పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్ణి

  •  
  •  
  •  

4-975-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విదళిత సారంగా!
సదయాపాంగ! భక్త లధితరంగా!
దురితధ్వాంత పతంగా!
జనకసుతానుషంగ! ననిధి భంగా!

టీకా:

శరవిదళితసారంగా = రామచంద్ర {శరవిదళితసారంగుడు - శర (బాణముచే) విదళిత (మిక్కిలిగా బేధింపబడిన) సారంగుడు (లేడిగలవాడు), రాముడు}; సరసదయాపాంగ = రామచంద్ర {సరసదయాపాంగుడు - సరస (చక్కటి) దయా (దయతోకూడిన) అపాంగుడు (కటాక్షముగలవాడు), రాముడు}; భక్తజలధితరంగా = రామచంద్ర {భక్త జలధి తరంగుడు - భక్త (భక్తులు అనెడి) జలధి (సముద్రపు) తరంగుడు (కెరటములు గలవాడు), రాముడు}; దురితధ్వాంతపతంగా = రామచంద్ర {దురిత ధ్వాంత పతంగుడు - దురిత (పాపములు అనెడి) ధ్వాంత (చీకటికి) పతంగుడు (సూర్యుని వంటివాడు), రాముడు}; వరజనకసుతానుషంగ = రామచంద్ర {వర జనకసు తానుషంగుడు - వర (ఉత్తమురాలైన) జనకసుత (జానకి యందు) అనుషంగుడు (ప్రేమ గలవాడు), రాముడు}; వననిధిభంగా = రామచంద్ర {వననిధిభంగుడు - వననిధి (సముద్రమునకు) భంగుడు (గర్వభంగము చేసినవాడు), రాముడు}.

భావము:

మృగరూపంలో ఉన్న మారీచుని బాణంతో ఖండించినవాడా! ప్రసన్నమైన దయ గలవాడా! భక్తుల హృదయాలనే సముద్రంలో భక్తి తరంగాలను పొంగి పొరలించేవాడా! పాపమనే అంధకారాన్ని అణచడంలో సూర్యుని వంటివాడా! శ్రీ సీతాభిరామా! సముద్రుని అహంకారాన్ని అణచివేసినవాడా!