పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-888-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుహిత శుద్ధ సత్త్వగుణ శోభితమున్ సరసీరుహోద రో
త్త గుణచింతనాపరము న్యము నైన మనంబునందు భూ
ణ! సుధాంశునందు నుపరాగమునన్ దివిఁ దోచు రాహు చం
మునను గోచరంబగు నుదారత నీ యఖిలప్రపంచమున్. "

టీకా:

సు = మిక్కిలి; మహిత = గొప్పదైన; శుద్ధ = స్వచ్ఛమైన; సత్త్వగుణ = సత్త్వగుణములచే; శోభితమున్ = శోభించెడిది; సరసీరుహోదర = విష్ణుని {సరసీరు హోదరుడు - సరసీరుహము (పద్మము) ఉదరమున గలవాడు, విష్ణుమూర్తి}; ఉత్తమ = ఉత్తమమైన; గుణ = గుణములను; చింతనా = ధ్యానించుట యందు; పరమున్ = లగ్నము; ధన్యమున్ = పుణ్యవంతము; ఐన = అయిన; మనంబున్ = మనసు; అందున్ = అందు; భూరమణ = రాజా {భూరమణుడు - భూమికి మగడు, రాజు}; సుధాంశున్ = చంద్రుని; అందున్ = లో; ఉపరాగమునన్ = గ్రహణ సమయము నందు; దివిన్ = ఆకాశమున; తోచున్ = తోచెడి; రాహు = రాహువు; చందముననున్ = వలె; గోచరంబున్ = కనిపించెడిది; అగున్ = అగును; ఉదారతన్ = గొప్పగా; ఈ = ఈ; అఖిల = సమస్తమైన; ప్రపంచమున్ = లోకమును.

భావము:

శుద్ధ సత్త్వగుణం కలిగి వాసుదేవుని ఉత్తమ గుణాలను ధ్యానించటంలో నిమగ్నమైన మనస్సులో, గ్రహణం నాడు చంద్రమండలంలో రాహువు కనిపించినట్లు ప్రపంచం సర్వం కనిపిస్తుంది”.