పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పూర్వ సఖుని ఉవాచ

  •  
  •  
  •  

4-865-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురుషార్థభూత మనఁగాఁ దగు నాత్మకు నే నిమిత్తమై
యొర ననర్థహేతు వన నూల్కొను సంసృతి సంభవించు న
ట్లయముఁ దన్నిమిత్త పరిహారక మర్థి జగద్గురుండు నాఁ
రిన వాసుదేవ పద తామరసస్ఫుటభక్తి యారయన్.

టీకా:

ఘన = పరమ; పురుష = పురుష; అర్థభూతము = ప్రయోజన మైనట్టిది; అనగాన్ = అనుటకు; తగున్ = తగిన; ఆత్మ = ఆత్మ; కున్ = కు; ఏ = ఏ; నిమిత్తమున్ = కారణముగా; ఐన్ = అయితే; ఒనరన్ = సమకూరు; అనర్థ = కీడునకు; హేతువు = కారణము; అనన్ = అనగా; నూల్కొని = పూనుకొని; సంసృతిన్ = సంసారము; సంభవించున్ = కలుగునో; అట్లు = ఆ విధముగ; అనయమున్ = ఎల్లప్పుడు; తత్ = దాని; నిమిత్త = కారణమును; పరిహారకము = తొలగించునది; అర్థిన్ = అవశ్యము; జగత్ = భువనమునకు; గురుండున్ = గురువు; నాన్ = అనగా; తనరిన = విస్తరించిన; వాసుదేవ = విష్ణుమూర్తి యొక్క; పద = పాదములు అనెడి; తామరసన్ = పద్మముల ఎడ; స్ఫుట = వికసించిన; భక్తి = భక్తియే; ఆరయన్ = చరచి చూసినచో.

భావము:

పరమ పురుషార్థం అనదగిన ఆత్మకు ఏ కారణం వల్లనైనా అనర్థాలను కలిగించే సంసారం కలుగుతుందో, ఆ కారణాన్ని జగద్గురుడైన వాసుదేవుని పాదపద్మాలమీది భక్తి నశింపజేస్తుంది.