పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-879-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

" అనీశ! యీ విధంబున
దీయప్రశ్నమిట్లు రిహృత మయ్యెం;
విలి యిఁక నొక్క గోప్యము
విరించెదఁ జిత్తగింపు విమలచరిత్రా!

టీకా:

అవనీశ = రాజా; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; భవదీయ = నీ యొక్క; ప్రశ్నము = అనుమానము; ఇట్లు = ఈ విధముగ; పరిహృతమున్ = పరిహరింప బడినది (తొలగింపబడినది); అయ్యెన్ = అయినది; తవిలి = పూనుకొని; ఇకన్ = ఇంక; ఒక్క = ఒక; గోప్యమున్ = రహస్యమును; వివరించెదన్ = వివరముగా చెప్పెదను; చిత్తగింపుము = శ్రద్ధగావినుము; విమలచరిత్రా = స్వచ్ఛమైన వర్తన కలవాడా.

భావము:

“రాజా! నీ ప్రశ్నకు పూర్తిగా సమాధానం చెప్పాను. ఇక ఒక రహస్యం వివరిస్తాను. సావధానంగా విను.