పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-940-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కుపితాత్ములై విలయకాల భయంకర హవ్యవాహ లో
నుగతి నుగ్రులై ధరణి క్రము నిర్వసుధారుహంబుగా
యముఁ జేయఁ బూనిన జనాధిపసూనుల మోములందుఁ దా
ల సమీరముల్ జనన మంది కుజంబులఁ గాల్పఁ జొచ్చినన్.

టీకా:

ఘన = గొప్ప; కుపిత = కోపము గల; ఆత్మలున్ = మనసులు గలవారు; ఐ = అయ్యి; విలయ = ప్రళయ; కాల = కాలము నందలి; భయంకర = భయంకరమైన; హవ్యవాహనలోచనున్ = శివుని {హవ్యవాహన లోచనుడు - హవ్యవాహనుడు (అగ్ని) లోచనుడు (కన్నుల గలవాడు), శివుడు}; గతిన్ = వలె; ఉగ్రులు = కోపము గలవారు; ఐ = అయ్యి; ధరణి = భూ; చక్రమున్ = మండలమును; నిర్వసుధారుహంబున్ = చెట్లులేనిది; కాన్ = అగునట్లు; అనయమున్ = తప్పకుండ; చేయన్ = చేయవలెనని; పూనినన్ = సంకల్పించిన; జనాధిపసూనులన్ = రాకుమారుల {జనాధిప సూనులు - జనాధిప (రాజు యొక్క) సూనులు (పుత్రులు), రాకుమారులు}; మోముల్ = ముఖములు, నోర్లు; అందున్ = నుండి; తాము = తాము; అనల = అగ్నిదేవుడు; సమీరముల్ = వాయుదేవుడు; జననమున్ = పుట్టుటను; అంది = చెంది; కుజంబులన్ = చెట్లను {కుజంబులు - కు (భూమి) నుండి జంబులు (పుట్టినవి), చెట్లు}; కాల్పన్ = కాల్చివేయుట; చొచ్చినన్ = మొదలిడగా.

భావము:

పట్టరాని ఆగ్రహాన్ని పొంది ప్రళయకాలంలోని కాలాగ్ని రుద్రుని వలె భయంకరులై భూమండలం మీది సర్వ వృక్షాలను నాశనం చేయడానికి పూనుకున్నారు. ఆ రాజపుత్రుల ముఖాలనుండి అగ్గిగాలుపు పుట్టి ఆ చెట్లను దహింపసాగాయి.