పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు

  •  
  •  
  •  

4-896-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మునినాథ! ప్రచేతసు లా
మగు రుద్రోపదిష్ట మలోదర కీ
ర్తమున నే గతిఁ బొందిరి
జాక్షుఁడు సంతసింప వా రనఘాత్మా!

టీకా:

ముని = మునియైన; నాథ = ప్రభువా; ప్రచేతసులు = ప్రచేతసులు; ఆ = ఆ; ఘనము = మిక్కిలి గొప్పది; అగు = అయిన; రుద్ర = శివునిచే; ఉపదిష్ట = ఉపదేశింపబడిన; కమలోదర = విష్ణుమూర్తి {కమ లోదరుడు - కమలము ఉదరమున కలవాడు, విష్ణువు}; కీర్తనమునన్ = స్తోత్రమును; ఏ = ఏ; గతిన్ = విధముగ; పొందిరి = పొందిరి; = వనజాక్షుడు = విష్ణుమూర్తి {వనజాక్షుఁడు - వనజము (పద్మము) వంటి కన్నులు యున్నవాడు, విష్ణువు}; సంతసింపన్ = సంతోషించునట్లు; వారున్ = వారు; అనఘాత్మ = పుణ్యాత్ముడా.

భావము:

“మునీంద్రా! ప్రచేతసులు శివుడు ఉపదేశించిన స్తోత్రాన్ని జపించి, విష్ణువును సంతోషింపజేసి ఏ గతిని పొందారు?