంబున ధరియింపంబడితి; నట్టి నన్ను ననుగ్రహింపవలయు” నని ప్రార్థించిన మందస్మితవదనారవిందుం డగుచు జగత్స్రష్టల సమక్షంబున దక్షుండు తన్నాడిన మర్మభేదంబు లైన కుహక వాక్యసాయకంబులం దలంచుచు నిట్లనియె.

టీకా:

అని = అని; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఇలా; అనియెన్ = పలికెను; దేవా = దేవుడ; నా = నా; అందున్ = ఎడల; ప్రసన్నుండవు = సుముఖుడవు; ఐ = అయ్యి; మదీయ = నా యొక్క; మనోరథంబున్ = కోరికను {మనోరథము - మనసున ధరించినది, కోరిక}; తీర్పన్ = తీర్చుటకు; అర్హుండవు = తగినవాడవు; సమ = మిక్కిలి; అధిక = అధికమైన; జ్ఞానంబు = జ్ఞానము; కల = కలిగినట్టి; నీ = నీ; చేతన్ = చేత; నేను = నేను; భవదీయ = నీ యొక్క; దేహంబునన్ = దేహమందు; అర్ధంబునన్ = సగములో; ధరియింపంబడితిని = ధరింపబడితిని; అట్టి = అటువంటి; నన్నున్ = నన్ను; అనుగ్రహింపవలయును = అనుగ్రహించవలసినది; అని = అని; ప్రార్థించిన = ప్రార్థించగ; మందస్మిత = చిరునవ్వుగల; వదన = మోము యనెడి; అరవిందుండు = పద్మముగలవాడు; అగుచున్ = అవుతూ; జగత్ = లోకములకు; స్రష్టలు = సృష్టికారకుల; సమక్షంబునన్ = ఎదుట; దక్షుండు = దక్షుడు; తన్నున్ = తనను; ఆడిన = అడినట్టి; మర్మభేదంబులు = మనసుకు కష్టము కలిగించునవి; ఐన = అయినట్టి; కుహక = కపట; వాక్య = మాటలు యనెడి; సాయకంబులన్ = బాణములను; తలంచుచున్ = తలచుకొంటూ; ఇట్లు = ఇలా; అనియెన్ = పలికెను.

భావము:

అని చెప్పి సతీదేవి మళ్ళీ ఇలా అన్నది “దేవా! నా పట్ల ప్రసన్నబుద్ధితో నా కోరికను తీర్చగలవాడవు నీవు. జ్ఞానవంతుడవైన నీచేత అర్ధశరీరాన్ని పొందినదానను. అటువంటి నన్ను అనుగ్రహించు” అని ప్రార్థించగా శివుడు చిరునవ్వు నవ్వుతూ పూర్వం సృష్టికర్తలైన ప్రజాపతుల సన్నిధిలో దక్షుడు తనను పలికిన బాణాలవంటి మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని సతీదేవితో ఇలా అన్నాడు.

4-69-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"ల్యాణి నీ మాట డు నొప్పు; బంధువుల్;
పిలువకుండినను సంప్రీతిఁ జనుదు
రంటి; విదియు లెస్స యైనను దేహాభి;
మాన మదము ననర్షమునను
డఁగి యారోపిత న కోపదృష్టులు;
గారేనిఁ బోఁదగుఁ గాని వినుము
వినుత విద్యా తపోవిత్త వయో రూప;
కులములు సుజనులకును గుణంబు;

4-69.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లివియ కుజనులయెడ దోషహేతుకంబు
లై వివేకంబు చెఱుచు; మహాత్ములైన
వారి మాహాత్మ్యమాత్మ గర్వమునఁ జేసి
డులు పొడగానఁ జాలరు లజనేత్ర!

టీకా:

కల్యాణి = కల్యాణములు కలిగించుదానా; నీ = నీ; మాటన్ = మాటలు; కడున్ = మిక్కిలి; ఒప్పు = సరియైనవి; బంధువుల్ = బంధువులు; పిలవకుండినను = పిలవకపోయినను; సంప్రీతిన్ = ప్రీతితో; చనుదురు = వెళ్తారు; అంటివి = అన్నావు; ఇదియున్ = ఇదికూడ; లెస్స = సరియైనదే; ఐనను = అయినప్పటికిని; దేహా = దేహమునందలి; అభిమాన = అభిమానమువలని; మదమునన్ = పొగరు; అమర్షమునను = ఓర్వలేనితనమునను; కడగి = పూని; = ఆరోపిత = ఎక్కింపబడిన; ఘన = అధికమైన; కోప = కోపముతోకూడిన; దృష్టులు = చూపులు కలవారు; కారేని = కాకపోతే; పోన్ = వెళ్ళుటకు; తగున్ = తగును; కాని = కాని; వినుము = వినుము; వినుత = ప్రసిద్ధి చెందిన; విద్యా = విద్యలు; తపస్ = తపోశక్తి; విత్త = ధనము; వయస్ = వయస్సు; రూప = సౌందర్యము; కులములు = కులములు; సుజనుల్ = మంచివారి; కును = కి యైతే; గుణంబులు = సుగుణములు. ఇవియ = ఇవే;
కుజనుల = దుష్టుల; ఎడన్ = అందు; దోష = పాపమునకు; హేతుకంబులు = కారణభూతములు; ఐ = అయ్యి; వివేకంబున్ = వివేకమును; చెఱచున్ = చెడగొట్టును; మహాత్ములు = గొప్పవారు; ఐన = అయిన; వారి = వారి; మహాత్మ్యము = గొప్పదనము; ఆత్మ = తమ; గర్వమునన్ = గర్వము; చేసి = వలన; జడులు = తెలివితక్కువవాడు; పొడగనజాలరు = చూడలేరు; జలజనేత్ర = స్త్రీ {జలజనేత్ర - జలజము (నీటపుట్టు పద్మము) వంటి కన్నులు ఉన్నామె, స్త్రీ}.

భావము:

“దేవీ! నీ మాటలు ఎంతో యుక్తంగా ఉన్నాయి. బంధువులు పిలువకపోయినా ప్రాజ్ఞులైనవారు ప్రీతితో వెళ్తారని నీవు చెప్పింది కూడా బాగుంది. దేహాభిమానం వల్ల కలిగిన మందం చేతనూ, ఆగ్రహావేశం చేతనూ వారు ద్వేష రోషాలను ప్రదర్శించకపోతే వెళ్ళవచ్చు. కాని నీ తండ్రి సరసుడు కాడు. విను. విద్య, తపస్సు, ధనం, వయస్సు, రూపం, కులం అనేవి మంచివారికి సుగుణాలే కాని చెడ్డవారి విషయంలో ఇవే గుణాలు దోషకారణాలై వారి బుద్ధిని పాడు చేస్తాయి. పద్మాక్షీ! మందబుద్ధులు మదోన్మత్తులై మహాత్ముల గొప్పతనాన్ని గుర్తించలేరు.

4-70-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విను; మట్టి కుటిలు లగు దు
ర్జనుల గృహంబులకు బంధురణిని బోవం
దు; వినీతుల కది గడు
నుచిత మైనట్ల యుండు; ది యెట్లనినన్.

టీకా:

వినుము = వినుము; ఇట్టి = ఇటువంటి; కుటిలులు = వంకర బుద్ధి కలవారు; అగు = అయిన; దుర్జనుల = దుష్టుల; గృహంబుల్ = ఇళ్ళ; కున్ = కి; బంధు = బంధుత్వపు; సరణిన్ = వరస చూసి; పోవన్ = పోవుట; చనదు = తగదు; వినీతుల్ = మిక్కిలి నీతిమంతుల; కున్ = కి; అది = అది; కడున్ = మిక్కిలి; అనుచితమున్ = ఉచితముకానిది; ఐనట్లు = అయినవిధముగ; ఉండున్ = ఉండును; అది = అది; ఎట్లు = ఎలా; అనినన్ = అంటే.

భావము:

సతీ! విను. అటువంటి కపట బుద్ధులైన దుర్జనుల ఇండ్లకు చుట్టరికాన్ని పాటించి వెళ్ళడం వివేకవంతులైన వారికి తగని పని. అది ఎలాగంటే...

4-71-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కుటిలబుద్ధు లయిన కుజనుల యిండ్లకు
నార్యు లేగ, వా రనాదరమున
బొమలు ముడిపడంగ భూరి రోషాక్షులై
చూతు; రదియుఁ గాక సుదతి! వినుము.

టీకా:

కుటిలబుద్ధులు = వంకర బుద్ధి కలవారు; అయిన = అయినట్టి; కుజనుల = చెడ్డవారి; ఇండ్ల = గృహముల; కున్ = కి; ఆర్యులు = పూజనీయులు; ఏగన్ = వెళ్లగా; వారున్ = వారు; అనాదరమునన్ = తిరస్కారముతో; బొమలు = కనుబొమలు; ముడిపడంగ = చిట్లించి; భూరి = అత్యధికమైన {భూరి - అతిపెద్దదైన సంఖ్య 10 తరువాత 34 సున్నాలు అదే కోటికైతే 7 సున్నాలే}; రోష = రోషముతో కూడిన; అక్షులు = కన్నులు కలవారు; ఐ = అయ్యి; చూతురు = చూసెదరు; అదియున్ = అంతే; కాక = కాకుండ; సుదతి = స్త్రీ; వినుము = వినుము.

భావము:

కుటిల స్వభావం కల దుర్జనుల గృహాలకు సుజనులు వెళ్ళరు. అలా వెళ్ళినట్లయితే ఆ దుష్టులు కనుబొమలు చిట్లించి ద్వేషంతో రోషంతో ఉరిమి ఉరిమి చూస్తారు. సతీ! అంతేకాదు, విను.

4-72-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ద రిపుప్రయుక్త పటుసాయక జర్జరితాంగుఁ డయ్యు దుః
మును దొఱంగి నిద్రఁగనుఁ గాని కృశింపఁడు మానవుండు; నో!
యు! విను మిష్ట బాంధవదురుక్తులు మర్మము లంట నాఁటఁ జి
త్తమున నహర్నిశంబుఁ బరితాపము నొంది కృశించు నెప్పుడున్.

టీకా:

సమద = మదముతో కూడిన; రిపు = శత్రువుచే; ప్రయుక్త = ప్రయోగింపబడిన; పటు = గట్టి; సాయక = బాణములచేత; జర్జరిత = పెక్కు గాయము లయిన; అంగుడు = దేహము కలవాడు; అయ్యున్ = అయినప్పటికిని; దుఃఖమునున్ = దుఃఖమునుండి; తొఱంగి = విడిచిపెట్టి; నిద్రన్ = నిద్రను; కనున్ = పొందును; కాని = కాని; కృశింపడు = కృశించిపోడు; మానవుండు = మానవుడు, మానము కలవాడు; ఓ = ఓ; ఉమ = పార్వతీదేవి; వినుము = వినుము; ఇష్ట = కావలసిన; బాంధవ = బంధువుల; దురుక్తులు = చెడ్డమాటలు; మర్మములన్ = మనసు లోతులను, జీవస్థానమును; అంటనాట = గట్టిగ గుచ్చుకోగా; చిత్తమునన్ = మనసులో; అహర్నిశము = రాత్రింబవళ్లు; పరితాపమున్ = సంతాపమును; ఒంది = పొంది; కృశించున్ = కృశించిపోవును; ఎప్పుడున్ = ఎప్పుడైనాసరే.

భావము:

బలవంతుడైన శత్రువు ప్రయోగించిన బాణాలచేత శరీరం తూట్లు పడినా ఆ బాధను భరించి వ్యక్తి ఎలాగో నిద్రపోతాడు కాని క్రుంగి కృశించిపోడు. సతీ! దగ్గరి చుట్టాల దురహంకారంతో కూడిన దుర్భాషలు గుండెల్లో లోతుగా నాటుకొని మాటిమాటికి బాధ కలిగిస్తూ అహర్నిశం కృశింపజేస్తాయి.

