పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసులు ముక్తికిఁ జనుట

  •  
  •  
  •  

4-951.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని ప్రచేతసు లర్థిఁ బల్కినఁ జెలంగి
గవదాయత్త చిత్తుండు వ్యగుణుఁడు
ఖిలలోక విహారుండు నైన యట్టి
నారదుఁడు పల్కె నా రాకుమారులకును.

టీకా:

అనఘాత్మ = పుణ్యాత్మా; భగవంతులు = దేవుళ్ళు; ఐనన్ = అయిన; కేశవ = విష్ణుమూర్తి; వామదేవుల్ = శివుడు; చేన్ = చేత; ఉపదిష్టము = ఉపదేశింపబడినది; ఐన = అయిన; = ఆత్మతత్త్వంబున్ = ఆత్మతత్త్వమును; గృహస్థులము = గృహస్థాశ్రమముననుండెడి; మాకున్ = మాకు; అనయంబున్ = ఎల్లప్పుడు; విస్మృతంబున్ = మరపునబడినది; అయ్యెన్ = అయినది; అట్టి = అటువంటి; కలిత = సమగ్రమైన; తత్త్వ = తత్త్వ; అర్థ = జ్ఞానమును; ప్రకాశంబునున్ = ప్రకాశింపజేయునది; భూరి = అత్యధికమైన; ఘోర = భయంకరమైన; సంసార = సంసారము యనెడి; అబ్ధిన్ = సముద్రమును; తారకంబున్ = దాటించెడిది; ఐ = అయ్యి; కరము = మిక్కలి; ఒప్పారు = చక్కనౌ; ఆత్మతత్త్వమున్ = ఆత్మతత్త్వమును; నేడు = ఇవాళ; చిర = మిక్కలి; దయా = కృపగల; మతిన్ = మనసుతో; ప్రకాశింప = ప్రకాశించునట్లు; చేయుము = చేయుము; అని = అని.
ప్రచేతసుల్ = ప్రచేతసులు; అర్థిన్ = కోరి; పల్కినన్ = పలుకగా; చెలంగి = చెలరేగి; భగవత్ = భగవంతుని యందు; ఆయత్త = ఆధీనమైన; చిత్తుండు = మనసుగలవాడు; భవ్య = శుభమైన; గుణుడున్ = గుణములుగలవాడు; అఖిల = సమస్తమైన; లోక = లోకములందు; విహారుండున్ = విహరించెడివాడు; ఐన = అయిన; అట్టి = అటువంటి; నారదుడు = నారదుడు; పల్కెన్ = పలికెను; ఆ = ఆ; రాకుమారుల్ = రాకుమారుల; కున్ = తోటి.

భావము:

“పుణ్యాత్మా! భగవంతులైన విష్ణువు, శివుడు ఉపదేశించిన ఆత్మజ్ఞానాన్ని సంసారంలో మునిగి మేము మరచిపోయాము. భయంకరమైన సంసార సముద్రాన్ని దాటించే ఆత్మ తత్త్వాన్ని నేడు మాకు మరల దయతో ప్రసాదించు” అని ప్రచేతసులు ప్రార్థించగా సంతోషించి శ్రీమన్నారాయణ చరణాయత్త చిత్తుడు, సద్గుణ సంపన్నుడు, త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ప్రచేతసులతో ఇలా అన్నాడు.