పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : విదురుండు హస్తిన కరుగుట

  •  
  •  
  •  

4-972-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని శుకుఁడు పరీక్షిత్తున
నుకంపం జెప్పె "నీ యుపాఖ్యానంబున్
వినువాఁ డైశ్వర్యాయు
ర్ధ కీర్తిస్వస్తి గతులఁ గఁ బ్రాపించున్. "

టీకా:

అని = అని; శుకుడు = శుకుడు; పరీక్షిత్తున్ = పరీక్షితుని; కున్ = కి; అనుకంపన్ = ఆదరముతో; చెప్పెన్ = చెప్పెను; ఈ = ఈ; ఉపాఖ్యానంబున్ = వృత్తాంతమును; విను = వినెడి; వాడు = వాడు; ఐశ్వర్య = ఐశ్వర్యము; ఆయుర్ = ఆయుష్షు; ధన = సంపదలు; కీర్తిన్ = యశస్సు; స్వస్తి = క్షేమముల; గతులన్ = మార్గములను; తగన్ = తప్పక; ప్రాపించున్ = ప్రాప్తినిపొందును.

భావము:

అని శుకమహర్షి పరీక్షిత్తుకు సాదరంగా చెప్పాడు. ఈ కథను విన్నవాడు ఐశ్వర్యాన్ని, ఆయుస్సును, ధనాన్ని, కీర్తిని, శుభాలను పొందుతాడు.