4-73-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విను లోకోత్కృష్టుఁడు ద
క్షునికిఁ దనూభవలలోనఁ గూరిమిసుతవై
ను నా సంబంధంబున
కునిచేఁ బూజఁ బడయఁజాలవు తరుణీ!

టీకా:

విను = వినుము; లోకన్ = లోకమునకు; ఉత్కృష్టుడు = శ్రేష్ఠుడు; దక్షుని = దక్షుని; కిన్ = కి; తనూభవలు = సంతానము {తనూభవ - తనూ (దేహమున) భవ (పుట్టినవారు)}; లోనన్ = అందు; కూరిమి = ఇష్టమైన; సుతవు = కూతురవు; ఐనను = అయినప్పటికిని; నా = నా ఎడలి; సంబంధంబునన్ = సంబంధమువలన; జనకుని = తండ్రి; చేన్ = చేత; పూజన్ = పూజలను; పడయజాలవు = పొందలేవు; తరుణీ = స్త్రీ {తరుణి - తరుణ వయసుననున్నామె, స్త్రీ}.

భావము:

తరుణీ! విను. లోకాలన్నిటికీ గొప్పవాడైన దక్షునికి తన కుమార్తె లందరిలోనూ నీవు మిక్కిలి ప్రియమైన కూతురువైనా నా సంబంధం వల్ల నీ తండ్రి నిన్ను గౌరవించడు.

4-74-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అది యెట్లతనిచేత భవత్సంబంధంబునం జేసి పూజఁబడయమికి నతనికి నీకు విరోధంబునకు హేతు వెట్టి దని యంటివేని.

టీకా:

అది = అది; ఎట్లు = ఏలా; అతని = అతని; చేతన్ = చేత; భవత్ = నీయందలి; సంబంధంబునన్ = సంబంధము; చేసి = వలన; పూజన్ = పూజలను; పడయమి = పొందలేకపోవుట; కిన్ = కి; అతని = అతని; కిన్ = కి; నీకు = నీకు; విరోధంబున్ = శత్రుత్వమున; కున్ = కు; హేతువు = కారణము; ఎట్టిది = ఎటువంటిది; అని = అని; అంటివేని = అంటుంటే.

భావము:

‘అది ఎలా? నీ సంబంధం చేత నాకు గౌరవం లభించక పోవడానికి, నీకూ అతనికి విరోధం కలగడానికి కారణమేమిటి?’ అని నీవు అడిగితే...

4-75-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నిహంకార నిరస్తపాప సుజనానింద్యోల్ల సత్కీర్తిఁ గొం
ఱు కామించి యశక్తులై మనములన్ దందహ్యమానేంద్రియా
తురులై యూరక మచ్చరింతురు; మహాత్ముం డీశ్వరుం డైన యా
రితో బద్ద విరోధముం దొడరు దైత్యశ్రేణి చందంబునన్.

టీకా:

నిరహంకార = అహంకారములేని; నిరస్త = పోగొట్టుకొనిన; పాప = పాపములు కలిగిన; సుజనా = మంచివారి; అనింద్య = నిదింపదగనివారి; ఉల్లసత్ = ప్రకాశిస్తున్న; కీర్తిన్ = కీర్తిని; కొందఱు = కొంతమంది; కామించి = కోరుకొని; అశక్తులు = శక్తిలేనివారు; ఐ = అయ్యి; మనములన్ = మనసులలో; దందహ్యమాన = దహింపబడుతున్న; ఇంద్రియ = ఇంద్రియముల; ఆతురులు = బాధలు గలవారు; ఐ = అయ్యి; ఊరక = ఉట్టినే; మచ్చరింతురు = ఈర్ష్యవహింతురు; మహాత్ముండు = గొప్పవాడు; ఈశ్వరుడున్ = భగవంతుడును; ఐన = అయిన; ఆ = ఆ; హరి = విష్ణువు; తోన్ = తోటి; బద్ధ = మిక్కిలి; విరోధమున్ = శత్రుత్వమున; తొడరు = పూనుకొను; దైత్య = దానవుల {దైత్యులు - దితి యొక్క పుత్రులు, దానవుల}; శ్రేణి = సమూహము; చందంబునన్ = వలె.

భావము:

అహంకారం, పాపం లేని సజ్జనులు పొందే కీర్తిని తాముకూడా పొందాలని కోరుకొని కొందరు అసమర్థులై మనసులో కుతకుత ఉడికిపోయి, భగవంతుడైన హరితో వైరం పెంచుకొన్న రాక్షసులవలె ఆ సజ్జనులపై అసూయ పెంచుకుంటారు.

4-76-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అదియునుం గాక, నీ వతనికిం బ్రత్యుత్థానాభివందనంబులు గావింపకుండుటం జేసి యతండు తిరస్కృతుండయ్యె నంటివేని లోకంబున జను లన్యోన్యంబును బ్రత్యుత్థానాభివందనంబులు గావింతు; రదియ ప్రాజ్ఞ లయినవారు సర్వభూతాంతర్యామి యైన పరమపురుషుండు నిత్యపరిపూర్ణుండు గావునఁ గాయికవ్యాపారం బయుక్తం బని తదుద్దేశంబుగా మనంబునంద నమస్కారాదికంబులు గావింతురు; గాని దేహాభిమానంబులు గలుగు పురుషులందుఁ గావింపరు; కాన యేనును వాసుదేవ శబ్దవాచ్యుండు శుద్ధసత్త్వమయుండు నంతఃకరణంబు నందు నావరణ విరహింతుడు నయి ప్రకాశించు వాసుదేవునకు నా హృదయంబున నెల్లప్పుడు నమస్కరించుచుండుదు; ఇట్ల నపరాధినైన నన్నుఁ బూర్వంబున బ్రహ్మలు చేయు సత్రంబు నందు దురుక్తులం జేసి పరాభవించి మద్ద్వేషి యైన దక్షుండు భవజ్జనకుం డైన నతఁడును దదనువర్తు లయిన వారలును జూడఁ దగరు; కావున మద్వచనాతిక్రమంబునం జేసి యరిగితివేని నచట నీకుఁ బరాభవంబు సంప్రాప్తం బగు; లోకంబున బంధుజనంబులవలనఁ బూజ బడయక తిరస్కారంబు వొందుట చచ్చుటయ కాదే;” యని పలికి మఱియు నభవుండు, పొమ్మని యనుజ్ఞ యిచ్చిన నచ్చట నవమానంబునం జేసి యశుభం బగు ననియు; నిచ్చటఁ బొమ్మనక నివారించిన మనోవేదన యగు ననియు మనంబునం దలపోయుచు నూరకుండె; అంత.

టీకా:

అదియున్ = అంతే; కాక = కాకుండగ; నీవు = నీవు; అతనికిన్ = అతనికి; ప్రత్యుత్థాన = లేచి ఎదుర్కొనుట; అభివందనంబులున్ = నమస్కారములు; కావింపకుండుటన్ = చేయకపోవుట; చేసి = వలన; అతండు = అతడు; తిరస్కృతుండు = వ్యతిరేక భావము అదినవాడు; అయ్యెన్ = ఆయెను; అంటివేని = అన్నట్లయితే; లోకంబునన్ = లోకములో; జనులు = ప్రజలు; అన్యోన్యంబును = ఒకరికొకరు; ప్రత్యుత్థాన = లేచి ఎదుర్కొనుట; అభివందనంబులున్ = నమస్కారములు; కావింతురు = చేయుదురు; అదియ = అదే; ప్రాజ్ఞలు = ప్రజ్ఞకలవారు; అయినవారు = అయినవారు; సర్వ = అన్ని; భూత = భూతముల; అంతర్యామి = లోపలనుండువాడు; ఐన = అయిన; పరమపురుషుండు = పరమపురుషుడు; నిత్య = శాశ్వతుడు; పరిపూర్ణుండున్ = పరిపూర్ణుడును; కావునన్ = అగుటచేత; కాయిక = శారీరిక; వ్యాపారంబు = కృత్యము; అయుక్తంబు = తగినదికాదు; అని = అని; తత్ = ఆ; ఉద్దేశంబుగా = భావముతో; మనంబున్ = మనసు; అంద = లోనే; నమస్కార = నమస్కారము; ఆదికంబున్ = మొదలైనవి; కావింతురు = చేసెదరు; కాని = కాని; దేహా = దేహములయందు; అభిమానములు = మమకారములు; కలుగు = కలిగి ఉండు; పురుషుల = పురుషుల; అందున్ = ఎడల; కావింపరు = చేయరు; కాన = కావున; ఏనును = నేనుకూడ; వాసుదేవ = వాసుదేవుడు అనెడి; శబ్ద = మాటచే; వాచ్యుండు = చెప్పదగినవాడు; శుద్ధ = అమలిన; సత్త్వ = సత్త్వగుణములతో; మయుండు = కూడినవాడు; అంతఃకరణంబు = మనసుల; అందున్ = లో; ఆవరణ = పొరలు; విరహితుండు = పూర్తిగ లేనివాడు; అయి = అయ్యి; ప్రకాశించు = విలసిల్లు; వాసుదేవున్ = వాసుదేవుని; కున్ = కి; నా = నా; హృదయంబునన్ = మనసులో; ఎల్లప్పుడున్ = ఎప్పుడును; నమస్కరించుచున్ = నమస్కరిస్తూ; ఉండుదు = ఉంటాను; ఇట్లు = ఈ విధముగ; అనపరాధిని = అపరాధము లేనివాడను; ఐన = అయిన; నన్నున్ = నన్ను; పూర్వంబునన్ = ఇంతకుముందు; బ్రహ్మలు = బ్రాహ్మనిష్ఠులు; చేయు = చేసెడి; సత్రంబున్ = యాగము; అందున్ = లో; దురుక్తులున్ = చెడుమాటలు, తిట్లు; చేసి = వలన; పరాభవించి = అవమానించి; మత్ = నన్ను; ద్వేషి = ద్వేషించువాడు; ఐన = అయిన; దక్షుండు = దక్షుడు; భవత్ = నీ యొక్క; జనకుండు = తండ్రి; ఐనన్ = అయినప్పటికిని; అతడు = అతడు; తత్ = అతని; అనువర్తులు = అనుసరించి వర్తించువారు; అయిన = అయిన; వారలును = వారుకూడ; చూడన్ = దర్శించుటకు; తగరు = తగినవారుకాదు; కావునన్ = అందుచేత; మత్ = నా యొక్క; వచన = మాటలను; అతిక్రమంబునన్ = ఉల్లంఘించుట; చేసి = చేసి; అరిగితివేని = వెళితే; అచటన్ = అక్కడ; నీకున్ = నీకు; పరాభవంబున్ = అవమానములు; సంప్రాప్తంబు = కలుగుట; అగు = జరుగును; లోకంబునన్ = లోకములో; బంధుజనంబుల = బంధువులు అయిన జనముల; వలనన్ = వలన; పూజన్ = గౌరవములు; పడయక = పొందక; తిరస్కారంబున్ = వ్యతిరిక్తతను; ఒందుట = పొందుట; చచ్చుటయ = చనిపోవుటయే; కాదే = కాదా; అని = అని; పలికి = చెప్పి; మఱియున్ = మరి; అభవుండు = శివుడు; పొమ్మని = వెళ్లుటకు; అనుజ్ఞ = అనుమతి; ఇచ్చిన = ఇస్తే; అచ్చటన్ = అక్కడ; అవమానంబునన్ = అవమానములు; చేసి = వలన; అశుభంబున్ = అశుభాలు; అగున్ = అవును; అనియున్ = అని మరి; ఇచ్చటన్ = ఇక్కడ; పొమ్మనక = పోవద్దని; నివారించిన = ఆపిన; మనోవేదన = మానసికవ్యధ; అగును = అవుతుంది; అనియున్ = అని; మనంబునన్ = మనసు; అందల = లోపల; తలపోయుచు = అనుకొనుచు; ఊరకుండె = ఊరుకున్నాడు; అంత = అంతట.

