పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-904-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సు గరుడ యక్ష కిన్నర
నిరుపమ జేగీయమాన నిఖిలాశా సం
రిత యశోమహనీయ
స్ఫుణుండు నగు న ప్పురాణ పురుషుం డెలమిన్

టీకా:

సుర = దేవతలు; గరుడ = గరుడులు; యక్ష = యక్షులు; కిన్నర = కిన్నరలచే; నిరుపమ = సాటిలేని విధముగ; జేగీయమాన = స్తుతింపబడుటచే; నిఖిల = సకల; ఆశా = దిక్కులు; సంభరిత = నిండిపోయిన; యశో = కీర్తిగలిగిన; మహనీయ = గొప్పగా; స్ఫురణుండు = తెలియబడువాడు; అగు = అయిన; ఆ = ఆ; పురాణపురుషుండు = హరి; ఎలమిన్ = సంతోషముతో.

భావము:

దేవతలు, గరుడులు, యక్షులు, కిన్నరులు దిక్కుల నడుమ నిండిన శ్రీహరి కీర్తిని గానం చేస్తున్నారు. ఆ పురాణ పురుషుడైన విష్ణువు…