పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసులు ముక్తికిఁ జనుట

  •  
  •  
  •  

4-957-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణిఁ జరాచర భూతము
యఁగ జనియించి యందె డఁగిన పగిదిన్
రిచేఁ బుట్టిన విశ్వము
రి యందె లయంబు నొందు; ది యెట్లన్నన్.

టీకా:

ధరణిన్ = భూమినుండి; చర = కదలగలవి; అచర = కదలలేనివి యైన; భూతముల్ = జీవులు; అరయగన్ = తరచి చూసినచో; జనియించి = పుట్టి; అందె = దానిలోనే; అడగిన = అణగిపోవు; పగిదిన్ = విధముగా; హరి = నారాయణు; చేన్ = వలన; పుట్టిన = పుట్టిన; విశ్వమున్ = జగత్తు; హరి = నారాయణుని; అందె = లోనే; లయంబున్ = లయమును; ఒందున్ = పొందును; అది = అది; ఎట్లు = ఏవిధముగ; అన్నన్ = అనగా.

భావము:

భూమిపై జన్మించిన చరాచర భూతాలు తిరిగి భూమియందే అడగిపోయినట్లుగా శ్రీహరినుండి జన్మించిన ఈ మహావిశ్వం తిరిగి శ్రీహరిలోనే లయమవుతుంది. అది ఎలా అంటే…