పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసులు ముక్తికిఁ జనుట

  •  
  •  
  •  

4-967-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వరనందనుల్ గడఁక నారద వక్త్ర వినిర్గతంబు సుం
మును మంగళావహము న్యము లోకమలాపహంబునై
రఁగిన విష్ణు సద్యశము క్తి నుతించి ముకుంద చింతనా
నిరుపమ భక్తిఁ జెంది హరినిత్య పదంబును బొంది రున్నతిన్.

టీకా:

నరవరనందనుల్ = రాజకుమారులు; కడకన్ = దీక్షతో; నారద = నారదుని; వక్త్ర = నోటినుండి; వినిర్గతంబున్ = వెలువడినది; సుందరమునున్ = అందమైనది; మంగళ = శుభములు; ఆవహమున్ = కలిగించునది; ధన్యమున్ = సార్థకమును; లోక = లోకముల యందలి; మల = మలములను; అపహంబున్ = పోగొట్టునది; ఐ = అయ్యి; పరగిన = ప్రసిద్ధమైన; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; సత్ = చక్కని; యశమున్ = కీర్తిని; భక్తిన్ = భక్తితో; ముకుంద = విష్ణుమూర్తి; చింతనా = ధ్యానించెడి; నిరుపమ = సాటిలేని; భక్తిన్ = భక్తిని; చెంది = పొంది; హరిన్ = విష్ణుని; నిత్య = శాశ్వతమైన; పదంబున్ = స్థానమును; పొందిరి = పొందిరి; ఉన్నతిన్ = ఔన్నత్యముతో.

భావము:

రాకుమారులు నారదముని వర్ణించిన సుందరమూ శుభప్రదమూ ధన్యమూ లోకమాలిన్యాన్ని తొలగించేదీ అయిన నారాయణుని కీర్తిని పొగడి ఆయనను భక్తితో సేవించి శాశ్వతమైన హరి పదాన్ని పొందినారు.