పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-939-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూరి సమున్నతి నాక
ద్వా నిరోధంబు గాఁగఁ గఁ బెరిఁగిన యా
భూరుహ సంఛన్నాఖిల
ధారుణి నీక్షించి రాజనయులు వరుసన్.

టీకా:

భూరి = అత్యధికమైన; సమున్నతిన్ = ఎత్తుగా; నాక = స్వర్గము యొక్క; ద్వార = ద్వారమునకు; నిరోధంబు = నిరోధించునవి; కాగన్ = అగునట్లుగా; తగన్ = మిక్కిలిగా; పెరిగిన = పెరిగిపోయిన; ఆ = ఆ; భూరుహ = చెట్లచే; సంఛన్నా = కప్పబడిన; అఖిల = సమస్తమైన; ధారుణిన్ = భూమిని; ఈక్షించి = చూసి; రాజతనయలు = రాకుమారులు; వరుసన్ = వరుసగా.

భావము:

ఆ రాకుమారులు మిక్కిలి పొడవుగా పెరిగి స్వర్గద్వారాన్ని అడ్డగించినట్లున్న చెట్లతో కప్పబడిన భూమిని చూచి….