పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ఈశ్వర దక్షుల విరోధము

  •  
  •  
  •  

4-52-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లన్యోన్యంబును శాపంబులం బొందియు భగవదనుగ్రహంబు గల వారలగుటం జేసి నాశంబు నొందరై; రట్టి యెడ విమనస్కుం డగుచు ననుచర సమేతుం డై భవుండు చనియె నంత.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; అన్యోన్యంబును = ఒకరినొకరు; శాపంబులన్ = శాపములను; పొందియున్ = పొందినప్పటికిని; భగవత్ = భగవంతుని యొక్క; అనుగ్రహంబున్ = అనుగ్రహము; కలవారు = కలిగినవారు; అగుటన్ = అవుట; చేతన్ = చేత; నాశంబున్ = నాశనమును; ఒందరు = పొందనివారు; ఐరి = అయిరి; అట్టి = అటువంటి; ఎడన్ = సమయములో; విమనస్కుండు = విరిగిన మనసు కలవాడు; అగుచున్ = అవుతూ; అనుచర = అనుచరులతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; భవుండు = శివుడు {భవుడు - భవము (శుభము యైనవాడు), శివుడు}; చనియెన్ = వెళ్ళిపోయెను; అంత = అప్పుడు.

భావము:

ఈ విధంగా నందీశ్వరుడు, భృగుమహర్షి ఒకరినొకరు శపించుకున్నారు. దైవానుగ్రహంవల్ల వారు నశింపలేదు. అప్పుడు వ్యాకుల హృదయుడై శివుడు అనుచరులతో అక్కడినుండి వెళ్ళిపోయాడు.