పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

 •  
 •  
 •  

4-880-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లి సుమనో వాటిల యందు నల్ప ప్ర-
సూ మరంద గంధానుమోద
సంచారియును మృగీహితముఁ దన్నివే-
శి చిత్తమును మధువ్ర నినాద
మేదుర శ్రవణానుమోదితమును బురో-
భాగ చరన్నిజ ప్రాణహారి
దీపిత వృక గణాధిష్ఠితమును లుబ్ధ-
క్రూర ఘన సాయప్రభిన్న

4-880.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పృష్టభాగంబునై తగ నెదను మృత్యు
భీతి వాటిల్ల నొండు దప్పింప వెరవు
గాన కడవిఁ జరించు మృగంబు పగిది
భూవరోత్తమ! వినవయ్య! పురుషుఁ డెపుడు.

టీకా:

లలిన్ = చక్కగా; సుమనః = పుష్పముల; వాటికలు = వరుసలు; అందున్ = లోని; అల్ప = చిన్న; ప్రసూన = పూల యందలి; మరంద = మకరందము యొక్క; గంధా = సువాసనలచే; అనుమోద = సంతోషించుచు; సంచారియున్ =
చక్కగాతిరుగునది; మృగీ = ఆడులేడితో; సహితమున్ = కూడియున్నది; తత్ = దానియందు; నివేశిత = లగ్నమైన; చిత్తమును = మనస్సుగలది; మధువ్రత = తేనెటీగల; నినాద = శబ్దములతో; మేదుర = దట్టమైన; శ్రవణ = వినుటకు; అనుమోదితమును = సంతోషించుచుయున్నది; పురో = ఎదుట; భాగ = వైపున; చరత్ = చరించుతున్న; నిజ = తన; ప్రాణ = ప్రాణములను; హారి = హరించు; దీపిత = చెలరేగిన; వృక = తోడేళ్ల; గణ = గుంపుచే; అధిష్ఠితము = దగ్గరనిలుచున్నది; లుబ్దక = వేటగాని యొక్క; క్రూర = క్రూరమైన; ఘన = పెద్ద; సాయక = బాణముచే; ప్రభిన్న = బద్దలైన. పృష్ట = వెనుక; భాగంబున్ = భాగముకలది; ఐ = అయ్యి; తగన్ = మిక్కిలి; ఎదను = హృదయమున; మృత్యు = మరణము యొక్క; భీతి = భయము; వాటిల్లన్ = కలుగుతుండగా; ఒండు = ఏ విధముగను; తప్పింపన్ = తప్పించుకొన; వెరవున్ = ఉపాయము; కానక = కనుగొనలేక; అడవిన్ = అడవిలో; చరించు = తిరిగెడి; మృగంబున్ = లేడి; పగిదిన్ = వలె; భూవర = రాజులలో; ఉత్తమ = శ్రేష్టుడా; వినవు = వినుము; అయ్యా = తండ్రీ; పురుషుడు = పురుషుడు; ఎపుడున్ = ఎప్పుడును.

భావము:

అందమైన పూలతోటలో హాయిగా విహరిస్తూ చిన్నారి పూలతేనెలకు, కమ్మని సువాసనలకు, జుమ్మనే తుమ్మెద పాటలకు ప్రీతి చెందుతూ ఒక మగలేడి ఆడులేడితో కలిసి నెమ్మదిగా సంచరిస్తున్నది. దాని మనస్సు ఆడలేడి మీదనే నిమగ్నమై ఉంది. ఆ మగలేడికి ముందుభాగంలో ప్రాణాలకు హాని కలిగించే తోడేళ్ళ గుంపు తిరుగుతున్నది. ఇంతలో వెనుకనుండి ఒక బోయవాడు విడిచిన వాణి బాణం లేడి పృష్ఠభాగాన్ని చీల్చి వేసింది. తప్పించుకొనే దారిలేక ఆ మగలేడి అడవిలో మృత్యువు పాలయింది. రాజేంద్రా! విను. పురుషుడు ఆ మగలేడి వంటివాడే.