పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-918-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"కేశవ! సంతత క్లేశ నాశనుఁడవు-
గురుసన్మనో వాగగోచరుఁడవు
నిద్ధమనోరథ హేతుభూతోదార-
గుణనాముఁడవు సత్త్వగుణుఁడ వఖిల
విశ్వోద్భవస్థితి విలయార్థధృతనిత్య-
విపులమాయాగుణ విగ్రహుఁడవు
హితాఖిలేంద్రియ మార్గ నిరధిగత-
మార్గుఁడ వతిశాంత మానసుఁడవు

4-918.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విలి సంసార హారి మేస్కుఁ డవును
దేవదేవుఁడవును వాసుదేవుఁడవును
ర్వభూత నివాసివి ర్వసాక్షి
వైన నీకు నమస్కారయ్య! కృష్ణ!

టీకా:

కేశవ = నారాయణ {కేశవః - విష్ణుసహస్రనామములలో 23వ నామము 648వ నామము, మంచివెంట్రుకలుగలవాడు, త్రిమూర్తులు క (బ్రహ్మ) అ (విష్ణు) ఈశ (శివ) వశవర్తులుగా కలవాడు, కేశి అను అసురుని సంహరించినవాడు, కేశములు (అంశువులు, కిరణములు) ప్రకాశించు వాడు, కేవలము శుభమైనవాడు, విష్ణువు}; = {క్లేశములు - చిత్తవృత్తులనుండి జనించునవి యైదు 1ప్రమాణము (త్రివిధప్రమాణములు అవ 1ఇంద్రియగోచరము 2అనుమానము 3శబ్దప్రమాణము) 2విపర్యయము (ప్రమాణాతీతమైనది) 3మిథ్య (ఉన్న స్థితికి వేరుగ దర్శించుట) 4నిద్ర (గుర్తించెడి సామర్థ్యము లోపించుట) 5స్మృతి (ప్రమాణము లేనప్పటికిని గుర్తించుట)} గురుసన్మనోవాగగోచరుడవు = నారాయణ {గురుసన్మనోవాగగోచరుడవు - మిక్కిలి మంచివారి మనస్సులకు వాక్కులకు గోచరుడవు (అందని వాడవు), విష్ణువు}; ఇద్ధమనోరథహేతుభూతోదారగుణనాముడవు = నారాయణ {ఇద్ధమనోరథహేతుభూతోదారగుణనాముడవు - ఇద్ధ (ప్రసిద్ధమైన) మనోరథ (శ్రేయస్సులకు)హేతుభూత (కారణమైన) ఉదార (ప్రసాదించెడి) గుణ (సుగుణములకు)నాముడవు (పేరుబడ్డవాడవు), విష్ణువు}; = సత్త్వగుణుడవు = నారాయణ {సత్త్వగుణుడవు – సత్త్త్వగుణము గలవాడవు, విష్ణువు}; అఖిల విశ్వోధ్భవ స్థితి విలయార్థధృత నిత్యవిపుల మాయాగుణ విగ్రహుడవు = నారాయణ {అఖిల విశ్వోధ్భవ స్థితి విలయార్థధృత నిత్య విపుల మాయాగుణ విగ్రహుడవు - సమస్తమైన లోకములకు ఉద్భవ (సృష్టి) స్థితి లయముల అర్థ (ప్రయోజనములకు) ధృత (ధరింపబడిన) నిత్య (శాశ్వతమైన) విపుల (విస్తారమైన) మాయా (మాయతోకూడిన) గుణ (గుణములు) విగ్రహుడవు (రూపముకలవాడు, విష్ణువు}; = = మహితాఖిలేంద్రియ మార్గ నిరవధి గతమార్గుడవు = నారాయణ {మహితాఖిలేంద్రియ మార్గ నిరవధిగత మార్గుడవు - మహిత (గొప్ప) అఖిల (సర్వ) ఇంద్రియముల (నడవడికకు) నిరవధిక (ఎడతెగని) గత (వెళ్ళిన మార్గమున) (అధిగతుతుడవు), విష్ణువు}; అతిశాంతిమానసుడవు = నారాయణ {అతి శాంతి మానసుడవు - మిక్కిల శాంతిస్వభావముగలవాడవు,విష్ణువు};
తవిలిసంసారహారిమేధస్కుడవును = నారాయణ {తవిలిసంసారహారిమేధస్కుడవు - తవిలి (తగులుకొన్న) సంసార (భవబంధములను) హారి (హరించునట్టి) మేధస్కుడవు (బుద్ధిబలము గలవాడవు), విష్ణువు}; దేవదేవుడవును = నారాయణ {దేవదేవుడవు - దేవవుళ్ళకే దేవుడవు, విష్ణువు}; వాసుదేవుడవును = నారాయణ {వాసుదేవః - వసుదేవుని పుత్రుడు, అంతటను నిండి ఉండువాడు, తనమాయాశక్తిచే సర్వము ఆవరించిన వాడు, కృష్ణుడు,విష్ణుసహస్రనామాలలో 332వ నామం, 695వ నామం, 709వ నామం}; సర్వభూత నివాసివి = నారాయణ {సర్వభూతనివాసివి - సర్వ (సకల) భూతముల (జీవుల) యందును నివసించెడివాడవు, విష్ణువు}; సర్వసాక్షివిన్ = నారాయణ {సర్వసాక్షివి - సమస్తమునకు సాక్షీభూతుడవు, విష్ణువు}; ఐన = అయిన; నీకున్ = నీకు; నమస్కారమున్ = నమస్కారము; అయ్య = తండ్రి; కృష్ణా = కృష్ణుడా.

భావము:

“కేశవా! నీవు దుఃఖాన్ని తొలగిస్తావు. భక్తుల మనస్సునకు, మాటకు అందవు. సకల శ్రేయస్సులను కలిగించే ఉదార గుణాలు, నామాలూ కలవాడవు. సత్త్వగుణసంపన్నుడవు. ప్రపంచ సృష్టి, స్థితి, విలయాల కోసం మాయామయమైన బ్రహ్మాది గుణ విగ్రహాన్ని ధరిస్తావు. నీవు సర్వేంద్రియ మార్గాల చేత తెలియబడని మార్గం కలవాడవు. ప్రశాంతమైన మనస్సు కలవాడవు. సంసారాన్ని హరించే జ్ఞానం కలవాడవు. దేవదేవుడవు. వాసుదేవుడవు. నీవు సర్వ ప్రాణులలో నివసిస్తావు. నీవు సర్వసాక్షివి. కృష్ణా! నీకు నమస్కారం.