పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-931-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముల ముక్తసంగు లగువారు నుతింపఁ దనర్తు వీవు; గా
వు నిలఁ బుణ్యతీర్థములఁ బోలఁ బవిత్రము చేయఁ బూని య
ర్థినిఁ బదచారులై ధరఁ జరించు భవత్పద భక్త సంగమం
నుపమ భూరి సంసృతి భస్థుని బుద్ధి రుచింపకుండునే?

టీకా:

వనములన్ = అడవులలో; ముక్త = వదిలేసిన; సంగులు = తగులములు గలవారు; అగున్ = అయిన; వారు = వారు; నుతింపన్ = స్తుతింపగా; తనర్తువు = తృప్తిచెందెదవు; ఈవున్ = నీవు; కావునన్ = కనుక; ఇలన్ = భూమిపైన; పుణ్య = పుణ్యవంతములైన; తీర్థములన్ = తీర్థములను; పోలన్ = వలె; పవిత్రమున్ = పవిత్రమును; చేయన్ = చేయవలెనని; పూని = పూనుకొని; అర్థినిన్ = కోరి; పదచారులు = పాదచారులు; ఐ = అయ్యి; ధరన్ = భూమిపైన; చరించు = వర్తించెడి; భవత్ = నీ యొక్క; భక్త = భక్తులతోడి; సంగమంబునున్ = సాంగత్యములు; అనుపమ = సాటిలేని; సంసృతి = భవ, సంసార; భయస్థునిన్ = భయముచెందినవాని; బుద్ధిన్ = బుద్ధికి; రుచింపక = రుచించకుండగా; ఉండునే = ఉండునా ఏమి, ఉండదు.

భావము:

అడవులలో ముక్తసంగులైనవారు నిన్ను స్తుతిస్తారు. కాబట్టి పుణ్య తీర్థాలలాగా పవిత్రం చేయటానికి పూనుకొని పాదచారులై భూమిపై సంచరించే నీ భక్తులతోడి సహవాసం సంసార భీతుడైన వాని మనస్సుకు ఎలా రుచింపకుండా ఉంటుంది?