పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-891-త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వరోత్తమ! యట్లు గాన మనంబె జీవుల కెల్ల సం
ణకారణ; మట్టి కర్మవశంబునన్ సకలేంద్రియా
ణుఁ డౌట నవిద్య గల్గును; సంతతంబు నవిద్యచేఁ
రఁగుటన్ బహుదేహకర్మనిబంధముల్ గలుగుం జుమీ!

టీకా:

నరవర = రాజులలో; ఉత్తమ = ఉత్తమమైనవాడ; అట్లు = ఆ విధముగ; కాన = అగుటచేత; మనంబె = మనసే; జీవుల్ = జీవుల; కున్ = కు; ఎల్లన్ = అన్నిటికి; సంసరణ = సంసారము యొక్క; కారణము = కారణము; అట్టి = అటువంటి; కర్మ = కర్మమునకు; వశంబునన్ = వశమగుటచే; సకల = సర్వ; ఇంద్రియా = ఇంద్రియములవెనుక; చరణుడు = చరించెడివాడు; ఔటన్ = అగుటచేత; అవిద్య = ఆత్మవిద్యకానిది; కల్గును = కలుగును; సంతతంబున్ = ఎల్లప్పుడు; అవిద్య = అవిద్య; చేన్ = చేత; పరగుటన్ = ప్రసిద్ధుడు అగుటవలన; బహు = అనేక; దేహ = శరీరములు; కర్మ = కర్మములు; నిబంధముల్ = గట్టి బంధములు; కలుగున్ = కలుగును; చుమీ = సుమా.

భావము:

రాజా! కాబట్టి మనస్సే జీవులందరికీ జన్మకారణం. కర్మ వశాన అవిద్య కలుగుతుంది. అవిద్య చేత దేహానికి కర్మబంధం కలుగుతుంది. కర్మబంధం వల్ల బహు జన్మలను పొందక తప్పదు సుమా!