పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-894-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాజర్షి యైనట్టి ప్రాచీనబర్హి దా-
గఁ బ్రజాపాలనార్థంబు సుతుల
రకు నియోగించి పము చేయుటకునై-
పిలాశ్రమంబున పుడు పోయి
చ్చట నియతి నేకాగ్రచిత్తుండును-
ముక్తసంగుండును భూరిధైర్య
యుక్తుండు నగుచును క్తియోగంబున-
నఘ! గోవిందపదారవింద

4-894.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చింతనామృత పాన విశేషచిత్తుఁ
గుచు విధిరుద్ర ముఖ్యుల కందరాని
వ్యయానందమయ పద మందె నప్పు
నుచు మైత్రేయముని విదురుకుఁ జెప్పి.

టీకా:

రాజర్షి = రాజులలో ఋషితుల్యుడు; ఐనట్టి = అయినట్టి; ప్రాచీనబర్హి = ప్రాచీనబర్హి; తాన్ = తను; తగ = శ్రీఘ్రముగ; ప్రజాపాలన్ = పరిపాలించెడి; అర్థంబున్ = కొరకు; సుతులన్ = పుత్రులను; ధర = భూమి; కున్ = కి; నియోగించి = ఏర్పరచి; తపమున్ = తపస్సును; చేయుట = చేయుట; కున్ = కు; ఐ = అయ్యి; కపిల = కపిలుని; ఆశ్రమంబున్ = ఆశ్రమము; కున్ = కి; అపుడున్ = అప్పుడు; పోయి = పోయి; అచ్ఛట = అక్కడ; నియతిన్ = నియమించుకొనిన; ఏకాగ్ర = ఏకాగ్రమైన; చిత్తుండును = మనసుకలవాడు; ముక్త = తొలగిన; సంగుండును = కోరికలుకలవాడు; భూరి = అత్యధికమైన; ధైర్య = ధైర్యము; యుక్తుండున్ = కలగినవాడు; అగుచున్ = అగుతూ; భక్తియోగంబునన్ = భక్తిమార్గమున; అనఘ = పాపములులేనివాడ; గోవింద = హరి; పద = పాదములు యనెడి; అరవింద = పద్మములను; చింతన = ధ్యానించుటయనెడి; ఆమృత = అమృతమును; పాన = తాగుటచేత; విశేష = విశిష్టమైన; చిత్తుడున్ = మనసుకలవాడు; అగుచున్ = అగుతూ.
= విధి = బ్రహ్మదేవుడు; రుద్ర = శివుడు; ముఖ్యుల్ = మొదలగువారి; కున్ = కిని; అందరాని = అందుకోలేని; అవ్యయ = తరుగని; ఆనంద = ఆనందముతో; మయ = నిండిన; పదమున్ = స్థితిని; అందెన్ = అందుకొనెను; అప్పుడు = అప్పుడు; అనుచున్ = అనుచూ; మైత్రేయ = మైత్రేయుడు యనెడి; ముని = ముని; విదురున్ = విదురుని; కున్ = కి; చెప్పి = చెప్పి.

భావము:

రాజర్షి అయిన ప్రాచీనబర్హి ప్రజారక్షణకు కొడుకులని నియోగించి, తప్పస్సు చేయటానికి కపిలాశ్రమానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో ముక్తసంగుడై, ఏకాగ్రచిత్తంతో, సద్భక్తియోగంతో గోవిందుని పాదపద్మాలను ఆరాధించాడు. బ్రహ్మ రుద్రాదులకు పొంద శక్యంకాని అవ్యయానందమయమైన పదాన్ని పొందాడు” అని మైత్రేయుడు విదురునితో చెప్పి…