పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ఈశ్వర దక్షుల విరోధము

  •  
  •  
  •  

4-46-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఇతఁ డింద్రోపేంద్ర పరీ
వృతుఁడై మఖసమయమున హవిర్భాగము దే
లం గూడఁగ మహిత ని
తిఁ బొందక యుండుఁగాక ని శపియించెన్."

టీకా:

ఇతడు = ఇతడు; ఇంద్ర = ఇంద్రునిచేతను; ఉపేంద్ర = విష్ణువుచేతను; పరీవృతుడు = పరివేష్టింబడినవాడు; ఐ = అయ్యి; మఖ = యజ్ఞముల; సమయమునన్ = సమయములలో; హవిర్భాగము = హవిస్సునందలి భాగము; దేవతలన్ = దేవతలతో; కూడగ = కలిసి గ్రహించు; మహిత = గొప్ప; నియతిన్ = భాగ్యమును; పొందక = పొందకుండగ; ఉండుగాక = పోవుగాక; అని = అని; శపియించెన్ = శపించెను.

భావము:

“ఈ శివుడు ఇంద్రుడు, విష్ణువు మొదలైన దేవతలతోపాటు యజ్ఞంలో హవిర్భాగం పొందకుండు గాక!” అని శపించాడు.