పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-884.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్థితో ఘటియించి లోకాంతరమును
బొంది తత్కర్మఫలమును బొందు ననుచుఁ
బ్రకటముగ వేదవేత్తలు లుకుచుందు
న్న నది యెట్లు విన నుపన్న మగును?

టీకా:

అనఘాత్య = పుణ్యాత్మ; ఏమిటి = దేని; అందున్ = అందు; ఈ = ఈ; ఇంద్రియ = ఇంద్రియముల; వృత్తులు = వర్తనలు; తగన్ = శ్రీఘ్రమే; ప్రవర్తింపక = వర్తించకుండగ; ఉండుటనున్ = ఉండుట; చేసి = వలన; ఋషులు = ఋషులు; ఐన = అయిన; ఘనముగన్ = గొప్పగా; మోహింతురు = మోహించెదరో; అట్టి = అటువంటి; అర్థమున్ = ప్రయోజనము; అందున్ = అందు; ఆత్మన్ = మనసులో; సంశయమున్ = సంశయము; కల్గుచున్నది = కలుగుతున్నది; అది = అది; ఎట్టిది = ఎటువంటిది; అనిననున్ = అనినచో; పురుషుండు = పురుషుడు; ఏయే = ఏయే; దేహముననున్ = శరీరము; చేసి = వలన; కర్మముల్ = కర్మములు; చేసి = చేసి; తత్ = ఆయా; కాయంబున్ = దేహములను; ఈ = ఈ; లోకమున్ = లోకము; అందునే = లోనే; విడిచి = వదలివేసి; తాన్ = తను; అన్య = ఇంకొక; దేహమున్ = దేహమును; అర్థితోన్ = కోరి.
ఘటియించి = పొంది; లోక = లోకము; అంతరమునున్ = ఇంకొకదానిని; పొంది = పొంది; తత్ = ఆ; కర్మ = కర్మముయొక్క; ఫలమును = ఫలితమును; పొందును = పొందును; అనుచున్ = అని; ప్రకటముగన్ = ప్రసిద్ధముగ; వేద = వేదము; వేత్తలు = తెలిసినవారు; పలుకుచుందురు = చెపుతుంటారు; అన్నన్ = అనగా; అది = అది; ఎట్లు = ఏ విధముగ; వినన్ = అంగీకరించుటకు; ఉపపన్నము = సమంజసమైనది; అగును = అగుతుంది.

భావము:

పుణ్యాత్మా! ఇంద్రియ వృత్తులలో అప్రవృత్తులై ఋషులు మోహించే అర్థం గురించి నాకు సంశయం కలుగుతున్నది. పురుషుడు ఏ దేహం చేత కర్మలు చేస్తాడో ఆ దేహాన్ని ఈ లోకంలోనే విడిచిపెట్టి తాను మరొక దేహాన్ని ధరించి మరొక లోకాన్ని చేరి అక్కడ కర్మఫలాన్ని అనుభవిస్తాడని వేదవేత్తలు చెపుతారు. ఇది ఎలా పొసగుతుంది?