పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ఈశ్వర దక్షుల విరోధము

  •  
  •  
  •  

4-48-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"యంబుం దన మానసంబున నవిద్యన్ ముఖ్యతత్త్వంబు గాఁ
ని గౌరీశుఁ దిరస్కరించిన యసత్కర్మాత్ము నీ దక్షుని
న్ననువర్తించినవాఁరు సంసరణకర్మారంభుఁలై నిచ్చలున్
నం బందుచుఁ జచ్చుచున్ మరల నోజం బుట్టుచున్ వర్తిలున్.

టీకా:

అనయంబున్ = అవశ్యము; తన = తన యొక్క; మానసంబునన్ = మనసులో; అవిద్యన్ = అవిద్యను; ముఖ్యతత్వంబు = ముఖ్యమైన జ్ఞానము; కాన్ = అగునట్లు; కని = దర్శించి; గౌరీశున్ = శివుని {గౌరీశుడు - గౌరీదేవి భర్త, శంకరుడు}; తిరస్కరించిన = తెగడినట్టి; అసత్కర్మాత్మున్ = అబద్దపు కర్మలు కలవానిని; ఈ = ఈ; దక్షునిన్ = దక్షుని; అనువర్తించువారు = అనుసరించి వర్తించువారు; సంసరణ = సాంసారిక; కర్మారంభులు = కర్మాసక్తులు; ఐ = అయ్యి; నిచ్చలున్ = ఎల్లప్పుడున్; జననంబున్ = పుడుతూ; చచ్చున్ = మరణిస్తూ; మరలన్ = మళ్లీ; ఓజన్ = క్రమముగా; పుట్టుచున్ = పుడుతూ; వర్తిల్లున్ = ప్రవర్తించును.

భావము:

“ఎల్లప్పుడు అజ్ఞానాన్నే జ్ఞానంగా భ్రమించి దేవదేవుడైన మహాదేవుని నిందించిన ఈ మహాపాపిని అనుసరించేవారు సర్వదా సంసారంలో చిక్కుకుని పుడ్తూ చస్తూ మళ్ళీ పుడ్తూ ఉందురు గాక!