పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-917-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సరసీరుహంబు లెసకం బెసఁగన్ ముకుళించి గద్గద
స్వములఁజేసి యిట్లనిరి ర్వశరణ్యు నగణ్యు నిందిరా
రు నజితున్ గుణాఢ్యు ననద్యచరిత్రుఁ బవిత్రు నచ్యుతుం
రుఁ బరమేశు నీశు భవబంధవిమోచనుఁ బద్మలోచనున్.

టీకా:

కర = చేతులుయనెడి; సరసీరుహంబుల = పద్మముల {సరసీరుహము - సరసున పుట్టునది, పద్మము}; ఎసకము = అతిశయము; ఎసగన్ = అతిశయించగా; ముకుళించి = ముడిచి; గద్గద = బొంగురుపోయిన; స్వరములన్ = కంఠముల; చేసి = తో; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; సర్వశరణ్యున్ = విష్ణుమూర్తిని {సర్వశరణ్యుడు - నిఖిలములకు శరణము ఐనవాడు, విష్ణువు}; అగణ్యున్ = విష్ణుమూర్తిని {అగణ్యుడు – గణించుటకు రానివాడు, విష్ణువు}; ఇందిరావరున్ = విష్ణుమూర్తిని {ఇందిరా వరుడు - ఇందిర (లక్ష్మీదేవి యొక్క) వరుడు (భర్త), విష్ణువు}; అజితున్ = విష్ణుమూర్తిని {అజితుడు - గెలుచటకు సాధ్యము కానివాడు, విష్ణువు}; గుణాఢ్యున్ = విష్ణుమూర్తిని {గుణాఢ్యుడు - సుగుణములు అనెడి సంపద గలవాడు, విష్ణువు}; అనవద్యచరిత్రున్ = విష్ణుమూర్తిని {అనవద్యచరిత్రుడు - మచ్చలేని నడవడిక గలవాడు, విష్ణువు}; పవిత్రున్ = విష్ణుమూర్తిని {పవిత్రుడు - పవిత్రతేతానైనవాడు, విష్ణువు}; అచ్యుతున్ = విష్ణుమూర్తిని {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేనివాడు, విష్ణువు}; పరున్ = విష్ణుమూర్తిని {పరుడు - అతీతమైనవాడు, విష్ణువు}; పరమేశున్ = విష్ణుమూర్తిని {పరమేశుడు - పరమమైన (అత్యుత్తమమైన) ఈశుడు, విష్ణువు}; ఈశున్ = విష్ణుమూర్తిని {ఈశుడు - ఈశత్వము (ప్రభుత్వము) గలవాడు, విష్ణువు}; భవబంధవిమోచనున్ = విష్ణుమూర్తిని {భవబంధ విమోచనుడు - సంసారబంధనములనుండి విముక్తిని ప్రసాదించువాడు, విష్ణువు}; పద్మలోచనున్ = విష్ణుమూర్తిని {పద్మ లోచనుడు - పద్మముల వంటి కన్నులు గలవాడు, విష్ణువు}.

భావము:

సంతోషంతో తామరలవంటి తమ చేతులను మోడ్చి గద్గదస్వరంతో అందరూ శరణు కోరేవాడు, గణింప శక్యం కానివాడు, లక్ష్మీదేవికి భర్త అయినవాడు, గెలువరానివాడు, సుగుణసంపద కలవాడు, మచ్చలేని చరిత్ర కలవాడు, పవిత్రుడు, అచ్యుతుడు, అతీతుడు, పరమేశుడు, సంసారబంధాలనుండి విముక్తిని ప్రసాదించేవాడు, కమలనేత్రుడు అయిన విష్ణువుతో ఇలా అన్నారు.