పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-912-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"య గృహస్థు లయ్యును మర్పిత కర్ములు నస్మదీయ సుం
చరితామృతశ్రవణ త్పర మానస యాతయాములున్
స గుణాఢ్యు లై తనరు సాధుల కీ గృహముల్ దలంప దు
ష్క భవబంధ హేతువులు గావు నృపాత్మజులార! యెన్నఁడున్.

టీకా:

అరయన్ = తరచి చూసినచో; గృహస్థులు = గృహస్థులు; అయ్యును = అయినప్పటికిని; మత్ = నాకు; అర్పిత = అర్పింపబడిన; కర్ములున్ = కర్మములు చేయువారు; అస్మదీయ = నా యొక్క; సుందర = అందమైన; చరిత = వర్తనలు యనెడి; అమృత = అమృతమును; శ్రవణ = వినుట యనెడి; తత్ = వాటి యందు; పర = లగ్నమైన; మానస = మనసులు; యాత = గడచిన; యాములున్ = జాములు గలవారు; సరస = సరసమైన; గుణా = గుణములు యనెడి; ఆఢ్యులు = సంపద గలవారు; ఐ = అయ్యి; తనరు = అతిశయించెడి; సాధుల్ = మంచివారి; కిన్ = కి; గృహముల్ = గృహములు; తలంపన్ = భావింపగా; దుష్కర = కష్టములుకలిగించెడి; భవబంధ = భవబంధములను కలిగించుటకు; హేతువులు = కారణములు; కావు = కావు; నృపాత్మజలులారా = రాకుమారులారా; ఎన్నడున్ = ఎప్పుడును, ఎప్పటికిని.

భావము:

“రాజపుత్రులారా! గృహస్థు లైనప్పటికీ కర్మలను నాకు సమర్పించి అమృతం వంటి నా కథలను వింటూ కాలాన్ని గడిపే సజ్జనులకు గృహాలు బంధాలు కానే కావు.