పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-867-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున నది తత్కథాకర్ణన గాన నిరతుండు, విశ్వాస సంయుక్తుండు నైన వానికి సంభవించు మఱియును.

టీకా:

కావునన్ = అందుచేత; అది = అది, ఆభక్తి; తత్ = ఆ; కథా = కథలను; ఆకర్ణన = వినుట; గాన = పాడుట లందు; నిరతుండు = మిక్కిలి ఆసక్తి కలవాడు; విశ్వాస = నమ్మికతో; సంయుక్తుడు = చక్కగా కూడినవాడు; ఐన = అయిన; వాడు = వాడు; కిన్ = కి; సంభవించున్ = కలుగును; మఱియున్ = ఇంకను.

భావము:

కావున ఆ భక్తి ఎల్లప్పుడు వాసుదేవుని కథలను వినడం వలన, గానం చేయడం వలన కలుగుతుంది. ఇంకా…