పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-901-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుపమ శాంతము లగు నిజ
ను రశ్ములచే నృపాల నయ తపో వే
లు శమింపగఁ జేయుచు
యముఁ బ్రత్యక్ష మయ్యె; చ్యుతుఁ డంతన్.

టీకా:

అనుపమ = సాటిలేని; శాంతములున్ = శాంతము కలిగించెడివి; అగు = అయిన; నిజ = తన; తను = శరీరము యొక్క; రశ్ములు = కాంతులు; చేన్ = చేత; నృపాలతనయ = రాజకుమారుల; తపః = తపస్సు యొక్క; వేదనలున్ = బాధలను; శమింపగన్ = శాంతించునట్లు; చేయుచున్ = చేస్తూ; అనయమున్ = అవశ్యము; ప్రత్యక్షము = ప్రత్యక్షము; అయ్యెన్ = అయ్యెను; అచ్యుతుడు = హరి {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేనివాడు, విష్ణువు}; అంతన్ = అంతట.

భావము:

ఆ రాకుమారుల తపఃక్లేశాన్ని శమింపజేస్తూ, తన సాటిలేని శరీరకాంతులతో శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు.