పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : విదురుండు హస్తిన కరుగుట

  •  
  •  
  •  

4-973-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని శుకయోగి పరీక్షి
జ్జపాల సుధాపయోధి చంద్రున కర్థిన్
వినిపించిన కథ మోదం
బు సూతుఁడు శౌనకాది మునులకుఁ జెప్పెన్.

టీకా:

అని = అని; శుక = శుకుడు యనెడి; యోగి = యోగి; పరీక్షిత్ = పరీక్షితుడు యనెడి; జనపాల = రాజు యనెడి {జనపాలుడు - జనులను పాలించెడివాడు, రాజు}; సుధా = అమృతపు; పయోధి = సముద్రమునకు; చంద్రున్ = చంద్రుని వంటివాని; కిన్ = కి; అర్థిన్ = కోరి; = వినిపించిన = చెప్పిన; కథన్ = కథను; మోదంబునన్ = సంతోషముతో; సూతుడు = సూతుడు; శౌనక = శౌనకుడు {శౌనకుడు – ఋషిర్యుడు శునకుని పుత్రుడు, ఒక మహర్షి}; ఆది = మొదలగు; మునుల్ = మునుల; కున్ = కు; చెప్పెన్ = చెప్పెను.

భావము:

అని శుక మహర్షి పరీక్షిన్మహారాజు చెప్పిన కథను సూతుడు శౌనకాది మునులకు వినిపించాడు.