పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-900-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దివే లేఁడులు నిష్ఠను
లక తప మాచరింప వారల కర్థిన్
యాంతరంగుఁ డభయ
ప్రదుఁడు సనాతనుఁడు నైన ద్మోదరుఁడున్.

టీకా:

పదివేల = పదివేల (10, 000); ఏడులు = సంవత్సరములు; నిష్ఠను = నియమపాలనను; వదలక = వదలిపెట్టకుండగా; తపమున్ = తపస్సును; ఆచరింపన్ = చేయగా; వారల్ = వారి; కిన్ = కి; అర్థిన్ = కోరి; సదాయాంతరంగుడున్ = హరి {సదాయాంతరంగుడు - సత్ (మిక్కిలి) దయా (కృపగల) అంతరంగుడు (మనసు గలవాడు), విష్ణువు}; అభయప్రదుడున్ = హరి {అభయ ప్రదుడు - అభయము ఇచ్చువాడు, విష్ణువు}; సనాతనుడున్ = హరి {సనాతనుడు - పురాతనుడు, విష్ణువు}; అయిన = ఐన; పద్మోదరుడున్ = హరి {పద్మోదరుడు - పద్మము ఉదరముననున్నవాడు, విష్ణువు}.

భావము:

వారు పదివేల సంవత్సరాలు నిష్ఠతో తపస్సు చేయగా దయామయుడు, అభయప్రదాత, సనాతనుడు అయిన శ్రీహరి…