పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ఈశ్వర దక్షుల విరోధము

  •  
  •  
  •  

4-42-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రికింప నితఁడు దిక్పాలయశోహాని-
రుఁ డీ క్రియాశూన్యరుని చేతఁ
రమొప్ప సజ్జనారితమార్గము దూషి-
తం బయ్యె; నెన్న గత్రపుండు
హితసావిత్రీ సమానను సాధ్వి న-
స్మత్తనూజను మృగశాబనేత్ర
కల భూమీసుర న సమక్షమున మ-
ర్కటలోచనుఁడు కరగ్రహణ మర్థిఁ

4-42.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జేసి తా శిష్యభావంబుఁ జెందు టాత్మఁ
లఁచి ప్రత్యుద్గమాభివంనము లెలమి
డపకుండిన మాననీ; న్నుఁ గన్న
నోరిమాటకుఁ దన కేమి గోరువోయె.

టీకా:

పరికింపన్ = చర్చించి చూడ; ఇతడు = ఇతను; దిక్పాల = దిక్పాలకుల యొక్క {దిక్పాలకులు - అష్టదిక్పాలకులు - 1 ఇంద్రుడు తూర్పు దిక్కునకు 2 అగ్ని ఆగ్నేయ దిక్కునకు 3 యముడు దక్షిణ దిక్కునకు 4 నిరృతి నైఋతి దిక్కునకు 5 వరుణుడు పడమటి దిక్కునకు 6 వాయువు వాయవ్య దిక్కునకు 7 కుబేరుడు ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు ఈశాన్య దిక్కునకు పరిపాలకులు}; యశస్ = కీర్తికి; హాని = నష్టము; కరుడు = కలిగించువాడు; ఈ = ఈ; క్రియా = చేయు పనులు; శూన్య = ఏమిలేక; పరుని = ఉండువాని; చేతన్ = చేత; కరమొప్పన్ = నిశ్చయముగ; సజ్జన = మంచివారిచే; ఆచరిత = ఆచరింపబడుతున్న; మార్గము = విధానము; దూషితంబు = దూషింపబడినది; అయ్యెన్ = అయినది; ఎన్నన్ = ఎంచిచూడగ; గతత్రపుండు = సిగ్గు లేనివాడు {గతత్రపుడు - గత (పోయిన) త్రపుడు (సిగ్గు కలవాడు)}; మహిత = గొప్ప; సావిత్రీ = సావిత్రీదేవికి; సమాననున్ = సమానమైనామెను; సాధ్విన్ = స్త్రీని {సాధ్వి - సాధుస్వభావురాలు, స్త్రీ}; అస్మత్ = నా యొక్క; తనూజనున్ = పుత్రికను; మృగశాబనేత్రన్ = స్త్రీని {మృగశబనేత్ర - లేడివంటి కన్నులు కలామె, స్త్రీ}; సకల = సమస్తమైన; భూమీసుర = బ్రాహ్మణ {భూమీసురులు - భూమి మీది దేవతలు, బ్రాహ్మణులు}; జన = జనముల; సమక్షమున = సమక్షములో; మర్కట = ఎగుడుదిగుడు; లోచనుడు = కన్నులు కలవాడు; కరగ్రహణము = చేపట్టుట {కరగ్రహణము - చేతిని గ్రహించి, వివాహము చేసికొనుట}; అర్థిన్ = కోరి; చేసి = చేసి.
తాన్ = తను; శిష్యభావమున్ = శిష్య సమాన భావము; చెందుటన్ = చెందుటను; ఆత్మన్ = మనసున; తలచి = తలచుకొని; ప్రత్యుద్గమ = లేచివచ్చి; అభివందనములున్ = గౌరవపూర్వక నమస్కారములు; ఎలమిన్ = ఆసక్తిగ; నడపకుండినన్ = చేయకపోతే; మాననీ = పోనీ; నన్నున్ = నన్ను; కన్న = చూసినందుకు; నోరిమాట = నోటిమాటకు; తనకున్ = తనకి; ఏమి = ఏమి; గోరు = చిన్నతనము; పోయెన్ = అయిపోతుంది.

భావము:

“ఈ శివుడు దిక్పాలకుల కీర్తికి హాని చేసేవాడు. ఇతడు క్రియాశూన్యుడు. సత్పురుషులు నడిచే మార్గం ఇతనివల్ల చెడిపోయింది. ఇతనికి సిగ్గు లేదు. లేడి కన్నులు కలిగి, సావిత్రీదేవివంటి సాధ్వీశిరోమణి అయిన నా కుమార్తెను ఈ కోతికన్నులవాడు పెద్దల సమక్షంలో కోరి పెండ్లి చేసుకున్నాడు. తన శిష్యభావాన్ని తలచుకొని నాకు ఎదురువచ్చి నమస్కరించకపోతే పోనీయండి. నన్ను చూచి పలుకరిస్తే తన నోటి ముత్యాలు రాలిపోతాయా?