పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ఈశ్వర దక్షుల విరోధము

  •  
  •  
  •  

4-37-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యడిగిన నవ్విదురునిఁ
నుఁగొని మైత్రేయుఁ డనియెఁ గౌతుక మొప్పన్
"విను మనఘ! తొల్లి బ్రహ్మలు
నుతముగఁ జేయునట్టి త్రముఁ జూడన్.

టీకా:

అని = అని; అడిగిన = అడగగ; ఆ = ఆ; విదురునిన్ = విదురుని; కనుగొని = చూసి; మైత్రేయుడు = మైత్రేయుడు; అనియెన్ = పలికెను; కౌతుకము = కుతూహలము; ఒప్పన్ = అతిశయించగ; వినుము = వినుము; అనఘ = పుణ్యుడ; తొల్లి = పూర్వము; బ్రహ్మలు = బ్రహ్మవేత్తలు; జన = ప్రజలు; నుతముగ = స్తుతింపబడునట్లు; చేయున్ = చేస్తున్న; అట్టి = అటువంటి; సత్రమున్ = యజ్ఞము; చూడన్ = చూచుటకు.

భావము:

అని అడిగిన విదురునకు మైత్రేయ మహర్షి ఇలా చెప్పాడు. “పుణ్యాత్మా! విను. పూర్వం బ్రహ్మవేత్తలు ప్రారంభించిన మహాయజ్ఞాన్ని చూడటానికి....