పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-883-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రుతంబును విచారితంబును నయ్యె; గర్మనిష్ఠు లగు నుపాధ్యాయు లైనవార లీ యాత్మతత్త్వంబు నెఱుంగ; రెఱింగిరేని నుపదేశింపరు; కావునఁ దత్కృతంబైన మహాసంశయంబు నీ చేత నివృత్తం బయ్యె;” నని వెండియు నిట్లనియె.

టీకా:

శ్రుతంబునున్ = వినబడినది; విచారితంబునున్ = తర్కించి తెలియబడినది; అయ్యెన్ = అయ్యెను; కర్మ = కర్మము లాచరించుట యందు; నిష్ఠులు = నిష్ఠ గల వారు; అగు = అయిన; ఉపాధ్యాయులు = తెలియజెప్పువారు; ఐన = అయినట్టి; వారలు = వారు; ఈ = ఈ; ఆత్మత్త్వంబున్ = ఆత్మతత్త్వమును; ఎఱుంగరు = తెలియరు; ఎఱింగిరేనిన్ = తెలిసినను; ఉపదేశింపరు = తెలియజెప్పరు; కావునన్ = అందుచేత; తత్ = వారిచే; కృతంబున్ = కలిగించబడినవి; ఐన = అయిన; మహా = గొప్ప; సంశయంబున్ = అనుమానములు; నీ = నీ; చేతన్ = చేత; నివృత్తంబున్ = తీర్చబడినవి; అయ్యెన్ = అయినవి; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

విని బాగా ఆలోచించాను. నాకు కర్మను బోధించిన ఆచార్యులకు ఈ ఆత్మతత్త్వం తెలియదు. తెలిస్తే కర్మని ఉపదేశింపరు కదా! ఆ ఆచార్యుల ఉపదేశం చేత నాకు ఆత్మతత్త్వం విషయంలో కలిగిన మహాసంశయం నీ వల్ల పటాపంచలయింది” అని ఇంకా ఇలా అన్నాడు.