భావము:

అంతే కాక ‘నీవు ఆయనను చూచి లేచి ఎదురు వెళ్ళలేదు. అందువల్ల అవమానం భరించలేక పగ పెంచుకున్నాడు’ అని నీవు అనవచ్చు. లోకంలో సామాన్యజనులు ఒకరికొకరు ఎదురు వెళ్ళి నమస్కరిస్తారు. ప్రాజ్ఞులైనవారు భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి శరీర నమస్కారం తగదని ఆయనను ఉద్దేశించి మనస్సులోనే నమస్కారం మొదలైనవి చేస్తారు. అంతేకాని, దేహాభిమానం కల పురుషులకు శరీర నమస్కారం చేయరు. అందువల్ల నేను భగవంతుడు, కేవల సత్త్వగుణ సంపన్నుడు, అంతరంగంలో నిరంతరం ఉండేవాడు అయిన వాసుదేవునకు నా హృదయంలోనే నమస్కరిస్తూ ఉంటాను. ఏ పాపమూ ఎరుగని నన్ను పూర్వం ప్రజాపతులు చేసే యజ్ఞంలో నీ తండ్రి నిందించి పరాభవించాడు. అందువల్ల దక్షుడు నాతో విరోధం కొనితెచ్చుకున్నాడు. నన్ను ద్వేషించే దక్షుడు, అతని అనుచరులు నీకు చూడదగనివారు. నా మాట కాదని వెళ్ళినట్లయితే అక్కడ నీకు అవమానం జరిగి తీరుతుంది. లోకంలో బంధువులచేత గౌరవం పొందకుండా అవమానం పొందడం మరణంతో సమానం కదా!” అని చెప్పి శంకరుడు సతీదేవిని పొమ్మని అనుజ్ఞ ఇస్తే అక్కడ అవమానం జరిగి హాని కలుగుతుందని, పోవద్దని అడ్డుపడితే సతీదేవి మనస్సుకు కష్టం కలుగుతుందని తన మనస్సులో భావించి, ఎటూ చెప్పకుండా మౌనం వహించాడు. అప్పుడు...

4-77-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తి సుహృద్దర్శనేచ్ఛా ప్రతికూల దుః;
స్వాంత యగుచు నంములు వడఁక
నందంద తొరఁగెడు శ్రుపూరంబులు;
గండభాగంబులఁ డలుకొనఁగ
నున్నత స్తనమండలోపరిహారముల్;
వేఁడి నిట్టూర్పుల వెచ్చఁ గంద
తిశోకరో షాకులాత్యంత దోదూయ;
మానమై హృదయంబు లఁగుచుండ

4-77.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఱియుఁ గుపితాత్మయై స్వసమానరహితు
నాత్మదేహంబు సగ మిచ్చి ట్టి భవుని
విడిచి మూఢాత్మ యగుచు న వ్వెలఁది జనియె
నకుఁ జూచెడు వేడుక సందడింప.

టీకా:

సతి = సతీదేవి; సుహృత్ = బంధువులను; దర్శన = చూసే; ఇచ్చా = కోరికకు; ప్రతికూల = వ్యతిరేకమువలని; దుఃఖ = దుఃఖముకల; స్వంత = మనసుకలిగినది; అగుచున్ = అవుతూ; అంగములు = అవయవములు; వడకన్ = వణుకుతుండగ; అందంద = అక్కడక్కడ; తొరగెడు = జారెడు; అశ్రుపూరంబులు = కన్నీటిజాళ్ళు; గండభాగంబులన్ = చెక్కిళ్ళపై; కడలుకొనగ = వ్యాపిస్తుండగ; ఉన్నత = ఎత్తైన; స్తన = కుచ; మండల = ప్రాంతము; ఉపరి = పైనున్న; హారముల్ = హారములు; వేడి = వెచ్చటి; నిడు = దీర్ఘమైన; ఊర్పులన్ = ఊపిరులవలన; వెచ్చన్ = వేడిని; అందన్ = చెందగ; అతి = మిక్కిలి; శోక = శోకము; రోషా = రోషములతో; ఆకుల = చీకాకుచేత; అత్యంత = అతిమిక్కిలి; దోదూయమానము = చలించిపోయినది; ఐ = అయ్యి; హృదయంబున్ = మనసు; మలగుచున్ = బాధపడుతుండగ.
మఱియున్ = ఇంకను; కుపిత = కోపముచెందిన; ఆత్మ = మనలుకలది; ఐ = అయ్యి; స్వ = తనకు; సమాన = సమానమైనవారు; రహితున్ = లేనివాని; ఆత్మ = తన; దేహంబున్ = దేహమును; సగము = అర్థము; ఇచ్చిన = ఇచ్చిన; అట్టి = అటువంటి; భవుని = శివుని; విడిచి = వదలి; మూఢాత్మ = తెలివిహీన; అగుచున్ = అవుతూ; ఆ = ఆ; వెలది = స్తీ; చనియెన్ = వెళ్ళెను; జనకున్ = తండ్రి; చూచెడు = చూసే; వేడుక = కుతూహలము; సందడింపన్ = తొందరపెట్టగ.

భావము:

తన బంధువులను చూడాలనే కుతూహలం సఫలం కాకపోవడం వల్ల సతీదేవి మనస్సులో దుఃఖం పొంగి పొరలింది. అవయవాలు కంపించాయి. కన్నీళ్ళు చెక్కిళ్ళపై జాలువారాయి. వక్షస్థలం మీది హారాలు నిట్టూర్పుల వేడికి కందిపోయాయి. శోకంతో కోపాతిరేకంతో సతీదేవి మనస్సు చలించి కలత చెందింది. ఆ కోపంలో ఆమె వివేకం కోల్పోయింది. తనతో సరిసమానుడు లేని స్వామిని, తన శరీరంలో సగమిచ్చిన తన స్వామిని, పరమేశ్వరుణ్ణి విడిచిపెట్టి తండ్రిని చూడాలనే కుతూహలం అతిశయించగా ఒంటరిగా పుట్టింటికి బయలుదేరింది.

4-78-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇ ట్లతి శీఘ్రగమనంబున.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; అతి = మిక్కిలి; శ్రీఘ్ర = వేగమైన; గమనంబున = గమనముతో, పోకతో.

భావము:

ఈవిధంగా మిక్కిలి వేగముగా ప్రయాణం చేసి...

4-79-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మానిని చనుచుండ ణిమన్మదాది స;
స్ర సంఖ్యాత రుద్రానుచరులు
క్షులు నిర్భయులై వృషభేంద్రుని;
మున్నిడు కొనుచు నమ్ముదిత దాల్చు
కందుకాంబుజ శారికా తాళవృంత ద;
ర్పణ ధవళాతపత్రప్రసూన
మాలికా సౌవర్ణణివిభూషణ ఘన;
సార కస్తూరికా చందనాది

4-79.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

స్తువులు గొంచు నేగి శర్వాణిఁ గదిసి
శంఖ దుందుభి వేణు నిస్వనము లొప్ప
మానితంబైన వృషభేంద్రయానఁ జేసి
జ్ఞభూమార్గులై యర్థి రిగియరిగి.

టీకా:

మానిని = స్త్రీ {మానిని - మానము గలామె, స్త్రీ}; చనుచుండన్ = వెళ్తుండగ; మణిమత్ = మణిమంతుడు; మద = మదుడు; ఆది = మొదలగువారు; సహస్ర = వేల; సంఖ్యాక = కొలది; రుద్ర = శివుని; అనుచరులు = అనుయాయులు; యక్షులు = యక్షులు; నిర్భయులు = భయము లేనివారు; ఐ = అయ్యి; వృషభేంద్రుని = నందీశ్వరుని; ముందు = ముందట; ఇడుకొనుచు = ఉండుకొని; ఆ = ఆ; ముదిత = స్త్రీ {ముదిత - ముదము (సంతోషమును) ఇచ్చునది, స్త్రీ}; తాల్చు = ధరించు; కందుక = చెండ్లు; అంబుజ = పద్మములు; శారికా = చిలుకలు; తాళవృంత = తాటాకు విసనకర్రలు; దర్పణ = అద్దము; ధవళ = తెల్లని; అతపత్ర = గొడుగు; ప్రసూన = పూల; మాలిక = మాలలు; సౌవర్ణ = బంగారు; మణి = రత్న; విభూషణ = ఆభరణములు; ఘనసార = పచ్చకర్పూరము; కస్తూరిక = కస్తూరి; చందన = గంధము; ఆది = మొదలైన.
వస్తువులు = సామాను; కొంచున్ = తీసుకొని; ఏగి = వెళ్ళి; శర్వాణిన్ = సతీదేవిని {శర్వాణి - శర్వుని భార్య, సతి}; కదిసి = చేరి; శంఖ = శంఖము; దుందుభి = దుందుభి; వేణు = వేణువుల; నిస్వనములు = శబ్దములు; ఒప్పన్ = ఒప్పునట్లు; మానితంబు = గౌరవింపదగినది; ఐన = అయిన; వృషభేంద్రుని = నందీశ్వరునిపై; యానన్ = ప్రయాణించు దానిని; చేసి = చేసి; యజ్ఞ = యజ్ఞము జరుగు; భూ = ప్రదేశమునకు వెళ్ళు; మార్గులు = మార్గమున పోవువారు; ఐ = అయ్యి; అర్థిన్ = కోరి; అరిగియరిగి = వెళ్ళి.

భావము:

సతీదేవి వెళ్తుండగా మణిమంతుడు మొదలైన వేలకొలది ప్రమథులు, యక్షులు నందీశ్వరుని ముందు పెట్టుకొని బయలుదేరారు. ఆమెకు కావలసిన పూబంతులు, పద్మాలు, గోరువంకలు, విసనకర్రలు, అద్దాలు, వెల్లగొడుగు, పూలదండలు, మణులు కూర్చిన బంగారు నగలు, పచ్చకర్పూరం, కస్తూరి, మంచిగంధం మొదలైన వస్తువులను వెంట తీసుకొని వెళ్ళి ఆమెను కలుసుకున్నారు. సతీదేవిని వృషభవాహనంపై కూర్చుండబెట్టి శంఖాలు, నగారాలు, పిల్లనగ్రోవులు మ్రోగిస్తూ యజ్ఞం జరిగే ప్రదేశంవైపు ప్రయాణం చేసి చేసి...

4-80-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ముందట.

టీకా:

ముందటన్ = ఎదుట.

భావము:

ఎదురుగా...

4-81-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మున మోదమందుచు నుమాతరుణీమణి గాంచె దారు మృ
త్కక కుశాజినాయస నికాయ వినిర్మిత పాత్ర సీమము
న్ననుపమ వేదఘోష సుమత్పశు బంధన కర్మ భూమమున్
మునివిబుధాభిరామము సముజ్జ్వల హోమము యాగధామమున్.

టీకా:

మనమునన్ = మనసులో; మోదమున్ = సంతోషమును; అందుచున్ = చెందుతూ; ఉమా = ఉమ అనెడి; తరుణీ = స్త్రీ లలో {తరుణి - తరుణ వయసునున్నామె, స్త్రీ}; మణి = రత్నములాంటామె; కాంచెన్ = చూసెను; దారు =కొయ్యతోను; మృత్ = మట్టితోను; కనక = బంగారముతోను; కుశ = దర్భలు; అజిన = లేడిచర్మము; అయస = ఇనుము; నికాయ = సమూహముచే; వినిర్మిత = చక్కగ నిర్మింపబడ్డ; పాత్ర = పాత్రలుగల; సీమమున్ = భూమిని; అనుపమ = గొప్ప {అనుపమ - ఉపమానమునకు అందనిది, గొప్ప}; వేద = వేదముల; ఘోష = శబ్దములు; సు = మంచి; మహత్ = గొప్ప; పశు = యజ్ఞపశువుని; బంధన = బంధించిన; భూమమున్ = స్థలమును; ముని = మునులతోను; విబుధ = దేవతలతోను; అభిరామము = చక్కనైనదానిని; సమ = చక్కగా; ఉజ్జ్వల = జ్వలిస్తున్న; హోమము = హోమము కలదానిని; యాగ = యజ్ఞ; ధామమున్ = భూమిని.

