పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-925.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నంత మెఱుఁగంగ రామి ననంతుఁ డనుచుఁ
లుకుదురు; నిన్ను నది గానఁ రమపురుష!
యే వరం బని కోరుదు మేము? దప్పి
గొన్న బాలకుఁ డబ్ది నీ ళ్ళెన్ని గ్రోలు?

టీకా:

అయిననున్ = అయినప్పటికిని; విను = వినుము; సరోజాయతలోచన = హరి {సరోజాయతలోచన - సరోజ (పద్మముల) వంటి ఆయత (పెద్ద) లోచన (కన్నులుగలవాడ), విష్ణువు}; పరమ = అత్యుత్తమమైన; మోక్ష = మోక్షము యొక్క; మార్గ = మార్గమున; ప్రవర్తకుడవు = నడచెడివాడవు; పురుషార్థభూత = ధర్మార్థ కామ మోక్షము లైనవానిని; విస్తరుడవు = అతిశయింపజేయువాడవు; అగున్ = అయినట్టి; నీవున్ = నీవు; తగిలి = పూని; ప్రసన్నుడవు = ప్రసన్నమైనవాడవు; అగుటన్ = అగుట; మాకున్ = మాకు; అర్థిన్ = కోరి; మనోభిష్టము = కోరిన కోరికలు; అయినన్ = అయిన; వరంబున్ = వరము; అయ్యెన్ = అయ్యెను; ఐనన్ = అయినను; నాథ = ప్రభువా; పరాపరుండవు = భగవంతుడవు; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; ఒక = ఒక; వరంబున్ = వరమును; అర్థింతుమున్ = కోరెదము; అనిననున్ = అన్నప్పటికిని; భువిన్ = ప్రపంచములో; తావకీన = నీ యొక్క; విభూతుల్ = వైభవములను; ఎన్నన్ = ఎంచుటకు; అంతమున్ = పూర్తిగా; ఎఱుగంగరామిన్ = తెలియరాకపోవుట చేత; అనంతుడన్ = అనంతుడవు; అనుచున్ = అనుచూ; పలుకుదురు = పలుకుతారు.
= నిన్నున్ = నిన్ను; అదిగాన = అందుచేత; పరమపురుష = నారాయణ; ఏ = దేనిని; వరంబున్ = వరము; అని = అని; కోరుదుము = కోరెదము; మేము = మేము; దప్పికన్ = దాహము; కొన్న = వేసిన; బాలకుడు = పిల్లవాడు; అబ్దిన్ = సముద్రమునుండి; నీళ్లు = నీళ్ళు; ఎన్ని = ఎన్ని; గ్రోలు = తాగును.

భావము:

కమలనయనా! విను. భగవంతుడవైన నీవు మాకు ప్రసన్నుడవు కావటమే మాకు ఇష్టమైన వరం. ఒకవేళ నిన్ను ఒక వరాన్ని అడుగదలచినా అదికూడ కష్టమే. నీ విభూతులు అనంతాలు. అందుచేత నిన్ను అనంతు డంటారు. కాబట్టి నిన్ను ఏ వరమని కోరగలం? దప్పికొన్న బాలుడు సముద్రంలోని నీళ్ళను ఎన్ని త్రాగగలడు?