పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-908-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భ్రాతృజన సౌహృదంబును
భూదయాగుణము విమల బుద్ధియు సుజన
ప్రీతియుఁ గల్గి సుఖించును
వీ సమస్తాఘుఁ డగుచు విశ్వములోనన్.

టీకా:

భ్రాతృ = సోదరులైన; జన = వారి; సౌహృదంబునున్ = స్నేహమును; భూత = జీవుల యెడ; దయా = దయ కలిగి ఉండెడి; గుణమున్ = లక్షణమును; విమల = స్వచ్ఛమైన; బుద్ధియున్ = బుద్ధి; సుజన = మంచివారి; ప్రీతియున్ = ప్రేమను; కల్గి = కలిగి ఉండి; సుఖించునున్ = సుఖములు అనుభవించుచుండును; వీత = వదలివేసిన; సమస్తా = సమస్తమైన; ఆఘుడు = పాపములు కలవాడు; అగుచున్ = అవుతూ; విశ్వము = జగతి; లోనన్ = లోపల.

భావము:

అతడు సోదర స్నేహాన్ని, భూతదయను, నిర్మల బుద్ధిని, సజ్జనుల ప్రేమను పొ౦ది సుఖిస్తాడు. అతని సమస్త పాపాలు నశిస్తాయి.