పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసులు ముక్తికిఁ జనుట

  •  
  •  
  •  

4-963.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జితు నచ్యుతుఁ బుండరీకాయతాక్షుఁ
విలి సేవింపకుండునే? ర రసజ్ఞుఁ
డైన పురుషుండు సమ్మోదితాత్ముఁ డగుచుఁ
జారుమతులార! రాజకుమారులార!

టీకా:

వలనొప్పన్ = తగినట్లు; తనున్ = తనను; అనుసరించు = అనుసరించెడి; ఇందిరాకామినీమణిన్ = లక్ష్మీదేవిని {ఇందిరాకామినీమణి - ఇందిర (లక్ష్మీ) యనెడి కామినీ (స్త్రీలలో) మణివంటియామె, లక్ష్మీదేవి}; తత్తత్ = ఆయా; కాంక్షలు = కోరికలుకోరెడివారు; అగుచున్ = అగుచునూ; ధృతిన్ = పూని; అనువర్తించు = అనుసరించెడి; దేవేంద్ర = దేవేంద్రుడు; ముఖ్యులన్ = మొదలగువారును; ఐన = అయిన; ఎవ్వడున్ = ఎవరైతే; చూడడున్ = చూడరో; ఆత్మన్ = మనసుపెట్టి; అట్టి = అటువంటి; = నిత్యస్వతంత్రుని = హరిని {నిత్యస్వతంత్రుని - శాశ్వతమైనస్వతంత్రుడిని, విష్ణువు}; నిజభక్తవరదునిన్ = హరిని {నిజభక్తవరదునిన్ - సత్యమైన భక్తులకు వరములను ఇచ్చెడివానిని, విష్ణువు}; దీనవత్సలున్ = హరిని {దీనవత్సలున్ - దీనులయెడవాత్సల్యముగలవానిని, విష్ణువు}; గుణాధీశునిన్ = హరిని {గుణాధీశునిన్ - త్రిగుణములు అధీనమున యుంచుకొనెడి వానిని, విష్ణువు}; పురుషోత్తమునిన్ = హరిని {పురుషోత్తమునిన్ - పురుషులలో ఉత్తముని, విష్ణువు}; జగద్భరితున్ = హరిని {జగద్భరితున్ - భువనములను భరించెడివానిని, విష్ణువు}; సర్వేశ్వరున్ = హరిని {సర్వేశ్వరున్ - సర్వులకును ఈశ్వరుడు, విష్ణువు}; నారాయణునిన్ = హరిని {నారాయణునిన్ - నీటిలో వసించెడివానిని, విష్ణువు}; చిదానందమయునిన్ = హరిని {చిదానందమయునిన్ - చిత్ (చైతన్యవంతమైన) ఆనందముతో మయుని (నిండినవానిని), విష్ణువు}; అజితున్ = హరిని {అజితున్ - జయింపరానివానిని, విష్ణువు}; అచ్యుతున్ = హరిని {అచ్యుతున్ - చ్యుతము (పతనము) లేని వాడు, విష్ణువు}; పుండరీకాయతాక్షున్ = హరిని {పుండరీకాయతాక్షున్ - పుండరీకములు (తామర) ఆయత (పత్రముల) వంటి అక్షున్ (కన్నులుగలవానిని), విష్ణువు}; తవిలి = పూని.
= సేవింపక = సేవించకుండగా; ఉండునే = ఉండునా ఏమి, ఉండడు; ధరన్ = భూమిపైన; రసజ్ఞుడు = రస జ్ఞానముగలవాడు; ఐన = అయిన; పురుషుండు = పురుషుడు; సమ్మోదిత = సంతోషించిన; ఆత్ముడు = మనసుగలవాడు; అగుచున్ = అగుచును; చారు = చక్కని; మతులారా = మనసలుగలవారా; రాజకుమారులారా = రాకుమారులారా.

భావము:

రాకుమారులారా! తనను కోరి అనుసరించే లక్ష్మిని ఐశ్వర్యంకోసం అనుసరించే ఇంద్రుడు మొదలైనవారిని అనుసరింపని రసజ్ఞుడైన పురుషుడు మనసు పెట్టి నిత్యస్వతంత్రుడు, భక్త వరదుడు, దీనవత్సలుడు, త్రిగుణాధీశుడు, జన్మరహితుడు, పురుషోత్తముడు, తనలో లోకాలన్నీ నిండినవాడు, సర్వేశ్వరుడు, నారాయణుడు, జ్ఞానమనే ఆనందం కలవాడు, ఓడింపరానివాడు, పాపరహితుడు, కమలనేత్రుడు అయిన విష్ణువును సేవింపకుండా ఉంటాడా?”