పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసులు ముక్తికిఁ జనుట

  •  
  •  
  •  

4-956-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పెను పగు వర్షాకాలం
బు దిననాయకుని వలనఁ బొడమిన సలిలం
యముఁ గ్రమ్మఱ గ్రీష్మం
బు సూర్యుని యందు డిందు పోలిక మఱియున్.

టీకా:

పెనుపు = విస్తారము; అగు = అయిన; వర్షాకాలంబునన్ = వర్షాకాలములో; దిననాయకుని = సూర్యుని {దిననాయకుడు - దినమునకు నాయకుడు, సూర్యుడు}; వలనన్ = వలన; పొడమిన = కలిగిన; సలిలంబున్ = నీరు; అనయమున్ = అవశ్యము; క్రమ్మఱన్ = మరల; గ్రీష్మంబునన్ = వేసవికాలమున; సూర్యుని = సూర్యుని; అందున్ = లో; డిందు = లీనమగు; పోలికన్ = వలె; మఱియున్ = ఇంకను.

భావము:

మంచి వర్షాకాలంలో సూర్యుని కిరణాలవల్ల ఆవిరై మేఘంగా మారిన నీరు తిరిగి గ్రీష్మకాలంలో ఆ సూర్యునియందే లయమైనట్లుగా…