పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ఈశ్వర దక్షుల విరోధము

  •  
  •  
  •  

4-36.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కారణము? సతి దా నేమి కారణమున
విడువరానట్టి ప్రాణముల్ విడిచె? మఱియు
శ్వశుర జామాతృ విద్వేష రణి నాకుఁ
దెలియ నానతి యిమ్ము సుధీవిధేయ!"

టీకా:

చతురాత్మ = చతురమైన స్వభావము కలవాడ; దుహితృ = పుత్రిక లందు; వత్సలుండు = వాత్సల్యము అధికముగ కలవాడు; ఐన = అయిన; దక్షుండు = దక్షుడు; తన = తన యొక్క; కూతున్ = పుత్రికను; సతి = సతీదేవిని; అనాదరము = అనాపేక్ష; చేసి = చేసి; అనయంబున్ = అవశ్యము; అఖిల = సమస్తమైన; చరాచర = చరాచరములు అన్నిటికిని; గురుడు = కాపాడువాడు; నిర్వైరుండు = శత్రుత్వము లేనివాడు; శాంతవిగ్రహుడు = శాంతమైన స్వరూపము కలవాడు; ఘనుడు = గొప్పవాడు; జగముల్ = భువనముల; ఎల్లన్ = అన్నిటికిని; చర్చింపన్ = తరచిచూసిన; దేవుండు = దేవుడు; అంచిత = ఒప్పుతున్న; ఆత్మారాముడు = ఆత్మ యందు విహరించువాడు; అలఘుమూర్తి = గొప్పవాడు {అలఘుమూర్తి - అలఘు (చిన్నదికాని, పెద్దదైన) మూర్తి (మూర్తిత్వము కలవాడు), గొప్పవాడు}; శీలవంతులు = శీలము కలవారి; లోనన్ = అందు; శ్రేష్ఠుండు = ఉత్తముడు; అగునట్టి = అయినట్టి; భవుని = శివుని; అందున్ = ఎడల; విద్వేష = మిక్కిలి ద్వేషము; పడుటకున్ = చెందుటకు; ఏమి = ఏమిటి.
కారణము = కారణము; సతి = సతీదేవి; ఏమి = ఏమి; కారణమున = కారణమువలన; విడువరాని = వదలకూడని; ప్రాణముల్ = ప్రాణములను; విడిచెన్ = వదలెను; మఱియున్ = ఇంకను; శ్వశుర = మామ; జామాతృ = అల్లుళ్ళ; విద్వేష = విరోధము యొక్క; సరణి = తీరు; నాకున్ = నాకు; తెలియన్ = తేలియునట్లు; ఆనతిమ్ము = సెలవు; ఇమ్ము = చేయుము; సుధీవిధేయ = సద్బుద్ధి కలవారికి విధేయుడ.

భావము:

“చతురస్వభావం కలవాడా! సజ్జనవిధేయా! తన పుత్రికలపై ప్రేమ గల దక్షుడు సతీదేవిని ఎందుకు అవమానించాడు? సమస్త చరాచరాలకు గురువు, ఎవరినీ ద్వేషింపనివాడు, ప్రశాంతమూర్తి, మహానుభావుడు, ఎల్ల లోకాలకు దేవుడు, ఆత్మారాముడు, విశ్వేశ్వరుడు, శీలవంతులలో అగ్రేసరుడు అయిన మహాదేవుని దక్షుడు ద్వేషించడానికి కారణం ఏమిటి? ఏ కారణంగా సతీదేవి తన ప్రాణాలు విడిచింది? మామయైన దక్షునికి, అల్లుడైన శివునికి విరోధం ఎలా సంభవించింది? నాకు ఈ కథను దయచేసి సెలవీయండి.”