పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-907-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యమును మీ మనోరథ
మొరింతు; నెఱుంగఁ బలుకుఁ; డుత్తము లగు మి
మ్మనుదినము నెవ్వఁడు సుఖశ
నుఁడై మదిలోనఁ దలఁచు నా నరుఁ డెపుడున్.

టీకా:

అనయమునున్ = అవశ్యము; మీ = మీ యొక్క; మనోరథమున్ = కోరికలను; ఒనరింతున్ = తీర్చెదను; ఎఱుంగన్ = తెలియునట్లు; పలుకుడు = చెప్పండి; ఉత్తములు = శ్రేష్ఠులు; అగు = అయిన; మిమ్మున్ = మిమ్ములను; అనుదినమున్ = ఎల్లప్పుడు; ఎవ్వడున్ = ఎవరైతే; సుఖ = సుఖముగా; శయనుడు = విశ్రాంతి తీసుకొనుచున్నవాడు; ఐ = అయ్యి; మదిన్ = మనసు; లోన్ = లోపల; తలచున్ = తలచుతుండునో; ఆ = ఆ; నరుడున్ = మానవుడు; ఎపుడున్ = ఎప్పుడు.

భావము:

కాబట్టి మీకు వరం ఇస్తాను అడగండి. ఉత్తములైన మిమ్మల్ని ఏ మానవుడు నిత్యం నిద్రపోయే ముందు స్మరిస్తాడో…