పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

 •  
 •  
 •  

4-910-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శిశు వపుడు పేరాఁకలిచేఁ గుంది-
వావిచ్చి బిట్టు వాపోవు చుండ
నాలించి యటకు రాజైన సోముఁడు వచ్చి-
లనొప్ప నవసుధార్షి యైన
యాత్మీయ తర్జని ర్థిఁ బానమ్ము చే-
యింపంగఁ బెరిఁగి య య్యిందువదనఁ
న్యా వరారోహఁ డఁక మారిష యను-
చెలువఁ బుణ్యుండు ప్రాచీనబర్హి

4-910.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

న్నృపునిచేఁ బ్రజా విసర్గావసరము
నందు వేడ్కఁ దదాదిష్టులైన మీర
లందఱును నెయ్యమున వివాహంబు గండ"
ని సరోరుహనయనుఁ డిట్లనియె; మఱియు.

టీకా:

ఆ = ఆ; శిశువు = శిశువు; అపుడున్ = అప్పుడు; పేరాకలి = అత్యధికమైన ఆకలి; చేన్ = చేత; కుంది = భాధపడి; వావిచ్చి = నోరువిప్పి; బిట్టు = గట్టిగా; వాపోవుచుండన్ = ఏడ్చుచుండగా; ఆలించి = విని; అట = అక్కడ; కున్ = కి; రాజు = ప్రభువు; ఐన = అయినట్టి; సోముడు = సోముడు; వచ్చి = వచ్చి; వలనొప్పన్ = నేర్పు; ఒప్పన్ = ఒప్పునట్లుగా; నవ = మృదువైన; సుధా = అమృతమును; వర్షి = స్రవించెడి; ఐన = అయిన; ఆత్మీయ = తన యొక్క; తర్జని = చూపుడువేలు; అర్థిన్ = కోరి; పానమ్మున్ = తాగునట్లు; చేయింపగన్ = చేయించగా; పెరిగి = పెరిగి; ఆ = ఆ; ఇందు = చంద్రుని వంటి; వదనన్ = మోముకలామెని; కన్యా = కన్యలలో; వర = ఉత్తములలో; ఆరోహ = గొప్పామెని; కడకన్ = పూని; మారిష = మారిష; అను = అనెడి; చెలువన్ = స్త్రీని {చెలువ - చిన్నవయసుకల, స్త్రీ}; పుణ్యుండు = పుణ్యుడు; ప్రాచీనబర్హి = ప్రాచీనబర్హి.
ఆ = ఆ; నృపునిన్ = రాజు; చేన్ = చేత; ప్రజా = సంతానము; విసర్గా = పుట్టించెడి; అవసరంబునన్ = పని; అందున్ = లో; వేడ్కన్ = కోరి; తత్ = దానియందు; ఆదిష్టులు = ఆనతియ్యబడినవారు; మీరలు = మీరు; అందఱునున్ = అందరును; నెయ్యమునన్ = స్నేహముతో; వివాహంబున్ = వివాహము; కండు = చేసికొనుడు; అని = అని; సరోరుహనయనుడు = విష్ణుమూర్తి {సరోరహనయనుడు - సరోరుహము (పద్మము) వంటి నయనుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; మఱియున్ = ఇంకనూ.

భావము:

ఆ శిశువు ఆకలి బాధతో నోరు తెరచి గట్టిగా ఏడ్వసాగింది. ఆ ఏడుపు విని రాజైన చంద్రుడు వచ్చి అమృతం స్రవించే తన చూపుడు వ్రేలిని శిశువు నోటిలో ఉంచాడు. శిశువు అమృతం త్రాగి పెరిగింది. యౌవనవతి అయింది. ఆమె పేరు మారిష. మీ తండ్రి ప్రాచీనబర్హి ఆజ్ఞచేత ప్రజాసృష్టి చేయటానికి పూనుకొన్న మీరు అందరూ ప్రేమతో ఆమెను పెండ్లాడండి” అని చెప్పి విష్ణువు ఇంకా ఇలా అన్నాడు.