పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసులు ముక్తికిఁ జనుట

  •  
  •  
  •  

4-958-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుదౌనభ్రతమఃప్రభల్ మును నభంబం దొప్పఁగాఁ దోఁచి క్ర
మ్మ వీక్షింపఁగ నందె లేనిగతి బ్రహ్మంబందు నీ శక్తులుం
రికింపం ద్రిగుణప్రవాహమున నుత్పన్నంబులై క్రమ్మఱన్
వితిం బొందుచు నుండుఁ గావున హరిన్ విష్ణున్ భజింపం దగున్.

టీకా:

అరుదౌ = ఆశ్చర్యకరముగ; అభ్ర = మేఘములు; తమః = చీకట్లు; ప్రభల్ = కాంతులు; మునున్ = ముందు; నభంబున్ = ఆకాశము; అందున్ = లో; ఒప్పగా = చక్కగా; తోచియున్ =కనిపిస్తూ; క్రమ్మఱ = మరల; వీక్షింపగన్ = చూచినచో; అందె = అక్కడే; లేని = లేకపోవు; గతిన్ = విధముగా; బ్రహ్మంబున్ = పరబ్రహ్మము; అందున్ = లో; ఈ = ఈ; శక్తులున్ = శక్తులను; పరికింపన్ = పరికించి చూసినచో; త్రిగుణ = త్రిగుణముల; ప్రవాహముననున్ = ప్రవహించుటచేత; ఉత్పన్నంబులు = పుట్టినవి; ఐ = అయ్యి; క్రమ్మఱన్ = మరల; విరతిన్ = లయ మగుట; పొందుచున్ = పొందుతూ; ఉండున్ = ఉండును; కావునన్ = కనుక; హరిన్ = నారాయణుని; విష్ణున్ = విష్ణుని; భజింపన్ = సేవించుట; తగున్ = తగును.

భావము:

ఆకాశంలో మేఘాలు, తమస్సులు, ప్రకాశాలు ఒకప్పుడు కనిపించి మళ్ళీ చూద్దామంటే కనిపించవు. అట్లే విశ్వసృష్టికి, రక్షణకు, విలయానికి కారణాలైన త్రిగుణ శక్తులు పరబ్రహ్మలోనే ఒకప్పుడు ఆవిర్భవిస్తూ తిరిగి అణిగిపోతూ ఉంటాయి. కాబట్టి విష్ణువును సేవించాలి.