భావము:

సతీదేవి మనస్సులో సంతోషిస్తూ యజ్ఞశాలను చూసింది. ఆ యజ్ఞశాలలో కొయ్యతో, మట్టితో, బంగారంతో, లోహంతో చేసిన పాత్రలున్నాయి. దర్భలతో, జింకతోళ్ళతో చేసిన వస్తువులు ఉన్నాయి. వేదఘోషలు మిన్ను ముట్టుతున్నాయి. ఒకచోట యజ్ఞ పశువును బంధించారు. మునులు, దేవతలు తమతమ స్థానాలలో కూర్చుని ఉన్నారు. హోమాలు చేస్తున్నారు. యజ్ఞం వైభవోపేతంగా జరుగుతున్నది.

4-82-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు గనుంగొని యజ్ఞశాలం బ్రవేశించిన.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; కనుంగొని = చూసి; యజ్ఞశాలన్ = యజ్ఞశాలను; ప్రవేశించినన్ = ప్రవేశించగా.

భావము:

ఇదంతా చూస్తూ యజ్ఞశాలలోకి ప్రవేశించగా...

4-83-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నుదెంచిన యమ్మగువను
నియు సోదరులుఁ దక్క భఁ గల జను లె
ల్లను దక్షువలని భయమున
యము నపు డాదరింపరైరి మహాత్మా!

టీకా:

చనుదెంచిన = వచ్చిన; ఆ = ఆ; మగువను = స్త్రీని; జననియు = తల్లి; సోదరులున్ = తోడబుట్టినవారు; తక్క = తప్పించి; సభన్ = సదస్సున; కల = ఉన్న; జనులు = ప్రజలు; ఎల్లను = అందరును; దక్షు = దక్షుని; వలని = అందలి; భయమునన్ = భయముతో; అనయమున్ = మృదుత్వములేక; అపుడు = అప్పుడు; ఆదరింపరు = అదరింపనివారు; ఐరి = అయ్యారు; మహాత్మా = గొప్పవాడ.

భావము:

విదురా! వచ్చిన సతీదేవిని చూడగానే తల్లి, తోబుట్టువులు అనురాగంతో ఆదరించారు. సభలో ఉన్న తక్కినవారు దక్షునికి భయపడి ఆమెను గౌరవించకుండా ఊరకున్నారు.

4-84-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నెఱిఁ దల్లియుఁ బినతల్లులుఁ
రిరంభణ మాచరింపఁ రితోషాశ్రుల్
దొరఁగఁగ డగ్గుత్తికతో
సిజముఖి సేమ మరయ తి దా నంతన్.

టీకా:

నెఱిన్ = నిండుగ; తల్లియున్ = తల్లి; పినతల్లులన్ = పినతల్లులు; పరిరంభణము = కౌగలింతలు; ఆచరింపన్ = చేయగ; పరితోష = ఆనంద; అశ్రుల్ = భాష్పములు; తొరగగ = కారగా; డగ్గుతిక = గద్గదస్వరము; తోన్ = తో; సరసిజముఖి = సతీదేవి {సరసిజముఖి - సరసిజము (సరసున పుట్టు పద్మము) వంటి ముఖము కలామె, స్త్రీ}; సేమము = క్షేమము; అరయన్ = విచారించగ; సతిన్ = సతీదేవి; తాన్ = తను; అంతన్ = అంతట.

భావము:

తల్లి, పినతల్లులు సతీదేవిని కౌగలించుకొని ఆనంద బాష్పాలు కారుస్తూ గద్గదస్వరంతో కుశలప్రశ్నలు వేయగా, సతీదేవి అప్పుడు...

4-85-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కుం డవమానించుట
యును సోదరు లర్థిఁ దనకు నుచితక్రియఁ జే
సి పూజల నందక శో
మరసిన మాఱుమాట లుకక యుండెన్.

టీకా:

జనకుండు = తండ్రి; అవమానించుటయునున్ = అవమానము చేయుటచేత; సోదరులు = తోబుట్టువులు; తన్ = తన; కున్ = కు; ఉచిత = తగిన; క్రియన్ = విధముగ; చేసిన = చేసినట్టి; పూజలన్ = గౌరవమర్యాదలను; అందక = చెందక; శోభనము = కుశలము; అరసిన = విచారించగ; మాఱుమాట = సమాధానము; పలుకక = పలక్కుండ; ఉండెన్ = ఉండెను.

భావము:

తండ్రి అవమానించడంతో తోబుట్టువులు చేసిన గౌరవాన్ని సతీదేవి అందుకొనక, వారికి బదులు చెప్పలేక పోయింది.

4-86-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు తండ్రిచే నాదరింపబడనిదై విభుండైన యీశ్వరు నందు నాహ్వాన క్రియాశూన్యత్వరూపంబైన తిరస్కారంబును, నరుద్ర భాగంబైన య జ్ఞంబునుం గనుంగొని నిజరోషానలంబున లోకంబులు భస్మంబు చేయంబూనిన తెఱంగున నుద్రేకించి 'రుద్రద్వేషియుఁ గ్రతుకర్మాభ్యాస గర్విష్ఠుండు నగు దక్షుని వధియింతు' మనుచు లేచిన భూతగణంబుల నివారించి రోషవ్యక్తభాషణంబుల నిట్లనియె; "లోకంబున శరీరధారులైన జీవులకుఁ బ్రియాత్మకుండైన యీశ్వరునకుఁ బ్రియాప్రియలును నధికులును లేరు; అట్టి సకల కారణుండును నిర్మత్సరుండును నైన రుద్రు నందు నీవు దక్క నెవ్వండు ప్రతికూలం బాచరించు? నదియునుం గాక మిముబోఁటి వారలు పరులవలని గుణంబు లందు దుర్గుణంబులన యాపాదింతురు; మఱియుం గొందఱు మధ్యస్థులైన వారలు పరుల దుర్గుణంబుల యందు దోషంబుల నాపాదింపరు; కొందఱు సాధువర్తనంబు గలవారలు పరుల దోషంబుల నైన గుణంబులుగా ననుగ్రహింతురు; మఱియుం గొందఱుత్తమోత్తములు పరుల యందు దోషంబుల నాపాదింపక తుచ్ఛగుణంబులు గలిగినను సద్గుణంబులుగాఁ గైకొందురు; అట్టిమహాత్ముల యందు నీవు పాపబుద్ధి గల్పించితి” వని; వెండియు నిట్లను “మహాత్ములగు వారల పాదధూళిచే నిరస్తప్రభావులై జడ స్వభావంబుగల దేహంబునాత్మ యని పల్కు కుజను లగువారు మహాత్ముల నిందించుట కార్యంబు గాదు: అదియు వారి కనుచితం బగు” నని వెండియు నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఇలా; తండ్రి = తండ్రి; చేన్ = చేత; ఆదరిపంబడనిది = మన్ననలు పొందనిది; ఐ = అయ్యి; విభుండు = భర్త; ఐన = అయన; ఈశ్వరున్ = శివుని; ఆహ్వాన = పిలిచు టనే; క్రియా = కార్యం, ఆచారించుటలు; శూన్యత్వ = లేకపోవుట యొక్క; రూపంబు = విధము; ఐన = అయినట్టి; తిరస్కారంబునున్ = అనాదరము చేయుటను; అరుద్ర = రుద్రుడు లేని; భాగంబు = భాగము; ఐన = అయినట్టి; యజ్ఞంబున్ = యాగమును; కనుంగొని = చూసి; నిజ = తమ; రోషా = రోషము అనెడి; అనలంబునన్ = అగ్నిలో; లోకంబులున్ = లోకములను; భస్మంబున్ = బూడిద; చేయన్ = చేయుటకు; పూనినన్ = పూనుకొను; తెఱంగునను = విధముగ; ఉద్రేకించి = ఉద్రేకిస్తూ; రుద్ర = శివుని యెడల; ద్వేషియున్ = శత్రుత్వము కలవాడును; కర్మ = వేదవిధికర్మలు; అభ్యాస = చేయుట యందు; గర్విష్టుండున్ = గర్వము కలవాడును; అగు = అయినట్టి; దక్షుని = దక్షుని; వధియింతుము = సంహరించెదము; అనుచున్ = అంటూ; లేచిన = లేచినట్టి; భూతగణంబులన్ = భూతగణములను; నివారించి = ఆపి; రోష = రోషము; వ్యక్త = వ్యక్తమౌతున్న; భాషణంబులన్ = మాటలతో; ఇట్లు = ఇలా; అనియెన్ = పలికెను; లోకంబున = లోకములో; శరీర = దేహమును; ధారులు = ధరించినవారు; ఐన = అయినట్టి; జీవుల్ = ప్రాణుల; కున్ = కి; ప్రియ = ప్రియమైన; ఆత్మకుండు = స్వరూపముకలవాడు; ఐన = అయినట్టి; ఈశ్వరున్ = శివుని; కున్ = కి; ప్రియా = ఇష్టులును; అప్రియలును = అయిష్టులును; అధికులున్ = గొప్పవారును; లేరు = లేరు; అట్టి = అటువంటి; సకల = సమస్తమునకును; కారణుండును = కారణ మైనవాడును; నిర్మత్సరుండును = మాత్సర్యము లేనివాడును; ఐన = అయినట్టి; రుద్రున్ = శివుని; అందున్ = యెడల; నీవున్ = నీవే; తక్క = తప్పించి; ఎవ్వండున్ = ఎవరును; ప్రతికూలంబున్ = వ్యతిరేకమును; ఆచరించు = చేయును; అదియునన్ = అంతే; కాక = కాకుండగ; మిమున్ = మీ; పోటి = లాంటి; వారలు = వారు; పరుల = ఇతరుల; వలని = అందలి; గుణంబులు = గుణములు; అందున్ = లో; దుర్గుణంబులన = దుర్గుణములనే; ఆపాదింతురు = ఆరోపించెదరు; మఱియున్ = ఇంకను; కొందఱు = కొంతమంది; మధ్యస్థులు = మధ్యమ గుణములు కలిగిన; వారలు = వారు; పరుల = ఇతరుల; దుర్గుణంబులన్ = దుర్గుణములు; అందున్ = లో; దోషంబులన్ = దోషములను; ఆపాదింపరు = ఆరోపించరు; కొందఱు = కొంతమంది; సాధు = మంచి; వర్తనంబులు = ప్రవర్తనలు; కల = కలిగిన; వారలు = వారు; పరుల = ఇతరుల; దోషంబులన్ = దోషములను; ఐనన్ = అయినట్టి; గుణంబులు = గుణములు; కాన్ = అగునట్లు; అనుగ్రహింతురు = పరిగ్రహించెదరు; మఱియున్ = ఇంకను; కొందఱు = కొందరు; ఉత్తమ = ఉత్తములలో; ఉత్తములు = ఉత్తములు; పరుల = ఇతరుల; అందున్ = యెడల; దోషంబులన్ = దోషములను; ఆపాదింపక = ఆరోపించక; తుచ్చ = నీచమైన; గుణంబులు = గుణములు; కలిగినను = ఉన్నను; సత్ = మంచి; గుణంబులు = గుణములు; కాన్ = అగునట్లు; కైకొందురు = స్వీకరింతురు; అట్టి = అటువంటి; మహాత్ములన్ = గొప్పవారి; అందున్ = యెడల; నీవున్ = నీవు; పాప = పాపపు; బుద్ధిన్ = బుద్ధిని; కల్పించితివి = లేనివి ఆరోపించితివి; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; మహాత్ములు = గొప్పవారు; అగు = అయిన; వారల = వారి; పాదధూళి = పాదధూళి; చేన్ = వలన; నిరస్త = తొలగింపబడిన; ప్రభావులు = ప్రభావము కలవారు; ఐ = అయ్యి; జడ = జడత్వపు; స్వభావంబు = స్వభావము; కల = కలిగినట్టి; దేహంబున్ = శరీరమును; ఆత్మ = తాము; అని = అని; పల్కు = పలికెడి; కుజనులు = చెడ్డ మానవులు; అగు = అయిన; వారు = వారు; మహాత్ములన్ = గొప్పవారిని; నిందించుట = నిందించుట; కార్యంబు = తగినపని; కాదు = కాదు; అదియున్ = అది; వారి = వారి; కిన్ = కి; అనుచితంబు = ఉచితము కానిది; అగును = అవుతుంది; అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

