పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-902-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న మేరుశృంగ సంత నీల మేఘంబు-
నెఱి గరుడస్కంధ నివసితుండుఁ
మనీయ నిజదేహకాంతి విపాటితా-
భీలాఖి లాశాంతరా తముఁడు
సుమహితాష్టాయుధ సుమనో మునీశ్వర-
సేవక పరిజన సేవితుండు
మండిత కాంచన కుండల రుచిరోప-
లాలిత వదన కపోతలుఁడు

4-902.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చారు నవరత్నదివ్యకోటీ ధరుఁడు
కౌస్తుభప్రవిలంబ మంళగళుండు
లిత పీతాంబరప్రభాలంకృతుండు
హార కేయూర వలయ మంజీర యుతుఁడు

టీకా:

ఘన = గొప్ప; మేరు = మేరు; శృంగ = పర్వతశిఖరము; సంగతన్ = సాంగత్యముగల; నీలమేఘంబున్ = నీలిమేఘము వలె; నెఱిన్ = నిండుగా; గరుడ = గరుత్మంతుని; స్కంధ = మూపున; నివసితుండున్ = వసించుతున్నవాడు; కమనీయ = మనోజ్ఞమైన; నిజ = తన; దేహ = శరీర; కాంతి = కాంతిచే; విపాటిత = విరగగొట్టబడిన; ఆభీల = భయంకరమైన; అఖిలా = సమస్తమైన; ఆశాంత = దిక్కుల; అంతరాళ = లోపలి; తముండు = చీకటిగలవాడు; సు = మిక్కిలి; మహిత = గొప్ప; అష్ట = ఎనిమిది; ఆయుధ = ఆయుధములు {విష్ణుని అష్టాయుధములు - 1 శంఖము 2చక్రము 3శారజ్ఞము అనెడి విల్లు, 4కత్తి 5పద్మము 6గదా 7దండము 8శూలము}; సుమనః = దేవతలు; ముని = మునులలో; ఈశ్వర = శ్రేష్ఠులు; సేవక = సేవకులు; పరిజన = పరివారములుచేతను; సేవితుండు = సేనింపబడుతున్నవాడు; మండిత = అలంకృతమైన; కాంచన = బంగారపు; కుండల = చెవికుండలముల; రుచిర = కాంతులచే; ఉపలాలిత = బుజ్జగింపబడుతున్న; వదన = మోము; కపోల = చెక్కిళ్ళ; తలుడు = ప్రదేశములు కలవాడు.
చారు = అందమైన; నవరత్న = నవరత్నములు పొదిగిన; దివ్య = దివ్యమైన; కోటీర = కిరీటము; ధరుడు = ధరించినవాడు; కౌస్తుభ = కౌస్తుభమణి; ప్రవిలంబ = చక్కగావేళ్ళాడుతున్; మంగళ = శుభప్రదమైన; గళుండు = కంఠముగలవాడు; లలిత = అందమైన; పీతాంబర = పట్టుబట్టల; ప్రభా = కాంతులచే; అలంకృతుడు = అలంకరింపబడినవాడు; హార = హారములు; కేయూర = బాహుపురులు; వలయ = కంకణములు; మంజీర = అందెలు; యుతుడు = కలిగినవాడు.

భావము:

ఆ శ్రీహరి మేరుపర్వత శిఖరంపై నల్లని మేఘం వలె గురుడుని మూపుపై కూర్చున్నాడు. తన శరీర కాంతులతో నలుదిక్కుల నడుమ వ్యాపించిన చీకటిని తొలగిస్తున్నాడు. అష్టాయుధాలు {విష్ణుదేవుని అష్టాయుధములు - 1 శంఖము 2చక్రము 3శార్ఙ్గము అనెడి విల్లు, 4కత్తి 5పద్మము 6గదా 7దండము 8శూలము} మూర్తిమంతాలై అతనిని సేవిస్తున్నవి. దేవతలు, మునీశ్వరులు సేవకులై కొలుస్తున్నారు. ఆయన చెవులకు ధరించిన బంగారు కుండలాల కాంతి ముఖంమీద, చెక్కిళ్ళమీద వ్యాపిస్తున్నది. నవరత్నమయమైన కిరీటాన్ని ధరించాడు. కౌస్తుభమణి మంగళకర మైన కంఠంలో వ్రేలాడుతున్నది. అందమైన జిలుగు పట్టు బట్టలు కట్టుకున్నాడు. ముత్యాలహారాలు, భుజకీర్తులు, కడియాలు, అందెలు ధరించాడు.