పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : కర్దమప్రజాపతి వంశాభివృద్ధి

  •  
  •  
  •  

4-11-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"సుచరిత్ర! విను విధిచోదితుండై యత్రి-
ప మాచరింపఁ గాంతా సమేతుఁ
యి ఋక్షనామ కులాద్రి తటంబున-
ఘుమఘుమారావ సంకుల విలోల
ల్లోల జాల సంలిత నిర్వింధ్యా న-
దీల పరిపుష్ట రాజితప్ర
సూ గుచ్ఛస్వచ్ఛ మానితాశోక ప-
లాశ కాంతారస్థమున కెలమి

4-11.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిగి యచ్చట నిర్ద్వంద్వుఁ గుచుఁ బ్రాణ
నియమమున నేక పదమున నిలిచి గాలిఁ
దివుటఁ గ్రోలి కృశీభూతదేహుఁ డగుచుఁ
పముఁ గావించె దివ్యవత్సరశతంబు.

టీకా:

సుచరిత్ర = మంచి వర్తన కలవాడ; విను = వినుము; విధి = బ్రహ్మదేవునిచే; చోదితుండు = ప్రేరేపింబడినవాడు; ఐ = అయ్యి; అత్రి = అత్రి; తపము = తపస్సు; ఆచరింపన్ = చేయుటకు; కాంతా = భార్యా; సమేతుండు = తోకూడినవాడు; అయి = అయ్యి; = ఋక్ష = ఋక్ష అనెడి; నామ = పేరుగల; కులాద్రి = కులపర్వతము; తటంబున = సానువు నందు; ఘమఘమారావ = ఘమఘమ యను శబ్దములు; సంకుల = వ్యాపించుతూ; విలోల = ప్రవహిస్తున్న; కల్లోల = పెద్ద అలల; జాల = సమూహములతో; సంకలిత = కూడిన; నిర్వింధ్యా = నిర్వింధ్య అనెడి; నదీ = నదియొక్క; జల = నీటిచే; పరిపుష్ట = చక్కగా పోషింపబడుతున్న; రాజిత = విలసిల్లుతున్న; ప్రసూన = పూల; గుచ్ఛ = గుత్తుల; స్వచ్ఛ = స్వచ్ఛతతో; మానిత = గౌరవింపబడిన; అశోక = నరమామిడి చెట్లు; పలాశ = మోదుగ చెట్ల; కాంతార = అటవీ; స్థలమున్ = ప్రదేశమున; కిన్ = కి; ఎలమిన్ = వికాసముగా, సంతోషముగా; అరిగి = వెళ్ళి.
అచ్చట = అక్కడ; నిర్ద్వంద్వుడు = ద్వంద్వములు విడచినవాడు {నిర్ద్వంద్వండు - సుఖదుఃఖ శీతోష్ణాది ద్వంద్వములను అధిగమించినవాడు}; అగుచున్ = అవుతూ; ప్రాణనియమమున = ప్రాణాయామపూర్వకముగ; ఏకపదమున = ఒంటికాలిమీద; నిలిచి = నిలబడి; గాలిన్ = గాలిని; తివుటన్ = కోరి; క్రోలి = త్రాగుతూ; కృశీభూత = శుష్కించిపోయిన; దేహుడు = శరీరము కలవాడు; అగుచున్ = అవుతూ; తపమున్ = తపస్సును; కావించెన్ = చేసెను; దివ్యవత్సర = దివ్యసంవత్సరములు {దివ్యవత్సరము - 365 దివ్యదినములు (365 మానవసంవత్సరములు)}; శతమున్ = నూరింటిని (100).

భావము:

“పుణ్యాత్మా! విను. విధిప్రేరణతో అత్రిమహర్షి తపస్సు చేయడానికి పూనుకొని, భార్య అయిన అనసూయతో కూడి ఋక్షం అనే కులపర్వతానికి వెళ్ళాడు. అక్కడ నిర్వింధ్యానది ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తున్నది. ఆ నదీ ప్రవాహం వల్ల అక్కడి అడవిలోని అశోకవృక్షాలు, మోదుగుచెట్లు ఏపుగా పెరిగి పూలగుత్తులతో నిండి కనువిందు చేస్తున్నాయి. అటువంటి ప్రదేశంలో అత్రిమహర్షి జితేంద్రియుడై ప్రాణాలను నియమించి, ఒంటికాలిపై నిలుచుండి, శీతోష్ణ సుఖదుఃఖాది ద్వంద్వాలను జయించి, గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని శరీరం బాగా కృశించింది.