పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-898-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి దర్శన పూర్వం బిహ
లోకములందు నా నృపాల తనయు లం
దిరి యే ఫలముల నందఱు
నితి నెఱింగింపు;" మన మునివరుఁడు పలికెన్.

టీకా:

హరి = విష్ణుమూర్తి; దర్శన = దర్శనమునకు; పూర్వమున్ = పూర్వము; ఇహ = ఇక్కడివి; పర = ఇతరములైన; లోకముల్ = లోకములు; అందున్ = లోను; ఆ = ఆ; నృపాలతనయులన్ = రాకుమారులు; అందిరి = పొందిరి; ఏ = ఎలాంటి; ఫలములన్ = ఫలితములను; అందఱున్ = వారందరు; నిరతిన్ = మిక్కిలి ఆసక్తితో; ఎఱిగింపుము = తెలుపుము; అనన్ = అనగా; ముని = మునులలో; వరుడు = శ్రేష్ఠుడు; పలికెన్ = పలికెను.

భావము:

శ్రీహరిని దర్శించటానికి ముందు ఈ లోకంలోను, పరలోకంలోను ఈ రాజపుత్రులు ఏ ఫలాలను పొందారు నాకు చెప్పు” అని విదురుడు అడుగగా మైత్రేయుడు ఇలా అన్నాడు.