ఈ విధంగా సతీదేవి తన తండ్రి ఆదరాన్ని పొందనిదై, తన భర్తను యజ్ఞానికి ఆహ్వానించకుండా తిరస్కరించడాన్ని, శివునికి భాగం కల్పించకుండా జరుపుతున్న యజ్ఞాన్ని చూసి, తన కోపాగ్ని జ్వాలలతో లోకాలను బూడిద చేయాలన్నంత ఉద్రేకాన్ని పొంది, శివుని ద్వేషించి క్రతువు చేస్తున్నానని గర్వపడుతున్న దక్షుణ్ణి హతమారుస్తామని లేచిన ప్రమథగణాలను నివారించి, రోషావేశంతో ఇలా అన్నది. “లోకంలోని ప్రాణులందరికీ ఇష్టమైన శివునకు ఇష్టమైనవారు అనీ, ఇష్టం లేనివారు అనీ ఎవరూ లేరు. అతనికంటె అధికులు లేరు. సకల విశ్వానికి కారణమైన ఈశ్వరునకు ఎవరియందూ ద్వేషము లేదు. అలాంటి రుద్రుని నీవు తప్ప లోకంలో ఇంకెవరు ద్వేషిస్తారు? అంతేకాక నీవంటివాళ్ళు ఇతరుల గుణాలలో దోషాలను ఆపాదిస్తారు. కొందరు మధ్యస్థులు ఇతరుల గుణాలలో దోషాలను ఆపాదించరు. కొందరు సత్పురుషులు ఇతరుల దోషాలనైనా గుణాలుగా గ్రహిస్తారు. ఇంకా కొందరు ఉత్తమోత్తములు ఇతరులలో దోషాలను ఆరోపించక వారి నీచగుణాలను సైతం సద్గుణాలుగా స్వీకరిస్తారు. అటువంటి మహాత్ములలో నీవు పాపబుద్ధిని కలిగించావు.” అని చెప్పి ఇంకా ఇలా అన్నది. “మహాత్ముల పాదధూళిముందు వెలవెలబోయిన తేజస్సు కలిగి, జడపదార్థమైన దేహాన్నే ఆత్మ అని వాదించే దుర్జనులు సజ్జనులను నిందించడంలో ఆశ్చర్యం లేదు. అది వారి తగినదే” అని చెప్పి మళ్ళీ ఇలా అన్నది.

4-87-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"నయంబు శివ యను క్షరద్వయ మర్థి;
వాక్కునఁ బలుక భామునఁ దలఁప
ర్వజీవుల పాపసంఘముల్ చెడు; నట్టి;
హితాత్మునందు నమంగళుండ
గు నీవు విద్వేషి గుట కాశ్చర్యంబు;
నందెద; వినుము; నీ దియుఁ గాక
ర్చింప నెవ్వని రణపద్మంబుల;
రసి బ్రహ్మానంద ను మరంద

4-87.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

తుల భక్తిని దమ హృదయంబు లనెడి
తుమ్మెదలచేతఁ గ్రోలి సంతుష్టచిత్తు
గుదు రత్యంత విజ్ఞాను; ట్టి దేవు
నందు ద్రోహంబు చేసి; తే మందు నిన్ను?

టీకా:

అనయంబున్ = అవశ్యమును; శివ = శివ; అను = అనెడి; అక్షర = అక్షరముల; ద్వయము = రెంటిని; అర్థిన్ = కోరి; వాక్కునన్ = నోటితొ; పలుకన్ = పలుకుతే; భావమునన్ = భావములో; తలపన్ = తలచుకొన్న; సర్వ = సమస్తమైన; జీవుల్ = ప్రాణుల; పాప = పాపముల; సంఘముల్ = సమూహములు; చెడును = నాశనమగును; అట్టి = అటువంటి; మహితాత్ము = మహిమాన్వితమైనఆత్మ కలవాడు; అందున్ = ఎడల; అమంగళుండవు = అశుభకరమైనవాడవు; అగు = అయిన; నీవున్ = నీవు; విద్వేషివి = శత్రుత్వము కలవాడవు; అగుటన్ = అవుటకు; ఆశ్చర్యంబున్ = ఆశ్చర్యమును; అందెదన్ = పోయెదను; వినుము = వినుము; నీవున్ = నీవు; అదియున్ = అంతే; కాక = కాకుండగ; చర్చింపన్ = చర్చించి చూసినచో; ఎవ్వని = ఎవని; చరణ = పాదములు అనెడి; పద్మంబులన్ = పద్మములను; అరసి = ఎరిగి; బ్రహ్మానందము = బ్రహ్మానందము; అను = అనెడి; మరందము = మధువుని; అతుల = మిక్కలి.
భక్తిన్ = భక్తితో; తమ = తమయొక్క; హృదయంబులు = మనసులు; అనెడి = అనెడి; తుమ్మెదలన్ = తుమ్మెదల; చేతన్ = వలన; క్రోలి = త్రాగి; సంతుష్ట = సంతోషించిన; చిత్తులు = చిత్తములు కలవారు; అగుదురు = అవుతారో; అత్యంత = అత్యధికమైన; విజ్ఞానులు = చక్కటి జ్ఞానము కలవారు; అట్టి = అటువంటి; దేవుని = దేవుని; అందున్ = ఎడల; ద్రోహంబు = ద్రోహము; చేసితి = చేసావు; ఏమి = ఏమని; అందున్ = అంటాను; నిన్ను = నిన్ను.

భావము:

“ఎల్లప్పుడూ శివ అనే రెండక్షరాలను ఆసక్తితో నోటితో పలికినా, మనస్సులో తలచినా సమస్త ప్రాణుల పాపలన్నీ నశిస్తాయి. అటువంటి మహాత్ముని అమంగళుడవైన నీవు ద్వేషించడం చూచి ఆశ్చర్యాన్ని పొందుతున్నాను. తండ్రీ! విను. గొప్ప విజ్ఞానులు అయినవారు ఏ దేవుని పాదారవిందాలను ధ్యానిస్తూ బ్రహ్మానందమనే మకరందాన్ని తమ మనస్సులనే తుమ్మెదల ద్వారా భక్తిపారవశ్యంతో గ్రోలి తృప్తిపొందుతారో అటువంటి దేవునికి ద్రోహం చేశావు. నిన్నేమనాలి?

4-88-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఱియును నమ్మహితాత్ముని
ణ సరోజాత యుగము కలజగంబుల్
నెఱిఁ గొలువఁ గోరు కోర్కులు
మిడి వర్షించు నతనిఁ గునే తెగడన్?

టీకా:

మఱియును = ఇంకను; ఆ = ఆ; మహితాత్ముని = గొప్పవానిని; చరణ = పాదములు అనెడి; సరోజాత = పద్మముల {సరోజాతము - సరసున జాతము (పుట్టునది), పద్మము}; యుగమున్ = జంటను; సకల = సమస్తమైన; జగంబుల్ = జగముల; నెఱిన్ = నిండుగ; కొలువన్ = పూజించగా; కోరు = కోరుకొనెడి; కోర్కులు = కోరికలు; తరమిడి = వరుసగ; వర్షించు = సఫలమగును; అతనిన్ = అతనిని; తగనే = తగునా ఏమి; తెగడన్ = దూషించగ.

భావము:

అంతేకాక ఆ మహాత్ముని పాదపద్మాలు లోకాలన్నీ కొలివగా కోరిన కోర్మెలన్నింటినీ కురిపిస్తుండగా అతన్ని నిదించడం న్యాయమా?

4-89-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

గఁ జితాస్థిభస్మ నృకపాలజటాధరుఁడుం బరేత భూ
రుఁడు పిశాచయుక్తుఁ డని ర్వు నమంగళుగాఁ దలంప రె
వ్వరు; నొకఁ డీవు దక్క, మఱి వాక్పతి ముఖ్యులు నమ్మహాత్ము స
చ్చణ సరోజ రేణువులు మ్మతిఁ దాల్తురు మస్తకంబులన్.

టీకా:

పరగన్ = ప్రసిద్ధముగ; చితా = చితిపై నున్న; అస్థి = ఎముకలు; భస్మ = భస్మము; నృ = నరుని; కపాల = పుఱ్ఱెలు; జటా = జటలు కట్టిన శిరోజముల; ధరుడు = ధరించువాడు; పరేత = శ్మశాన; భూ = భూమి యందు; చరుడు = తిరుగువాడు; పిశాచ = పిశాచములతో; యుక్తుడు = కూడి యుండువాడు; అని = అని; శర్వున్ = శివుని; అమంగళున్ = అశుభకరుని; కాన్ = అగునట్లు; తలపరు = అనుకొనరు; ఎవ్వరున్ = ఎవరూ; ఒక్కడ = ఒక్కడివి; ఈవు = నీవు; తక్కన్ = తప్పించి; మఱి = మరి; వాక్పతి = బ్రహ్మదేవుడు {వాక్పతి - వాక్కు (సరస్వతీదేవి)కి భర్త, బ్రహ్మదేవుడు}; ముఖ్యులు = మొదలైన ప్రముఖులు; ఆ = ఆ; మహాత్ము = గొప్పవాని; సత్ = మంచి; చరణ = పాదములు అనెడి; సరోజ = పద్మముల; రేణువులు = ధూళిని; సమ్మతి = అంగీకరించి; తాల్తురు = ధరించెదరు; మస్తకంబులన్ = శిరస్సులందు.

భావము:

చితిలోని ఎముకలను, బూడిదను, మానవకపాలాన్ని ధరించి, పిశాచాలతో కూడి శ్మశానంలో తిరిగినా శివుణ్ణి నీవు తప్ప మరెవ్వరూ అమంగళుడని భావించరు. బ్రహ్మ మొదలైనవారు ఆ మహాత్ముని పాదధూళిని తమ శిరస్సులపై సంతోషంతో ధరిస్తారు.

4-90-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నెకొని ధర్మపాలన వినిర్మలు భర్గుఁ దిరస్కరించు న
క్కలుషుని జిహ్వఁ గోయఁ దగుఁ; గా కటు చేయఁగ నోపఁడేని దాఁ
బొలియుట యొప్పు; రెంటికిఁ బ్రభుత్వము చాలమిఁ గర్ణరంధ్రముల్
లువుగ మూసికొంచుఁ జనఁ బాడి యటందురు ధర్మవర్తనుల్.

టీకా:

నెలకొని = స్థిరమైన; ధర్మపాలన = ధర్మపరిపాలన చేయువాని; వినిర్ములున్ = మిక్కిలి నిర్మలమైనవాని; భర్గున్ = శివుని; తిరస్కరించు = తెగడునట్టి; ఆ = ఆ; కలుషునిన్ = పాపి యొక్క; జిహ్వన్ = నాలుకను; కోయన్ = కోసివేయుట; తగున్ = సరియైనపని; కాక = కాకుండగ; అటు = అలా; చేయగన్ = చేయుటకు; ఓపడు = శక్తి లేనివాడు; ఏని = అయితే; తాన్ = తనే; పొలియుట = మరణించుట; ఒప్పు = తగినపని; రెంటికిన్ = రెండింటికిని; ప్రభుత్వము = సామర్థ్యము; చాలమిన్ = సరిపోకపోయినచో; కర్ణ = చెవుల; రంధ్రముల్ = కన్నములను; బలువుగన్ = బలముగ; మూసికొంచున్ = మూసికొంటూ; చనన్ = వెళ్ళిపోవుట; పాడి = నీతి; అటన్ = అని; అందురు = అంటారు; ధర్మ = ధర్మము ప్రకారము; వర్తనుల్ = ప్రవర్తించువారు.

