పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-897-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డఁగి మఱి వారు యాదృచ్ఛిమున జేసి
రికి నిత్యప్రియుం డగు రునిఁ గాంచి
తని వలన యనుగ్రహ మంది మోక్ష
మంది రని చెప్పి; తది నిశ్చయంబు మఱియు

టీకా:

కడగి = పూని; మఱి = మరి; వారున్ = వారు; యాదృచ్ఛికమున = అనుకోకుండా జరిగినదాని; జేసి = వలననైను; హరి = విష్ణుమూర్తి; కిన్ = కి; నిత్య = శాశ్వతమైన; ప్రియుండు = ప్రియమైనవాడు; హరుని = శివుని; కాంచి = దర్శించి; అతని = అతని; వలని = నుండి; అనుగ్రహమున్ = అనుగ్రహమును; అంది = పొంది; మోక్షమున్ = ముక్తిని; అందిరి = పొందిరి; అని = అని; చెప్పితి = చెప్పితివి; అది = అది; నిశ్ఛయంబున్ = నిశ్ఛయమే; మఱియున్ = ఇంకను.

భావము:

వారు అప్రయత్నంగా శ్రీహరికి ఇష్టుడైన శివుని దర్శించి ఆయన అనుగ్రహం వల్ల మోక్షం పొందారని చెప్పావు. అది నిజమే!