పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-886-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్షితి నుభయేంద్రియ కర్మ
స్థితు లనుభవ మందఁబడిన చిత్తము పగిదిన్
ధృతిఁ జిత్తవృత్తులను ల
క్షి మగుఁ దత్పూర్వ దేహకృత కర్మంబుల్.

టీకా:

క్షితిన్ = భూలోకమున; ఉభయ = రెండు (2), జ్ఞాన కర్మ; ఇంద్రియ = ఇంద్రియములచే; కర్మ = చేయబడిన కర్మల; స్థితులను = పరిస్థితుల యొక్క; అనుభవమున్ = అనుభవమును; అందబడిన = అందుకోబడిన; చిత్తము = మనసు; పగిదిన్ = వలె; ధృతిన్ = ధరించిన; చిత్తవృత్తులను = ప్రవర్తనములను; లక్షితము = గమనింపబడినది; అగున్ = అగును; తత్ = దాని; పూర్వ = ముందటి; దేహ = శరీరముచే; కృత = చేయబడిన; కర్మంబుల్ = కర్మములు.

భావము:

జ్ఞానరూపాలు, కర్మరూపాలు అయిన ఇంద్రియాల కర్మ ప్రపంచంచేత చిత్తాన్ని ఊహింపవచ్చు. అలాగే చిత్త వృత్తులను బట్టి పూర్వదేహం చేత చేయబడిన కర్మలను ఊహించవచ్చు.