భావము:

ధర్మపాలన చేత పవిత్రుడైన శివుణ్ణి తిరస్కరించే పాపాత్ముని నాలుక కోసివేయాలి. అలా చేయలేనప్పుడు చావడం మంచిది. రెండూ చేతకాని పక్షంలో చెవులను మూసికొని అక్కడినుండి వెళ్ళిపోవడం న్యాయమని ధర్మజ్ఞులు చెప్తారు.

4-91-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అది గావున.

టీకా:

అదిగావున = అందుచేత.

భావము:

అందువల్ల...

4-92-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నుఁ డజ్ఞానమునన్ భుజించిన జుగుప్సం బైన యన్నంబు స
య్య వెళ్ళించి పవిత్రుఁడైన గతి దుష్టాత్ముండవై యీశ్వరున్
ను నిందించిన నీ తనూభవ యనం గా నోర్వ, నీ హేయ భా
మైనట్టి శరీరమున్ విడిచి భాస్వచ్ఛుద్ధిఁ బాటిల్లెదన్.

టీకా:

జనుడు = మనిషి; అజ్ఞానమునన్ = అజ్ఞానముచేత; భుజించిన = తినినటువంటి; జుగుప్సంబు = అసహ్యకరము; ఐన = అయిన; అన్నంబు = అన్నము; సయ్యన = వెంటనే; వెళ్ళించి = కక్కివేసి; పవిత్రుడు = శుద్ధుడు; ఐన = అయిన; గతిన్ = విధముగ; దుష్టాత్ముండవు = దుష్ట స్వభావము కలవాడవు; ఐ = అయ్యి; ఈశ్వరున్ = శివుని; ఘనున్ = గొప్పవానిని; నిందించిన = దూషించిన; నీ = నీ యొక్క; తనూభవన్ = పుత్రికను {తనూభవ - తనువు (దేహము)న భవ పుట్టినది, పుత్రిక}; అనంగాన్ = అనుటకు; ఓర్వన్ = భరించలేను; ఈ = ఈ; హేయ = ఏవగింపులకు; భాజనము = స్థానము; ఐనట్టి = అయినట్టి; శరీరమున్ = దేహమును; విడిచి = విడిచిపెట్టి; భాస్వత్ = అగ్ని; శుద్ధిన్ = శుద్ధిని; పాటిల్లెదన్ = కలిగించుకొనెదను.

భావము:

తెలియక తిన్న దుష్టాన్నాన్ని మానవుడు కక్కి పవిత్రుడైనట్లు దుష్టుడవై ఈవిధంగా గొప్పవాడైన ఈశ్వరుని నిందించిన నీకు కుమార్తెను అనిపించుకొనడం నాకు ఇష్టం లేదు. నీవల్ల ప్రాప్తమైన ఈ పాడు శరీరాన్ని విడిచి పవిత్రురాలను అవుతాను.

4-93-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అదియునుం గాక, దేవతల కాకాశగమనంబును, మనుష్యులకు భూతల గమనంబును, స్వాభావికంబు లయినట్లు ప్రవృత్తినివృత్తి లక్షణ కర్మంబులు రాగవైరాగ్యాధికారంబులుగా వేదంబులు విధించుటం జేసి రాగయుక్తులై కర్మతంత్రు లయిన సంసారులకు వైరాగ్యయుక్తు లయి యాత్మారాము లయిన యోగిజనులకు విధినిషేధరూపంబు లయిన వైదిక కర్మంబులు గలుగుటయు లేకుండుటయు నైజంబు లగుటం జేసి స్వధర్మ నిష్ఠుండగువాని నిందింపం జనదు; ఆ యుభయకర్మ శూన్యుండు బ్రహ్మభూతుండు నయిన సదాశివునిఁ గ్రిఁయా శూన్యుం డని నిందించుట పాపం బగు; దండ్రీ! సంకల్పమాత్ర ప్రభవంబు లగుటం జేసి మహాయోగిజన సేవ్యంబు లయిన యస్మదీయంబు లగు నణిమాద్యష్టైశ్వర్యంబులు నీకు సంభవింపవు; భవదీయంబు లగు నైశ్వర్యంబులు ధూమమార్గ ప్రవృత్తులై యాగాన్నభోక్తలైన వారి చేత యజ్ఞశాలయందె చాల నుతింపంబడి యుండుఁ గాన నీ మనంబున నే నధిక సంపన్నుండ ననియుఁ, జితాభస్మాస్థి ధారణుండైన రుద్రుండు దరిద్రుం డనియును గర్వింపం జన” దని; వెండియు నిట్లనియె.

టీకా:

అదియున్ = అంతే; కాక = కాకుండగ; దేవతల్ = దేవతల; కున్ = కు; ఆకాశ = ఆకాశ; గమనంబును = యానమును; మనుష్యుల్ = మానవుల; కున్ = కు; భూతల = భూమి యందు; గమనంబును = యానమును; స్వాభావికంబులు = స్వభావసిద్ధమైనవి; అయినట్లు = అయిన విధముగ; ప్రవృత్తి = విధి; నివృత్తి = నిషేధ; లక్షణ = లక్షణములు కలిగిన; కర్మంబులు = కర్మములు; రాగ = రాగము; వైరాగ్య = వైరాగ్యము; అధికారంబులు = అధికారములు; కాన్ = అగునట్లు; వేదంబులు = వేదములు; విధించుటన్ = విధించుట; చేసి = వలన; రాగ = రాగములతో; యుక్తులు = కూడినవారు; ఐ = అయ్యి; కర్మ = కర్మములతో కూడిన; తంత్రులు = విధానములు కలవారు; అయిన = అయిన; సంసారుల = సంసారుల; కున్ = కు; వైరాగ్య = వైరాగ్యముతో; యుక్తులు = కూడి యుండువారు; అయి = అయ్యి; ఆత్మారాములు = తమ యాత్మనందే ఆనందించువారు; అయిన = అయిన; యోగి = యోగులైన; జనుల్ = జనుల; కున్ = కి; విధి = చేయవలసినవి; నిషేధ = చేయరానివి అనెడి; రూపంబులు = రూపములో ఉండేవి; అయిన = అయిన; వైదిక = వేదములకి సంబంధించిన; కర్మంబులు = కర్మములు; కలుగుటయు = చెందుటయును; లేకుండుటయు = చెందకపోవుటయును; నైజంబులు = సహజములు; అగుటన్ = అయివుండుట; చేసి = వలన; స్వధర్మ = తమ ధర్మమునందు; నిష్ఠుండు = నిష్ఠ కలవాడు; అగు = అయిన; వానిన్ = వానిని; నిందింపన్ = తెగడుట; చనదు = తగదు; ఆ = ఆ; ఉభయ = రెండు విధములైన; కర్మ = కర్మములు; శూన్యుండు = లేనివాడు; బ్రహ్మ = పరబ్రహ్మము; భూతుండు = అయినవాడు; అయిన = అయినట్టి; సదాశివునిన్ = శివుని {సదాశివుడు - శాశ్వతమైన శుభము యైనవాడు, శంకరుడు}; క్రియాశూన్యుండు = పని లేనివాడు; అని = అని; నిందించుట = తిట్టుట; పాపంబు = పాపము; అగున్ = అవును; తండ్రీ = తండ్రీ; సంకల్ప = సంకల్పము చేసినంత; మాత్ర = మాత్రముననే; ప్రభవంబులు = ప్రభావము చూపునవి; అగుటన్ = అవుట; చేసి = వలన; మహా = గొప్ప; యోగి = యోగులైన; జన = జనములచే; సేవ్యంబులు = సేవింపబడునవి; అయిన = అయినట్టి; అస్మదీయంబులు = మాకు చెందినవి; అగు = అయిన; అణిమాదష్టైశ్వర్యంబులు = అష్టైశ్వర్యములు {అష్టైశ్వర్యములు - 1అణిమ, 2మహిమ, 3లఘిమ, 4గరిమ, 5ప్రాప్తి, 6ప్రాకామ్యము, 7వశిత్వము, 8ఈశత్వము}; నీకున్ = నీకు; సంభవింపవు = కలుగనేరవు; భవదీయంబులు = నీకు చెందినవి; అగు = అయినట్టి; ఐశ్వర్యములు = భాగ్యములు; ధూమ = పొగచూరిన; మార్గ = దారిలో; ప్రవృత్తులు = తిరుగువారు; ఐ = అయ్యి; యాగా = యజ్ఞములలో; అన్న = అన్నమును; భోక్తలు = భుజింజువారు; ఐన = అయిన; వారి = వారి; చేత = చేత; యజ్ఞశాల = యజ్ఞశాల; అందే = లోనే; చాలన్ = మిక్కిలి; నుతింపంబడి = స్తుతింపబడి; ఉండున్ = ఉంటాయి; కాన = కావున; నీ = నీ యొక్క; మనంబునన్ = మనసులో; నేను = నేను; అధిక = ఎక్కువ; సంపన్నుండను = ధనవంతుడను; అనియున్ = అనియు; చితా = చితిపై నున్న; భస్మ = భస్మము; అస్థి = ఎముకలు; ధారణుండు = ధరించువాడు; ఐన = అయిన; రుద్రుండు = శివుడు; దరిద్రుండు = దరిద్రుడు; అనియున్ = అనియు; గర్వింపన్ = గర్వించుట; చనదు = చెల్లదు; అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియున్ = పలికెను.

భావము:

అంతేకాక దేవతలకు ఆకాశయానం, మానవులకు భూతలయానం సహజమైనట్లు, విధి నిషేధ లక్షణాలు కలిగిన కర్మలు రాగ వైరాగ్యాలకు కారణాలుగా వేదాలు విధించడం వలన రాగయుక్తులై కర్మతంత్రులైన సంసారులకూ, వైరాగ్యంతో కూడి ఆత్మారాములైన యోగులకు విధి నిషేధ రూపాలలో ఉన్న వైదికకర్మలు కలిగిఉండడమూ లేకపోవడమూ సహజం. అందువల్ల స్వధర్మపరుడైనవానిని నిందించరాదు. (సంసారులకు అగ్నిహోత్రాలు మొదలైన ప్రవృత్తి కర్మలను, విరక్తులకు శమదమాది నివృత్తి కర్మలను వేదాలు విధించాయి. దేవతలకు ఆకాశయానం, మానవులకు భూతలయానం సహజమైనట్లు సంసారులకు, విరక్తులకు వేరువేరు ధర్మాలు సహజాలు. విధి నిషేధ రూపాలైన వైదిక కర్మలు ధర్మాసక్తులైన సంసారులకే కాని ఆత్మారాములైన యోగులకు కాదు.) ప్రవృత్తి నివృత్తి కర్మలు లేనివాడు, పరబ్రహ్మ స్వరూపుడు అయిన సదాశివుని నిందించడం పాపం. తండ్రీ! సంకల్పమాత్రం చేతనే మేము పొందగలవీ, యోగిజనులచేత సేవింపబడేవీ అయిన అణిమ మొదలైన అష్టసిద్ధులను నీవు పొందలేవు. నీ ఐశ్వర్యాలను యజ్ఞశాలలో హోమధూపాల మధ్య తిరుగుతూ, యజ్ఞాన్నాన్ని భుజించేవారు ఇక్కడ మాత్రమే స్తుతిస్తారు. కనుకనీవు మిక్కిలి సంపన్నుడవనీ, చితాభస్మాన్నీ ఎముకలను ధరించే రుద్రుడు దరిద్రుడనీ భావించి గర్వించకు” అని చెప్పి ఇంకా ఇలా అన్నది.

