పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : దక్షప్రజాపతి వంశ విస్తారము

  •  
  •  
  •  

4-33-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణీభర ముడుపుట కా
నారాయణులు భువి జన మనయము నొం
దిరి యర్జున కృష్ణాఖ్యలఁ
గురుయదువంశముల సత్త్వగుణయుతు లగుచున్.

టీకా:

ధరణీ = భూ, భూమి యొక్క; భరమున్ = భారమును; ఉడుపుటకు = తగ్గించుటకు; ఆ = ఆ; నరనారాయణులు = నరనారాయణులు; భువిన్ = భూమిపైన; జననమున్ = జన్మమును; అనయమున్ = అవశ్యము, తప్పకుండగ; ఒందిరి = పొందిరి; అర్జున = అర్జునుడు; కృష్ణ = కృష్ణుడు; ఆఖ్యలన్ = పేర్లతో; కురు = కౌరవ; యదు = యాదవ; వంశములన్ = వంశముల యందు; సత్త్వగుణ = సత్త్వగుణము; యుతులు = కలవారు; అగుచున్ = అవుతూ.

భావము:

భూభారాన్ని తగ్గించడానికి ఆ నరనారాయణులే అర్జునుడు, కృష్ణుడు అనే పేర్లతో కురు యదు వంశాలలో సత్త్వగుణ సంపన్నులై జన్మించారు.