పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-941-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లినభవుఁ డా మహీజ
ప్రయముఁ గని వచ్చి ధరణిపాల తనూజా
తు మధురోక్తుల నుపశాం
తులఁ గావించుచును నయము దూఁకొనఁ బలికెన్

టీకా:

నలినభవుడున్ = బ్రహ్మదేవుడు {నలిన భవుడు - నలినము (పద్మము) అందు భవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; ఆ = ఆ; మహీజ = వృక్షముల; ప్రళయమున్ = ప్రళయమును; కని = చూసి; వచ్చి = వచ్చి; ధరణీపాల = రాజు యొక్క; తనూజాతులన్ = కుమారులను; మధుర = తీయని; ఉక్తులన్ = మాటలతో; ఉపశాంతులన్ = శాంతించినవారిని; కావించుచునున్ = చేయుచూ; నయమున్ = మృదుత్వము; దూకొనన్ = అతిశయించుతుండగా; పలికెను = పలికెను.

భావము:

చెట్లకు కలిగిన వినాశనాన్ని చూచి బ్రహ్మ దిగివచ్చి, తియ్యని మాటలతో ప్రచేతసులను శాంతింపజేశాడు.