4-94-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"నీగళాపరాధి యగు నీకుఁ దనూభవ నౌట చాలదా?
చాలుఁ గుమర్త్య! నీదు తనుజాత ననన్ మది సిగ్గు పుట్టెడి
న్నే ధరన్ మహాత్ములకు నెగ్గొనరించెడి వారి జన్మముల్
గాలుపనే? తలంప జనకా! కుటిలాత్మక! యెన్ని చూడఁగన్.

టీకా:

నీలగళా = శివుని యెడల {నీలగళుడు - నీల (నల్లని) గళ (గొంతుక) కలవాడు, శివుడు}; అపరాధి = అపరాథము చేసినవాడు; అగు = అయిన; నీకున్ = నీకు; తనూభవన్ = పుత్రికను; అగుటన్ = అవుట; చాలదా = సరిపోదా; చాలున్ = చాలు; కుమర్త్య = చెడుమనిషి; నీదు = నీ యొక్క; తనూజాతన్ = కూతురను; అనన్ = అనగా; మదిన్ = మనసున; సిగ్గు = లజ్జ; పుట్టెడిన్ = పుడుతున్నది; ఏల = ఎందులకు; ధరన్ = భూమిమీద; మహాత్ముల్ = గొప్పవారి; కిన్ = కి; ఎగ్గు = అపకారము; ఒనరించెడి = చేసెడి; వారి = వారి యొక్క; జన్మముల్ = పుట్టుకలు; కాలుపనే = కాల్చుటకా ఏమి; తలంప = తలచుకొంటే; జనకా = తండ్రీ; కుటిలాత్మకా = వంకర బుద్ధి కలవాడ; ఎన్ని = ఎంచి; చూడగన్ = చూస్తే.

భావము:

"తండ్రీ! లోకకల్యాణంకోసం కాలకూటవిషం తాగి కంఠం నల్లగా చేసుకున్న సర్వలోక శుభంకరుడు కదయ్యా పరమ శివుడు. ఆయన యెడ క్షమింపరాని అపరాధం చేసావు. నా దురదృష్టం కొద్దీ అలాంటి నీకు పుత్రికగా పుట్టాను నీచమానవ! ఇక చాల్లే! నీ కుమార్తె నని తల్చుకుంటేనే సిగ్గు వేస్తోంది. లోకంలో గౌరవనీయులకు కీడు తలపెట్టే నీలాంటి వాళ్ళ పుట్టుకలు ఎందుకయ్యా? కాల్చడానికా? పూడ్చడానికా?

4-95-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వృషకేతనుండు భగవంతుఁడు నైన హరుండు నన్ను నా
పరిహాస వాక్యముల క్షతనూభవ యంచుఁ బిల్వ నేఁ
బుపురఁ బొక్కుచున్ ముదముఁ బొందక నర్మవచఃస్మితంబులం
దొఱఁగుదు; నీ తనూజ నను దుఃఖముకంటెను జచ్చు టొప్పగున్."

టీకా:

వర = శ్రేష్ఠమైన; వృష = వృషభము; కేతనుడు = ధ్వజముగ కలవాడు; భగవంతుడు = భగవంతుడును; ఐన = అయిన; హరుండు = శివుడు {హరుడు - హరించువాడు, లయకారుడు, శివుడు}; నన్ను = నన్ను; ఆదర = ప్రీతితో; పరిహాస = నవ్వులాట; వాక్యములన్ = మాటలలో; దక్షతనూభవ = దక్షుని కూతురా {తనూభవ - తనువున భవ (పుట్టినామె), స్త్రీ}; అంచున్ = అంటూ; పిల్వ = పిలవగా; నేన్ = నేను; పురపుర = పురపుర మని; బొక్కుచున్ = దుఃఖిస్తూ; ముదమున్ = సంతోషమును; పొందక = పొందకుండ; నర్మవచస్ = చమత్కారపు మాటలు; స్మితంబులు = చిరునవ్వులతో; తొఱగుదు = తప్పించుకొందు; నీ = నీ యొక్క; తనూజన్ = కూతురను; అను = అనెడి; దుఃఖము = దుఃఖము; కంటెను = కంటే; చచ్చుట = మరణించుట; ఒప్పు = తగి; అగున్ = ఉండును.

భావము:

వృషభధ్వజుడు, భగవంతుడు అయిన శివుడు నన్ను ఆదరంగానో పరిహాసంగానో ‘దక్షతనయా’ అని పిలిచినప్పుడు నేను మిక్కిలి దుఃఖిస్తూ ఆనందాన్ని పొందలేక చమత్కారపు మాటలతోనో, చిరునవ్వుతోనో తొలగిపోతాను. నీ కుమార్తెను అని బాధపడడం కంటె చావడం మేలు.

4-96-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అని యిట్లు యజ్ఞసభా మధ్యంబునం బ్రతికూలుండగు దక్షు నుద్దేశించి పలికి కామక్రోధాది శత్రువిఘాతిని యగు సతీదేవి యుదఙ్ముఖి యయి జలంబుల నాచమనంబు చేసి శుచియై మౌనంబు ధరియించి జితాసనయై భూమియం దాసీన యగుచు యోగమార్గంబునం జేసి శరీరత్యాగంబు చేయం దలంచి.

టీకా:

అని = అని; ఇట్ల = ఈ విధముగ; యజ్ఞ = యజ్ఞ; సభా = సదస్సు యొక్క; మధ్యంబున = మధ్యభాగములో; ప్రతికూలుండు = వ్యతిరేకి; అగు = అయిన; దక్షున్ = దక్షుని; ఉద్దేశించి = ఉద్దేశించి; పలికి = పలికి; కామ = కామము {కామక్రోధాదిశత్రువులు - అరిషడ్వర్గములు, 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు}; క్రోధ = క్రోధము; ఆది = మొదలైన; శత్రు = శత్రువులను; విఘాతిని = నశింపజేయునది; అగు = అయిన; సతీదేవి = సతీదేవి; యదత్ = తూర్పునకు; ముఖి = తిరిగినది; అయి = అయ్యి; జలంబులన్ = నీటిని; ఆచమనంబు = ఆచమనము; చేసి = చేసి; శుచి = శుచి; ఐ = అయ్యి; మౌనంబున్ = మౌనమును; ధరియించి = స్వీకరించి; జిత = జయించిన; ఆసన = ఆసనము కలది; ఐ = అయ్యి; భూమి = నేల; అందు = పైన; ఆసీన = కూర్చున్నది; అగుచు = అవుతూ; యోగ = యోగమునకు చెందిన; మార్గంబునన్ = విధానము; చేసి = అందు; శరీర = దేహమును; త్యాగంబున్ = విడుచుట; చేయన్ = చేయవలెనని; తలంచి = అనుకొని.

భావము:

అని ఈ విధంగా యజ్ఞమండప మధ్యభాగంలో తమకు వ్యతిరేకి అయిన దక్షునితో పలికి, కామక్రోధాదులైన అంతశ్శత్రువులను నాశనం చేసే సతీదేవి తూర్పుదిక్కుకు తిరిగి, జలాలతో ఆచమనం చేసి, శుచియై, మౌనం పూని, నేలపై కూర్చొని యోగమార్గం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టాలని నిశ్చయించుకొన్నదై...

4-97-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రుసఁ బ్రాణాపాన వాయునిరోధంబు;
గావించి వాని నేముగ నాభి
లమునఁ గూర్చి యంట నుదానము దాఁక;
నెగయించి బుద్ధితో హృదయపద్మ
ము నిల్పి వాని మెల్ల కంఠమార్గము;
ను మఱి భ్రూమధ్యము వసింపఁ
జేసి శివాంఘ్రి రాజీవ చింతనముచే;
నాథునిఁ దక్క నన్యంబుఁ జూడ

4-97.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మ్మహాత్ముని యంక పీమ్మునందు
నాదరంబున నుండు దేహంబు దక్షు
లని దోషంబునను విడువంగఁ దలఁచి
తాల్చెఁ దనువున ననిలాగ్ని ధారణములు.

టీకా:

వరుసన్ = వరుసగా; ప్రాణ = ప్రాణవాయువు; అపాన = అపాన; వాయు = వాయువులను; నిరోధము = ఆపుట; కావించి = చేసి; వానిన్ = వాటిని; ఏకముగ = ఒకటిగ కలిపి; నాభి = బొడ్డు; తలమునన్ = ప్రాంతమున; కూర్చి = చేర్చి; అంతటన్ = అప్పుడు; ఉదానము = ఉదాన స్థానము; దాకన్ = వరకు; ఎగయించి = ఎక్కించి; బుద్ధితో = బుద్ధిపూర్వకముగ; హృదయ = హృదయము అనెడి; పద్మమున = పద్మమున; నిల్పి = నిలబెట్టి; వానిని = వాటిని; మెల్లన = మెల్లగ; కంఠ = కంఠము; మార్గమున = దారి యమ్మటను; మఱి = మరి; భ్రూమధ్యమునన్ = భ్రూమధ్యమునను; వసింపన్ = ఉండునట్లు; చేసి = చేసి; శివ = శివుని యొక్క; అంఘ్రి = పాదములు అనెడి; రాజీవ = పద్మముల; చింతనము = ధ్యానము; చేత = వలన; నాథునిన్ = భర్తను; తక్క = తప్పించి; అన్యంబున్ = ఇతరమును; చూడక = చూడకుండగ; ఆ = ఆ; మహాత్ముని = గొప్పవాని. అంక = ఒడి అనెడి; పీఠమ్ము = ఆసనము; అందున్ = పైన; ఆదరంబునన్ = ప్రీతిగ; ఉండు = ఉండెడి; దేహంబున్ = శరీరమును; దక్షున్ = దక్షని; వలని = మూలమున; దోషంబునను = దోషముచేత; విడువంగ = విడిచిపెట్ట; తలచి = నిర్ణయించుకొని; తాల్చెన్ = ధరించెను; తనువునన్ = దేహ మందు; అనిల = వాయువును; అగ్నిన్ = అగ్నుల; ధారణములు = ధారణములు.

భావము:

ప్రాణాపానాలనబడే వాయువులను నిరోధించి, వాటి నొక్కటిగా చేసి బొడ్డుతో కలిపి, ఉదానస్థానం వరకు ఎక్కించి, బుద్ధిపూర్వకంగా హృదయపద్మంలో నిలిపి, మెల్లగా కంఠమార్గంలో భ్రూమధ్య భాగానికి చేర్చి, మనస్సులో శివుని పాదపద్యాలను ధ్యానిస్తూ అతన్ని తప్ప ఇతరములైనవేవీ చూడక అతని ఒడిలో ఆదరంతో ఉండే దేహాన్ని దక్షుని కారణంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకొని, యోగాగ్నిని రగుల్కొల్పింది.

4-98-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు ధరియించి గతకల్మషంబైన దేహంబు గల సతీదేవి నిజయోగ సమాధి జనితం బయిన వహ్నిచేఁ దత్క్షణంబ దగ్ధ యయ్యె; అంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ధరియించి = ధరించి; గత = పోయిన; కల్మషంబు = మలములు; ఐన = అయినట్టి; దేహంబున్ = శరీరము; కల = కలిగిన; సతీదేవి = సతీదేవి; నిజ = తన; యోగ = యోగము యొక్క; సమాధిన్ = సమాధిలో; జనితంబున్ = పుట్టినది; అయిన = అయిన; వహ్ని = అగ్ని; చేన్ = చేత; తత్ = ఆ; క్షణంబె = క్షణములోనే; దగ్ద = కాలిపోయినది; అయ్యెన్ = అయ్యెను; అంత = అంతట.

భావము:

ఈ విధంగా దోషాలను పోగొట్టుకొన్న దేహం కలిగిన ఆ సతీదేవి తన యోగసమాధి నుండి పుట్టిన అగ్నిచేత వెంటనే కాలిపోయింది. అప్పుడు...

