పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-877.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వారు వేదజ్ఞు లనఁ దగువారు గారు
రూఢి మఱి వారు నిత్యస్వరూపభూత
మైన యీ యాత్మతత్త్వంబు లరు వేద
లిత తాత్పర్య మని యాత్మఁ దెలియ లేరు

టీకా:

కావునన్ = అందుచేత; రాజ = రాజులలో; ఇంద్ర = ఇంద్రునివంటివాడా; నీవునున్ = నీవు; పరమార్థ = పరమార్థము యొక్క; రూపంబుల్ = రూపములు కలవి; అగుచున్ = అగుచూ; ప్రరోచమానములునున్ = మిక్కిలి కాంతివంతములు; కర్ణ = చెవులకు; ప్రియంబులునున్ = ఇంపైనవి; అస్పృష్ట = తాకబడని; = వస్తువులునున్ = వస్తువులు; ఐ = అయ్యి; వివిధ = అనేకవిధములైన; కర్మముల్ = కర్మములు; అందున్ = ఎడల; పురుషార్థ = పరమార్థములు యనెడి; బుద్ధిన్ = అనుకొనుట; కావింపకుము = చేయకుము; అతి = మిక్కిలి; = ఘన = నిండైన; స్వాంతులు = మనసుకలవారు; ఐనట్టి = అయినట్టి; వారున్ = వారు; పరగున్ = ప్రసిద్దమగు; జనార్థన = నారాయణుని {జనార్థనః - జనులకు పరమ ప్రయోజనము యైనవాడు, జనులచే పురుషార్థము కోరబడువాడు, విష్ణువు, విష్ణుసహస్రనమము, 126వ నామం శ్రీ శంకర భాష్యం}; ప్రతిపాదికంబులున్ = స్థాపించునవి; ఐన = అయిన; శ్రుతికర్మ = వేదవిధులే; పరము = పరమార్థము; అని = అని; చూపుచుండు = చూపెడి.
వారున్ = వారు; వేద = వేదములను; జ్ఞులున్ = తెలిసినవారు, జ్ఞానులు; అనన్ = అనటకు; తగు = తగిన; వారు = వారు; కారు = కారు; రూఢిన్ = నిశ్ఛయముగా; మఱి = మఱి; వారు = వారు; నిత్య = శాశ్వత; స్వరూపభూతము = స్వరూపమైనట్టిది; ఐన = ఐయిన; ఈ = ఈ; ఆత్మతత్త్వంబున్ = ఆధ్యాత్మతత్వములో; అలరు = ఒప్పియుండెడి; వేద = వేదములందు; కలిత = కల; తాత్పర్యము = పరమార్థము; అని = అని; ఆత్మన్ = మనసులో; తెలియన్ = తెలిసికొన; లేరు = సమర్థులుకారు.

భావము:

కాబట్టి రాజేంద్రా! పరమార్థాల వలె కనిపిస్తూ, ఆసక్తి కల్పిస్తూ, వినటానికి ఇంపై, అవాస్తవాలైన ఈ వివిధ కర్మలను పరమార్థాలు అని అనుకోకు. మలిన బుద్ధులు జనార్దనుని ప్రతిపాదించే వేదాన్ని కర్మపరమని వాదిస్తారు. వారు వేదతత్త్వం తెలిసినవారు కారు.