పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసులు ముక్తికిఁ జనుట

  •  
  •  
  •  

4-946-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నరఁ బ్రచేతసు లుత్పన్న విజ్ఞాను-
గుచు వేగంబ నారాయణోక్తిఁ
లఁచుచు నాత్మ నంను కడ నిజభార్య-
నిడి వనవాసులై డఁగి మున్ను
జాబాలి యను మునీశ్వరుఁడు సిద్ధుండైన-
భూరి పశ్చిమ వార్థి తీమునను
ర్వభూతాత్మ విజ్ఞానంబు గల యాత్మ-
న విమర్శకృత సంల్పు లైరి;

4-946.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యంత నచటికి సమ్మోద తిశయిల్ల
ర సురాసుర యక్ష కిన్నర వరేణ్య
మానితోన్నత సంపూజ్యమానుఁ డైన
నారదుండు వివేక విశారదుండు.

టీకా:

ఒనరన్ = చక్కగా; ప్రచేతసుల్ = ప్రచేతసులు; ఉత్పన్న = కలిగిన; విజ్ఞానులున్ = విజ్ఞానులు; అగుచున్ = అగుతూ; వేగంబ = శ్రీఘ్రముగా; నారాయణ = హరి; ఉక్తిన్ = స్తుతులను; తలచుచున్ = తలచుకొనుచూ; ఆత్మ = తమ; నందను = కుమారుని; కడ = వద్ద; నిజ = తమ; భార్యన్ = భార్యను; ఇడి = ఉంచి; వన = అడవిలో; వాసులు = నివసించెడివారు; ఐ = అయ్యి; కడగి = పూని; మున్ను = పూర్వము; జాబలి = జాబాలి; అను = అనెడి; ముని = మునులలో; ఈశ్వరుడు = నాథుడు; సిద్ధుండున్ = సిద్ధుడు; ఐనన్ = కాగా; భూరి = అతిపెద్ద, మహా; పశ్చిమ = పడమటి; వార్థిన్ = సముద్రపు; తీరముననున్ = తీరముయందు; సర్వ = సకల; భూత = భూతముల యొక్క; ఆత్మ = ఆత్మనుగూర్చిన; విజ్ఞానంబున్ = విజ్ఞానము; కల = కలిగిన; ఆత్మన్ = మనసులో; ఘన = గొప్పగా; విమర్శ = విచారించుకొని; కృత = చేసుకొన్న; సంకల్పులు = సంకల్పములు గలవారు; ఐరి = అయిరి.
అంతన్ = అంతట; అచటి = అక్కడ; కిన్ = కి; సమ్మోదము = సంతోషము; అతిశయిల్లన్ = ఉప్పొంగుతుండగా; నర = మానవులు; సుర = దేవతలు; అసుర = రాక్షసులు; యక్ష = యక్షులు; కిన్నర = కిన్నరులయందు; వరేణ్యులు = ప్రముఖులచేత; మానిత = గౌరవింపబడెడి; ఉన్నత = ఉన్నతముగా; సంపూజ్యమానుడు = మిక్కలిపూజింపబడెడివాడి; ఐనన్ = అయినట్టి; నారదుండు = నారదుడు; వివేక = మంచిచెడులు విమర్శించుకొనెడి; విశారదుండు = నేర్పుగలవాడు.

భావము:

ప్రచేతసులు జ్ఞానాన్ని పొందినవారై నారాయణుని బోధనలను పాటించి, భార్యను కొడుకు దగ్గర ఉంచి, వనవాసానికి సంసిద్ధులై పూర్వం జాబాలి అనే ముని సిద్ధిని పొందిన పడమటి సముద్ర తీరంలో సర్వ భూతాత్మ భావనతో ఆత్మ విచారం చేయటానికి సంకల్పించారు. అప్పుడు అక్కడికి నర సుర దానవ యక్ష కిన్నరుల చేత పూజలందుకొనేవాడు, వివేకవంతుడు అయిన నారదుడు వచ్చాడు.