4-99-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ది గనుఁగొని "హాహా"ధ్వని
వొలఁగ నిట్లనిరి మానవులుఁ ద్రిదశులు "నీ
దిరాక్షి యకట దేహము
లెఁ గదా! దక్షుతోడి వైరము కతనన్."

టీకా:

అది = దానిని; కనుగొని = చూసి; హాహా = హాహాయనెడి; ధ్వని = శబ్దములు; పొదలగన్ = ఉద్భవించగా; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; మానవులున్ = మానవులును; త్రిదశులున్ = దేవతలును; ఈ = ఈ; మదిరాక్షి = సతీదేవి {మదిరాక్షి - మదము కప్పిన అక్షి (కన్నులు కలది), స్త్రీ}; అకట = అయ్యో; దేహమున్ = శరీరమును; వదలెన్ = విడిచినది; కదా = కదా; దక్షున్ = దక్షుని; తోడి = తోటి; వైరము = శత్రుత్వము; కతనన్ = వలన.

భావము:

అది చూచి అక్కడి మానవులు, దేవతలు హాహాకారాలు చేస్తూ “అయ్యో! ఈ సతీదేవి దక్షునిమీది కోపంతో తన శరీరాన్ని విడిచిపట్టినది కదా!” అన్నారు.

4-100-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియు నిట్లనిరి.

టీకా:

మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

ఇంకా ఇలా అన్నారు.

4-101-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"కల చరాచర నకుఁ డై నట్టి యీ;
క్షుండు దన కూర్మి నయ మాన
తి పూజనీయ యీ తి దనచే నవ;
మానంబు నొంది సక్ష మందుఁ
గాయంబు దొఱఁగంగఁ నుఁగొను చున్నవాఁ;
డిట్టి దురాత్ముఁ డెందేనిఁ గలఁడె?
నుచుఁ జిత్తంబుల నాశ్చర్యములఁ బొంది, ;
దియునుఁ గాక యి ట్లనిరి యిట్టి

4-101.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దుష్టచిత్తుండు బ్రహ్మబంధుండు నయిన
యీతఁ డనయంబుఁ దా నపఖ్యాతిఁ బొందు
నిందఁబడి మీఁద దుర్గతిఁ జెందుగాక!"
నుచు జనములు పలుకు నయ్యవసరమున.

టీకా:

సకల = సమస్తమైన; చర = చలనము కలవాటికి; అచర = చలనరహితమైన వాటికి; జనకుడు = తండ్రి {జనకుడు - జననమునకు కారణభూతుడు, తండ్రి}; ఐనట్టి = అయినట్టి; ఈ = ఈ; దక్షుండు = దక్షుడు; తన = తన యొక్క; కూర్మి = ప్రియ; తనయ = పుత్రిక; మానవతి = అబిమానవతి; పూజనీయ = పూజింపదగినది; ఈ = ఈ; సతి = సతీదేవి; తన = తన; చేన్ = చేత; అవమానంబున్ = అవమానమును; ఒంది = పొంది; సమక్షమందు = ఎదురుగ; కాయంబున్ = శరీరమును; తొఱగంగన్ = విడుచుచుండగ; కనగొనుచున్ = చూస్తూ; ఉన్నవాడు = ఉన్నాడు; ఇట్టి = ఇటువంటి; = దురాత్ముడు = దుర్మార్గుడు; ఎందేని = ఎక్కడైన; కలడె = ఉన్నాడా; అనుచున్ = అంటూ; చిత్తంబుల్ = మనసులలో; ఆశ్చర్యములన్ = ఆశ్చర్యములను; పొందిరి = పొందారు; అదియునున్ = అంతే; కాక = కాకుండ; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; ఇట్టి = ఇటువంటి.
దుష్టచిత్తుడు = దుర్మార్గపు మనసు కలవాడు; బ్రహ్మబంధుండు = చెడిపోయిన బ్రాహ్మణుడు {బ్రహ్మబంధుడు - బ్రష్టుపట్టిన బ్రాహ్మణునికి వాడే జాతీయము}; ఈతడు = ఇతగాడు; అనయంబున్ = అవశ్యము; తాన్ = తను; అపఖ్యాతిన్ = చెడ్డపేరును; పొందున్ = పొందును; నిందబడి = తిట్టబడి, దూషింపబడి; మీద = తరువాత; దుర్గతిన్ = నరకమునకు; చెందుగాక = పడుగాక; అనుచున్ = అంటూ; జనములు = జనులు; పలుకు = పలికెడి; ఆ = ఆ; అవసరంబున = సమయములో.

భావము:

సకల చరాచరాలను సృష్టించే ఈ దక్షుడు అభిమానవతి, పూజ్యురాలు అయిన తన ప్రియపుత్రిక సతీదేవి తన చేత అవమానింపబడి, తన ఎదుటనే శరీరాన్ని విడవడం చూస్తూ ఉన్నాడు. ఇటువంటి దుర్మార్గుడు ఎక్కడైనా ఉన్నాడా?” అని ఆశ్చర్యపడ్డారు. ఇంకా ఇలా అన్నారు “ఇటువంటి దుష్టుడు పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు. ఇతడు తప్పక అపకీర్తిని పొంది, నిందల పాలయి, నరకంలో పడతాడు” అని దూషించే సమయంలో...

4-102-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దేము విడిచిన సతిఁ గని
బాహాబల మొప్ప రుద్రపార్షదులును ద
ద్ద్రోహిం ద్రుంచుటకై యు
త్సాహంబున లేచి రసిగదాపాణులునై.

టీకా:

దేహమువిడిచిన = మరణించిన; సతిన్ = సతీదేవిని; కని = చూసి; బాహా = బాహువుల యొక్క; బలము = శక్తి; ఒప్పన్ = అతిశయించగ; రుద్ర = శివుని; పార్షదులు = అనుచరులు; తత్ = ఆ; ద్రోహిన్ = ద్రోహిని; త్రుంచుట = సంహరించుట; కై = కోసము; ఉత్సాహంబునన్ = పట్టుదలతో; లేచిరి = లేచిరి; అసి = కత్తులు; గదా = గదలు; పాణులు = చేతులలో ధరించినవారు; ఐ = అయ్యి.

భావము:

మరణించిన సతీదేవిని చూసి శివుని అనుచరులైన ప్రమథగణాలు అతిశయించిన బాహుబలంతో కత్తులు గదలు చేతుల్లో ధరించి దక్షుని సంహరించడానికి ఉత్సాహంతో లేచారు.

4-103-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వ మపు డీక్షించి మ
హారోషముతోడ భృగుమహాముని క్రతు సం
హాక మారక మగు ' నభి
చాకహోమం ' బొనర్చె రభసవృత్తిన్.

టీకా:

ఆ = ఆ; రవము = చప్పుళ్లు; అపుడు = అప్పుడు; ఈక్షించి = చూసి; మహా = గొప్ప; రోషము = రోషము; తోడ = తోటి; భృగు = భగువు అనెడి; మహా = గొప్ప; ముని = ముని; క్రతు = యజ్ఞమును; సంహారక = నాశనము చేయుదానికి; మారకము = మృత్యువు; అగు = అయ్యెడి; అభిచారక = చెడు చేయుటకైనట్టి; హోమంబు = కర్మకాండ; ఒనర్చె = చేసెను; సరభస = త్వరతతో కూడిన; వృత్తిన్ = విధముగ.

భావము:

ఆ సందడిని చూసి అధ్వర్యుడైన భృగుమహర్షి మిక్కిలి కోపంతో యజ్ఞనాశకులను సంహరించే అభిచారక హోమాన్ని వెంటనే చేశాడు.

4-104-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు దక్షిణాగ్ని యందు వేల్చిన నందుఁ దపం బొనర్చి సోమలోకంబున నుండు సహస్ర సంఖ్యలు గల 'ఋభు' నామధేయు లైన దేవత లుదయించి బ్రహ్మతేజంబునం జేసి దివ్య విమానులై యుల్ముకంబులు సాధనంబులుగా ధరియించి రుద్రపార్షదులయిన 'ప్రమథ' 'గుహ్యక' గణంబులఁ బాఱందోలిన వారును బరాజితులైరి; తదనంతరంబ నారదు వలన నభవుండు దండ్రిచే నసత్కృతురా లగుటం జేసి భవాని పంచత్వంబునొందుటయుం 'బ్రమథగణంబులు' 'ఋభునామక దేవతల'చేఁ బరాజితు లగుటయు విని.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; దక్షిణాగ్ని = దక్షిణాగ్ని {త్రేతాగ్నులు - 1గార్హపత్యాగ్ని 2ఆహవనీయాగ్ని 3దక్షిణాగ్ని}; అందు = లో; వేల్చినన్ = హోమము చేయగ; అందున్ = దానిలో; తపంబు = తపించుట; ఒనర్చి = చేసి; సోమలోకంబునన్ = సోమలోకమున {సోమలోకము - సోములు అనెడి గంధర్వుల లోకము}; ఉండు = ఉండెడి; సహస్ర = వేల; సంఖ్యలు = కొలది; కల = ఉన్న; ఋభు = ఋభువులు అనెడి {ఋభువులు - ఋతువులకు సంబంధించిన దేవతలు}; నామ = పేరు కలిగినవారు; ఐన = అయిన; దేవతలు = దేవతలు; ఉదయించి = పుట్టి; బ్రహ్మతేజంబునన్ = బ్రాహ్మణతేజస్సు; చేసి = వలన; దివ్య = దివ్యమైన; విమానులు = విమానమెక్కినవారు, విశిష్ట మానములు కలవారు; ఐ = అయ్యి; ఉల్ముకంబులు = మండుతున్న కొరివిలను; సాధనంబులు = ఆయుధములు; కాన్ = అగునట్లు; ధరియించి = ధరించి; రుద్ర = శివుని; పార్షదులు = అనుచరులు; అయిన = అయిన; ప్రమథ = ప్రమథుల; గుహ్యక = గుహ్యకులను యక్షులు; గణంబులన్ = సమూహములను; పాఱందోలిన = పారదోలిన, తరిమేసిన; వారును = వారుకూడ; పరాజితులు = ఓడినవారు; ఐరి = అయిరి; తదనంతరంబ = తరువాత; నారదు = నారదుని; వలనన్ = ద్వారా; అభవుండు = శివుడు {అభవుడు - పుట్టుక లేనివాడు, శివుడు}; తండ్రి = తండ్రి (దక్షుడు); చేన్ = చేత; అసత్ కృతురాలు = చెడు మర్యాదలు పొందినామె; అగుటన్ = అగుట; చేసి = వలన; భవాని = సతీదేవి; పంచత్వంబున్ = మరణము {పంచత్వంబు - పంచతత్వములను భూతములను చెందుట, మరణము}; ఒందుటయున్ = పొందుట; ప్రమథగణంబులు = ప్రమథగణములు; ఋభు = ఋభువులు అనెడి; నామకః = పేరు కలిగిన; దేవతల = దేవతల; చేతన్ = వలన; పరాజితులు = ఓడినవారు; అగుటయున్ = అగుట; విని = విని.

భావము:

ఈ విధంగా భృగువు దక్షిణాగ్నిలో వ్రేల్వగా తపస్సు చేసి సోమలోకాన్ని పొందిన ఋభువులు అనే దేవతలు వేలకొలదిగా పుట్టి, బ్రహ్మతేజస్సుతో దివ్యవిమానా లెక్కి, మండుతున్న కొరవులు ఆయుధాలుగా ధరించి, రుద్రుని అనుచరులైన ప్రమథులను, గుహ్యకులను తరిమివేశారు. ఆ తరువాత తండ్రిచేత అవమానింపబడి భవాని మరణించిందని, ప్రమథాదులు ఋభువులచేత ఓడిపోయారని నారదుని వలన శివుడు విన్నాడు.