పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ఈశ్వర దక్షుల విరోధము

  •  
  •  
  •  

4-53.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గ నిజాశ్రమభూములఁ లఁచి వార
లందఱును వేడ్కతోఁ జని నుచు" విదురు
కును మైత్రేయుఁ డను మునినాయకుండు
నెఱుఁగ వినిపించి వెండియు నిట్టు లనియె.

టీకా:

అనఘాత్మా = పుణ్యాత్మా; ఏ = ఏ; యజ్ఞము = యజ్ఞము; అందున్ = లోనైతే; సర్వ = అందరికంటెను; శ్రేష్ఠుడు = గొప్పవాడు; అగు = అయిన; హరి = విష్ణువు; సంపూజ్యుడు = చక్కగ పూజింపబడినవాడు; ఐ = అయ్యి; వెలుంగున్ = ప్రకాశించునో; అట్టి = అటువంటి; యజ్ఞంబు = యజ్ఞము; సమ్యక్ = చక్కటి; విధానమునన్ = పద్ధతిలో; సహస్ర = వెయ్యి; వత్సరములున్ = సంవత్సరములు; అజుడున్ = బ్రహ్మదేవుడు {అజుడు - జన్మము లేనివాడు, బ్రహ్మదేవుడు}; ఒనర్చెన్ = చేసెను; కరము = మిక్కిలి; ఒప్పన్ = చక్కటి; అమరన్ = విధముగ; గంగా = గంగ; యమునా = యమునల; సంగమ = సంగమ, కలియు; ఆవనిన్ = స్థలమున; కలుగు = ఉన్న; ప్రయాగ = ప్రయాగ; అందున్ = లో; అవభృథ = పవిత్ర {అవభృథము - యజ్ఞము కడపట న్యూనాతిరిక్తదోష పరిహారార్థము చేయు కర్మము}; స్నానంబులన్ = స్నానములను; అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; కావించి = చేసి; = గత = పోయిన; కల్మషాత్ములు = పాపములు కలవారు; ఐ = అయ్యి; ఘనత = ప్రసిద్ధి; కిన్ = ని; ఎక్కి = పొంది.
తగన్ = చక్కగ; నిజ = తమ; ఆశ్రమ = నివాస; భూములన్ = స్థలములను; తలచి = తలచుకొని; వారలు = వారు; అందఱున్ = అందరును; వేడ్క = సంతోషము; తోన్ = తోటి; చనిరి = వెళ్ళిరి; అనుచున్ = అంటూ; విదురున్ = విదురుని; కును = కి; మైత్రేయుండు = మైత్రేయుడు; అను = అనెడి; ముని = మునులకు; నాయకుండు = నాయకుడు; ఎఱుగన్ = తెలియునట్లు; వినిపించి = చెప్పి; వెండియున్ = ఇంకను; ఇట్టుల = ఈవిధముగ; అనియె = పలికెను.

భావము:

పుణ్యాత్మా! సర్వశ్రేష్ఠుడైన నారాయణుడు ఏ యజ్ఞంలో పూజనీయుడో అటువంటి యజ్ఞాన్ని బ్రాహ్మణులు వేయి సంవత్సరాలు యథావిధిగా చేశారు. గంగా యమునలు సంగమించే ప్రయాగక్షేత్రంలో సదస్యులు దీక్షా స్నానాలు చేసి పాపాలు పోగొట్టుకొని తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు” అని మైత్రేయ మహర్షి విదురునితో చెప్పి మళ్ళీ ఇలా అన్నాడు.