పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ఈశ్వర దక్షుల విరోధము

  •  
  •  
  •  

4-35.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని మునీంద్రుఁడు వినిపింప మ్మహాత్ముఁ
డైన విదురుండు మనమున ద్భుతంబు
దురఁ దత్కథ విన వేడ్క డలుకొనఁగ
మునివరేణ్యునిఁ జూచి యిట్లనియె మఱియు.

టీకా:

దక్షప్రజాపతి = దక్షప్రజాపతి యొక్క; తనయ = పుత్రిక; ఆ = ఆ; భవుని = శివుని; భార్య = భార్య; అనన్ = అనుటకు; తగు = తగిన; సతి = సతీదేవి {సతి - సత్ అను అస్తిత్వము యైన శక్తిరూపి}; అను = అనెడి; లతాంగి = స్త్రీ {లతాంగి - లతవంటి అంగి (అంగములు, దేహము) కలామె, స్త్రీ}; సతతంబున్ = ఎల్లప్పుడును; పతిభక్తి = పతియెడలిభక్తి; సలుపుచుండియున్ = చేస్తున్నప్పటికిని; తనూజాత = సంతాన {తనూజాత - తనువు (దేహమున) జాతము (పుట్టినది), సంతానము}; లాభమున్ = సాఫల్యమును; అందజాలదు = పొందలేనిది; అయ్యెన్ = ఆయెను; భర్గుని = శివుని; దెసన్ = వైపు; చాలన్ = మిక్కిలి; ప్రతికూలుడు = వ్యతిరిక్తము కలవాడు; ఐనట్టి = అయినట్టి; తమ = తమ యొక్క; తండ్రి = తండ్రి; మీది = అందు కలిగిన; రోషమునన్ = రోషము; చేసి = వలన; వలనేది = వేరుపాయములేనిదై; తాన్ = తను; ముగ్ద = అమాయకురాలు; వలె = వలె; నిజ = తన; యోగ = యోగమునకు చెందిన; మార్గంబునన్ = విధానములో; ఆత్మ = తన; దేహంబున్ = శరీరమును; విడిచె = వదిలెను; అని = అని.
ముని = మునులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; వినిపింపన్ = చెప్పగా; ఆ = ఆ; మహాత్ముడు = గొప్పఆత్మ కలవాడు; ఐన = అయిన; విదురుండు = విదురుడు; మనమునన్ = మనసులో; అద్భుతంబు = ఆశ్చర్యకరమైన యాసక్తి; కదురన్ = విజృంభించగ; తత్ = ఆ; కథన్ = కథను; వినన్ = వినుటకు; వేడ్క = కుతూహలము; కడలుకొనగా = ఉప్పొంగగ {కడలుకొను - కడ (చివర) వరకు కొను (తీసుకుపోవు), మిక్కిలి వ్యాపించు}; ముని = మునులలో; వరేణ్యునిన్ = ఉత్తముని; చూచి = చూసి; ఇట్లు = ఇలా; అనియెన్ = పలికెను; మఱియున్ = ఇంకను.

భావము:

దక్షప్రజాపతి కూతురు, పరమశివుని భార్య అయిన సతీదేవి తన పతిని అనునిత్యం మిక్కిలి భక్తితో సేవించినా ఆమెకు సంతానం కలుగలేదు. పరమేశ్వరునిపట్ల పగబూనిన తన తండ్రిమీద కోపించి ఆ ఉత్తమ ఇల్లాలు యోగమార్గంలో తన శరీరాన్ని పరిత్యజించింది.” అని మైత్రేయుడు విదురునితో చెప్పాడు. విదురుడు ఆశ్చర్యపడి ఆ వృత్తాంతమంతా తెలుసుకోవాలనే కుతూహలం కలుగగా ఆ మునీంద్రుని ఇలా ప్రశించాడు.